వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 34వ వారం
స్వరూపం
రోనాల్డ్ రాస్ |
---|
సర్ రోనాల్డ్ రాస్ బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఇతను మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. 1897 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని ఋజువైంది. ఈ వ్యాధిని ఎదుర్కొనే పద్ధతికి పునాది వేసింది. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక కవితలు రాసాడు, అనేక నవలలను ప్రచురించాడు. పాటలను స్వరకల్పన చేసాడు. ఆయన కళాభిలాషి, గణిత శాస్త్రవేత్త కూడా. భారతీయ వైద్య సేవలో 25 సంవత్సరాలు పనిచేశాడు. తన సేవలోనే అతను సంచలనాత్మక వైద్య ఆవిష్కరణ చేశాడు. భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత, లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లో అధ్యాపకునిగా చేరాడు. 10 సంవత్సరాల పాటు ఆ సంస్థలో ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసరుగా, చైర్మను గా కొనసాగాడు. 1926 లో అతను రాస్ ఇన్స్టిట్యూట్, హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ లకు డైరెక్టర్-ఇన్-చీఫ్ అయ్యాడు. ఇది అతని రచనలను గౌరవించటానికి స్థాపించబడింది. ఆయన చనిపోయే వరకు అక్కడే పనిచేశాడు. (ఇంకా…) |