వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 44వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2007 44వ వారం
సువర్ణముఖి నదీ తీరమున శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూలింగముగా వెలసిన శైవ పుణ్యక్షేత్రము శ్రీకాళహస్తి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తిలోని లింగము పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగము. ఇక్కడ లింగమునకెదురుగా వున్న రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది.
ఫోటో సౌజన్యం: కె.కళ్యాణ్