Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 36వ వారం

వికీపీడియా నుండి

యలవర్తి నాయుడమ్మ

యలవర్తి నాయుడమ్మ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్య గరపి అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు. అమెరికా లోని లీ హై యూనివర్సిటీ లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం మీద డాక్టరేట్ (పి.హె.డి) డిగ్రీ పొందారు. అమెరికా లోని చర్మ పరిశుభ్రం చెసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ(మద్రాసు) లో శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు మేళవించగా, అమెరికా లో చేసిన పరిశోధనా కృషి ఫలవంతమైనది. తిరిగి మాతృదేశానికి వచ్చి, 1951 లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీ లో శాస్త్రవేత్తగా చేరారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థనూ సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. 1956 లో డైరక్టర్ గా పదోన్నతి పొందారు. "సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం" అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు.

(ఇంకా…)