Jump to content

వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/రవిచంద్ర

వికీపీడియా నుండి

రవిచంద్ర

సభ్యులందరికీ నమస్కారం. నేను తెలుగు వికీపీడియాలో గత పదహారేళ్ళకు పైగా పనిచేస్తున్నాను. సుమారు పదిహేనేళ్ళకుపైగా నిర్వహకుడిగా ఉన్నాను. వికీలో మొదటి పేజీ శీర్షికలు నిర్వహించడంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. వృత్తి రీత్యా ఇంజనీరును కాబట్టి సాంకేతిక విషయాలపై అవగాహన ఉంది. గతంలో చాలా ప్రాజెక్టుల్లో పనిచేశాను. చర్చల్లో పాల్గొన్నాను. చర్చల్లో పాల్గొనని వాడిగా నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ప్రస్తుతం తెలుగు వికీలో క్రియాశీలకంగా ఉండే అధికారుల కొరత ఉన్నందున చొరవచేసి అధికారిక హోదాకు స్వీయ ప్రతిపాదన మీ ముందు ఉంచుతున్నాను. మీ అభిప్రాయాలు, మద్ధతు, వ్యతిరేకత ఏదైనా కింద రాయండి. - రవిచంద్ర (చర్చ) 17:53, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]


కాల పరిమితి (2023, జూన్ 25 నుండి జూలై 1 వరకు)

