వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 2వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 2వ వారం
గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన ఉండవల్లిలోని ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం అంచున ఉంది. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. ఇది నాలుగు అంతస్తులుగా నిర్మించబడింది. మద్యలో స్థంబాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఇక్కడ కొలువైన దేవుళ్ళు.
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్