వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 23వ వారం
Jump to navigation
Jump to search
సుందర్‌లాల్ బహుగుణ |
---|
సుందర్‌లాల్ బహుగుణ (1927 జనవరి 9 - 2021 మే 21) గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమ ఆలోచన అతని భార్యకు వచ్చింది. దీనిని అతను కార్యరూపంలో చేపట్టాడు. హిమాలయాలలో అడవుల సంరక్షణ కోసం పోరాడాడు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు తెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతను భారతదేశ ప్రారంభ పర్యావరణవేత్తలలో ఒకడు. తరువాత అతను చిప్కో ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రజలతో కలసి పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా పర్యావరణ సమస్యలపై ఉద్యమాలను చేపట్టడం ప్రారంభించాడు. వృక్షాల కోసమే కాకుండా, అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం కూడా పరితపించాడాయన. (ఇంకా…) |