మద్దతు (In favour)
  1. రవిచంద్ర గారు అధికారిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించగల శక్తి, నేర్పు అతనిలో ఉన్నవని భావించి,అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:35, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నిర్వాహకుడిగా క్రియాశీలంగా వ్యవహరిస్తూ తెలుగు వికీ అభివృద్ధికి కృషిచేస్తున్న రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి నా మద్దతును తెలియజేస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:40, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  3. మద్దతు (In favour) : శ్రీ రవిచంద్ర గారు ఉత్సాహవంతులు, నేర్పు, విజ్ఞానం,భాషపై పట్టు, కృషి బాధ్యతలు గలవారు. తెలుగు వికీపిడియాకు చాలా ఉపయోగపడుతారు. వారి అధికారిక హోదాకు నా పూర్తి మద్దతు ఉంది. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 03:11, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. మద్దతు (In favour) : రవిచంద్ర గారు వికీపీడియా పట్ల అంకితభావం ఆధారంగా, వారి నైపుణ్యం, నాయకత్వం,ఇతర సంపాదకులతో కలిసి పనిచేస్తూ, నిర్మాణాత్మకంగా చర్చలకు మార్గనిర్దేశం చేసే వారి సామర్థ్యం ఆదర్శనీయం, తటస్థత పట్ల నిబద్ధత నిష్పాక్షికతతో, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తారని, వికీపీడియా నిరంతర ఎదుగుదలకు, మెరుగుదలకు దోహదం చేస్తారని నాకు నమ్మకం ఉంది, రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి మద్దతు తెలియజేస్తున్నాను. --Kasyap (చర్చ) 06:48, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  5. నిర్వాహకునిగా రవిచంద్ర గారు క్రమంతప్పక తెలుగు వికీపీడియాలో కృషి సాగిస్తున్నారు. ఆయనకు వికీపీడియా నియమాల పట్ల, రచన పట్ల ఉన్న లోతైన అవగాహన, ఆయన నిష్పాక్షిక ధోరణి ఆయన నిర్వహణా చర్యల్లోనూ, నిర్ణయాల్లోనూ ప్రతిఫలించడం గమనించాను. అందుకుతోడు, చురుగ్గా ఉన్న అధికారులు తక్కువైన ఈ సమయంలో ఆయన అవసరం మరింతగా కనిపిస్తోంది. కనుక, ఆయన అధికార హోదాకు చేసుకున్న స్వీయప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 07:01, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  6. వికీ నియమాల పట్ల మంచి అవగాహన ఉన్న రవిచంద్ర నిర్వాహకునిగా తెలుగు వికీపీడియాలో తన కృషి కొససాగిస్తున్నారు. క్రియాశీలకంగా ఉండి వికీ అభివృద్ధికి కృషిచేస్తున్న రవిచంద్ర గారికి అధికారి హోదా పొందడానికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 10:09, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  7. రవిచంద్ర గారు వికీపీడియా పట్ల అంకితభావం, సాంకేతిక నైపుణ్యం, నాయకత్వం, ఇతర సంపాదకులతో కలిసి పనిచేయగలగడం, నిర్మాణాత్మకంగా చర్చలకు మార్గనిర్దేశం చేసే వారి సామర్థ్యం ఆదర్శనీయం, తటస్థత పట్ల నిబద్ధత నిష్పాక్షికతతో, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, వికీపీడియా నిరంతర ఎదుగుదలకు, మెరుగుదలకు దోహదం చేయగలరు. రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి నా మద్దతు తెలియజేస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 13:20, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  8. రవిచంద్ర గారికి నా మద్ధతు --Muralikrishna m (చర్చ) 17:02, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  9. రవిచంద్ర గారికి అధికార హోదా పొందటానికి నా మద్ధతు తెలియచేస్తున్నాను. --VJS (చర్చ) 06:07, 27 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  10. రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి నేను మద్దతు ఇస్తున్నాను.--Divya4232 (చర్చ) 07:09, 27 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  11. రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి నా మద్ధతు తెలియచేస్తున్నాను.----Tmamatha (చర్చ) 07:11, 27 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  12. రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి నా మద్ధతు తెలియచేస్తున్నాను.----V Bhavya (చర్చ) 07:44, 28 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  13. రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి నా మద్ధతు తెలియచేస్తున్నాను.--Batthini Vinay Kumar Goud (చర్చ) 16:39, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  14. రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి నా మద్ధతు తెలియచేస్తున్నానుCh Maheswara Raju☻ (చర్చ) 17:05, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  15. కొన్నేళ్ళుగా వికీలో రవిచంద్ర గారి పనిని చూస్తూ ఉన్నాను. వికీ విధానాలను, పద్ధతులను, మర్యాదనూ పాటించడంలో ఆయన ఆదర్శప్రాయంగా ఉంటారు. సమష్టి కృషి లోనూ ముందుంటారు. చర్చల్లో అభిప్రాయాలను చెప్పడం, చర్చలకు ముగింపు నివ్వడం వంటివి చేయడం లోనూ ముందుంటారు. వివాదాస్పద విషయాల్లో నిష్పాక్షికంగా ఉండడంలో ఆయన నేర్పరి. వికీ పట్ల ఆయన ఎంతో నిబద్ధత చూపిస్తారు. కొత్తవారికి నేర్పించడంలో ఓర్పును ప్రదర్శిస్తారు. నేను ఆయన చర్చ పేజీలో దాదాపు 20 మంది కొత్త వాడుకరులు అడిగిన ప్రశ్నలను, ఆయన ఇచ్చిన సమాధానాలనూ (ఆ పేజీకి వెళ్ళి, బ్రౌజరులో "ఫైండ్"లో "అడుగుతున్న ప్రశ్న" అనే దాని కోసం వెతికితే ఇవి కనిపిస్తాయి) చూసాను. ఆయన చాలా ఓపికగా వాళ్ళకు సహాయం చేసారు తప్ప, ఎక్కడా కటువుగా మాట్టాడలేదు. తోటివారి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారించడంలో, ఎదుర్కోవడంలో ఆయన ముందుంటారు. సాంకేతిక సంపత్తి ఆయనకున్న అదనపు అర్హత. ఆయన అధికారి బాధ్యతలు నిర్వర్తించడానికి అన్నివిధాలా అర్హులు అని భావిస్తూ ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 12:25, 2 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకత (Oppose)
  1. రవిచంద్ర గారు అధికార హోదా పొందటానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.

