వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 19వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 19వ వారం
భారతదేశ కార్టూన్ రంగ చరిత్రలో ఆర్.కె. లక్ష్మణ్ సృష్టించిన "సామాన్య మానవుడు" (కామన్ మాన్) అనితర ప్రాచుర్యం పొందినది. లక్ష్మణ్ వేసిన దాదాపు అన్ని రాజకీయ వ్యంగ్య చిత్రాలలోను ఈ సామాన్య మానవుడు సాక్షిగా నిలుస్తూ, ఎన్నడూ ఒక్క మాటకూడ మాట్లాడడు. ముంబాయిలో వర్లీ సముద్ర తీరంలో, సామాన్య వ్యక్తికి ఒక లోహ విగ్రహం ప్రతిష్టించారు. బారతదేశంలో ఒక కార్టూన్ పాత్రకు ఒక విగ్రహం ఉండటం ఇదొక్కచోటే!
ఫోటో సౌజన్యం: శివరామ ప్రసాదు