Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 50వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2007 50వ వారం
గద్దెవారిగూడెం ప్రాధమిక పాఠశాల

పశ్చిమ గోదావరి జిల్లాలో గద్దేవారిగూడెం అనే ఒక చిన్న గ్రామంలో ప్రాధమిక ప్రభుత్వ పాఠశాల. ఉదయం పాఠాలు ప్రారంభించే ముందు విద్యార్ధులు 'అసెంబ్లీ'లో హాజరవుతారు. జాతీయ గీతాలు, ప్రతిజ్ఞ, నీతి సూక్తులు, వార్తలు వంటివి చదువుతారు. ఇటువంటి మారుమూలల పల్లెలలో ఉన్న జనాభాలో అత్యధికులు ఆర్ధికంగా వెనుకబడినవారు. అటువంటి వర్గాలలో అక్షరాస్యత పెంచడానికి ఇలాంటి చిన్న బడులే ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.5% ఉన్నది. (పురుషులలో 70.3%, స్త్రీలలో 50.4%)

ఫోటో సౌజన్యం: కాసుబాబు