వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 03వ వారం
స్వరూపం
థార్ ఎడారి |
---|
థార్ ఏడారి భారత దేశానికి వాయువ్య దిశలో భారత పాకిస్తాన్ సరిహద్దులలో ఉన్నది. ఈ ఎడారిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తారు. ఈ ఎడారి ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రములో, కొంత భాగము హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రములో, కొద్ది భాగము పాకిస్తాన్ దేశములోని పంజాబ్ రాష్ట్రములో విస్తరించి ఉన్నది. పాకిస్తాన్లో విస్తరించి ఉన్న ఎడారిని ఖలిస్తాన్ ఎడారి అని పిలుస్తారు. థార్ ఎడారి భౌగోళిక సరిహద్దులు వాయువ్యాన సట్లెజ్ నది, తూర్పున ఆరావళీ పర్వత శ్రేణులు, దక్షిణాన రాణ్ ఆఫ్ కచ్ సాల్ట్ మార్ష్ (ఉప్పుకయ్య), పశ్చిమాన సింధూ నది. ఉత్తరాన థార్ ఎడారికి, విశాలమైన ముళ్ళపొదల భూములకు ఉన్న సరిహద్దు ఖచ్చితంగా నిర్వచించబడలేదు. అందువళ్ళ ఏ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారో, తీసుకోలేదో అన్న విషయముపై థార్ ఎడారి పరిమాణము యొక్క అచంనాలు గణనీయంగా మారుతుంటాయి. వర్డల్ వైడ్ ఫండ్ వారి నిర్వచనం ప్రకారం, ఎడారి ప్రాంతం 92,200 చదరపు మైళ్ళు (238,700 చ.కి.మీ). ఇతర ఆధారాల ప్రకారం 805 కి.మీ పొడవు (500 మైళ్ళు) 485 కి.మీ (300 మైళ్ళు) వెడల్పుతో 446,000 చదరపు కి.మీల వైశాల్యములో ఉన్నది. భారత దేశ భూభాగములో ఉన్న ఈ ఎడారి 61% రాజస్థాన్ లో 20% గుజరాత్ లో 9% పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది. (ఇంకా…) |