1. 2013 నుండి 2020 వరకు ప్రతిరోజు 20 మంది చొప్పున తెవికిలో కొన్ని వందల మంది ఖాతాలు తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరిని కూడా పూర్తిస్థాయి వికీపీడియాలో నిలబడకుండా మూలాలు పెట్టలేదు. వర్గాలు పెట్టలేదు అంటూ కొత్తవారిని భయపడే విధంగా మూసలు పెట్టి 8 సంవత్సరాలు క్రియాశీలకంగా రాకుండా చూసుకున్నాడు.

2.2017 తరువాత కొత్త అడ్మిన్స్ ఎవర్ని కాకుండా అడ్డుకున్నాడు. తాన అనగానే తందాన అనే ఒక ఎర్ర రామారావు గారిని తప్ప, పైగా పాత అడ్మిన్సును తొలగించి క్రియాశీలకంగా ఉన్నవారిని కూడా తెవికి ముఖం కూడా చూడకుండా చేశాడు. ఉదాహరణకు చంద్రకాంతరావు గారిని . ప్రసాద్ గారిని...

3. వీరికంటే సీనియర్లు ఉన్నా కూడా వారిని ఒక్కసారి కూడా అడ్మిన్ గా మీరు ఉండమని అడిగిన చరిత్ర లేదు. వేరొకరిని ప్రతిపాదన చేసిన చరిత్ర గాని లేదు.

4. చర్చ పేజీలలో ఏ అంశంలోనైనా చర్చ జరిగితే ఎదుటివారిని నొప్పించడమే ప్రధాన ధ్యేయంగా ఉంటాయి. కావాలంటే చర్చ పేజీలను చూడండి.

5. ఒక గుంపుగా ఏర్పడి కొత్తవారిని రాకుండా ఉన్నవారిని వారికి వంత పాడే విధంగా కొందరు చేస్తున్న కుట్రని రవిచంద్ర గారి భుజాన తుపాకి పెట్టి కాలుస్తుంటే మౌనంగా ఉండడం నాకు నచ్చలేదు. తెవికి కొందరు గుప్తాధిత్యంలో వారి కనసన్నల్లోనే నడుస్తున్న విషయం క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు...

6. ఇంటర్నెట్ పుష్కలంగా ఉంది. క్రియాశీల వాడ్కర్లు ఏరి మరి... ఇవన్నీ మీ వైఫల్యాలు అందుకు గాను పై ప్రతిపాదన నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రభాకర్ గౌడ్చర్చ 16:01, 28 జూన్ 2023 (UTC).[ప్రత్యుత్తరం]

తటస్థం (Neutral)

చర్చ (Discussion)

[మార్చు]

