వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 09వ వారం
స్వరూపం
ఆఫ్రికా నుండి హోమినిన్ల తొలి వలసలు |
---|
పాత రాతియుగం మలి దశ నుండి మధ్య రాతియుగం తొలి నాళ్ళ వరకూ, అంటే సుమారు 21 లక్షల ఏళ్ళ క్రితానికి 2 లక్షల ఏళ్ళ క్రితానికీ మధ్యన, ఆఫ్రికా నుండి యురేషియా అంతటా పురాతన మానవుల (హోమో జాతి) విస్తరణలు జరిగాయి. ఈ విస్తరణ లన్నింటినీ కలిపి ఆప్రికా నుండి బయటకు -1 (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 1) అని పిలుస్తారు. హోమో సేపియన్స్ (శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు) యురేషియాలోకి విస్తరించిన ఘటన, ఇదీ వేరువేరు. హోమో సేపియన్ల విస్తరణ 2 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై ఉండవచ్చు. దాన్ని "ఆఫ్రికా నుండి బయటకు -2" (అవుట్ ఆఫ్ ఆఫ్రికా II) అని పిలుస్తారు). ఆఫ్రికా వెలుపల హోమో తొట్టతొలి ఉనికి 20 లక్షల సంవత్సరాల క్రితం నాడు జరిగింది. మధ్య చైనాలోని షాంగ్‌చెన్ వద్ద 21.2 లక్షల సంవత్సరాల నాడే మానవ ఉనికి ఉన్నట్లుగా 2018 లో చేసిన రాతి పనిముట్ల అధ్యయనం ద్వారా కనుగొన్నామని చెప్పుకొన్నారు. ఆఫ్రికా బయట లభించిన అత్యంత పురాతన మానవ అస్థిపంజర అవశేషాలు జార్జియా లోని ద్మానిసి లో (ద్మానిసి పుర్రె 4) లభించాయి. ఇవి 18 లక్షల సంవత్సరాల క్రితం నాటివి. ఈ అవశేషాలను హోమో ఎరెక్టస్ జార్జికస్ అని వర్గీకరించారు. (ఇంకా…) |