వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 36వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2007 36వ వారం

తమిళనాడు రాష్ట్రములోని రామేశ్వరము వద్ద ఉన్న పాక్ జలసంధిపై నున్న ఈ వంతెన ప్రపంచములోనే అతి పురాతనమైన సముద్రంపై నున్న వంతెనలలో ఒకటి. దీనిని 1911-1913 సంవత్సరముల మధ్య నిర్మించి 1914 సంవత్సరము నుండి రైలు బండ్లు నడవడానికి తెరిచారు. 1964 సంవత్సరములో వచ్చిన తుఫానులో దెబ్బ తిన్న ఈ వంతెనను 47 రోజులలో బాగు చేశారు. 2004 సంవత్సరములో వచ్చిన సునామీలో ఈ వంతెన దెబ్బతినలేదు.
ఫోటో సౌజన్యం: బాబు.ఎం