ఇక్కడ రాసిన 1, 2 పాయింట్లు చదివితే రవిచంద్ర గారు క్రమంతప్పకుండా నిర్వహణా చర్యలు తీసుకుంటున్నారని, నిర్వాహకులు విధానాలను ఉల్లంఘించినా జంకక చర్యలు తీసుకుంటున్నారనీ తద్వారా నిర్వహణా బాధ్యతలు బాగా నిర్వహిస్తున్నారని మెచ్చుకున్నట్టుగా ఉంది. మిగిలిన పాయింట్లలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇస్తే బావుండేది. స్థూలంగా, ఈ వ్యతిరేక వ్యాఖ్య ద్వారా రవిచంద్రకు మంచి నిర్వాహకుడని సర్టిఫికెట్ ఇచ్చినట్టు అయింది తెలిసో తెలియకో. పవన్ సంతోష్ (చర్చ) 02:07, 29 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెలిసో తెలియకో ఆరోపణలు చేయాల్సిన చిన్న విషయం కాదు ఇది వందకు వందశాతం పూర్తి అవగాహనతోనే ఆధారాలతోనే పైన ఆరోపణలు చేశాను. కోటరీ సభ్యులు మీరు కూడా ముఖ్యమైన వారే కదా వచ్చిన ఆరోపణలు అన్నిటికీ సాక్ష్యం రచ్చబండ చర్చలు చూస్తే అర్థం కాదా... నేను ప్రత్యేకంగా ఆధారాలు చూపించాలని అనడం విడ్డూరం కాకపోతే... పైన ఇద్దరి పేర్లు కూడా చెప్పాను కదా... వారితో జరిగిన చర్చలన్నీ సాక్షాలు కాదా... ఇక...
  1. సహాయం కావాలి అభ్యర్ధనలు నెలల తరబడి ఎదురు చూస్తున్నా వాటికి స్పందించని నిర్వాహకులు అధికారి కావడానికి ప్రయత్నించడం తెవికీలో సరికొత్త వింత...
2. వికీమీడియా నుండి ప్రాజెక్ట్ ద్వారా డబ్బు పొంది కనీసం ముగింపు నివేదిక ఇవ్వని వ్యక్తి అధికారి అభ్యర్ధన పెట్టడం, ప్రాజెక్టు అజమాయిషీ చేస్తామన్న వారు మద్దతు ఇవ్వడం ఇంకొక వింత...
ఏంటి ఇవి అన్ని... రవిచంద్ర గారు చాలా మంచి వ్యక్తినాకు తెలుసు... కానీ ఇతరుల మాటను అభిప్రాయాలను వింటూ ఇతరులకు బాధను కలిగిస్తారు అది నేను చెప్పదలచుకున్న విషయం... 
దీనికి కూడా ఆధారం చూపించమని అడగకండి దయచేసి... రచ్చబండలు రవిచంద్ర గారి ఇతరులు చేసిన చర్చలలో చాలా స్పష్టంగాకనిపిస్తాయి... నేను చెప్పొచ్చేది ఏమిటంటే తెవికి అధికారి కాబోతున్నారు... ఎంతో బాధ్యతతో కూడుకున్న పదవి వైజ్యాసత్య గారు,అర్జున్ రావుగారు, చదువరి గారు ఎన్నో సందర్భాలలో వ్యవహరించిన తీరుగా మీరు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుచూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను... _ ప్రభాకర్ గౌడ్చర్చ 06:40, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ గారూ, మీరు నాకు వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పినప్పుడు వాటికి ఆధారాలు చూపిస్తే వాటికి విలువ ఉంటుంది. ఉదాహరణకు చర్చా పేజీల్లో ఏ అంశంలో చర్చ జరిగినా ఎదుటివారిని నొప్పించే విధంగా ఉంటాయి అన్నారు. ఎక్కడ, ఎవరిని నొప్పించాను అని స్పష్టంగా చెప్పాలి. చర్చ ఎక్కడ జరిగిందో లింకు ఇవ్వాలి. ఆ సందర్భంలో ఏమి జరిగిందో దానికి నేను వివరణ ఇస్తాను. అన్నీ చర్చలు వెతికి మీరే చూసుకోండి అనేది అర్థ రహిత వాదన.
ఇంటర్నెట్ పుష్కలంగా ఉన్నా వాడుకరులు పెరగనీయకుండా నేను ఏంచేశానండీ? అసలు మొదటి దశాబ్ది ఉత్సవాల్లో, బయటి వేదికల మీద నేను తెవికీకి చేసిన ప్రచారం వల్ల కొంతమంది కొత్త రచయితలు వికీలో చేరారు అని ఒక పాయింటు చేర్చి మరీ అవార్డు ఇచ్చారు.
వికీ అంటేనే స్వేచ్ఛ, సభ్యులు తమకు వీలైన సమయంలో పనిచేస్తారు. ఒక నిర్వాహకుడిగా నాకున్న సమయంలో నేను చేయాల్సిన పనులు చేస్తున్నాను. ఉదాహరణకు మొదటి పేజీ శీర్షికలు నిర్వహించడం, కొత్తవారికి గురువుగా మార్గనిర్దేశకత్వం చేయడం, వ్యాసాల్లో నిర్వహణ మూసలు పెట్టడం లాంటివి. అలా అని వికీలో పెండింగులో ఉన్న పనులన్నీ చేయలేదని ఆరోపణలు చేస్తే ఎలా? నా జీవనాధారం కోసం ఉద్యోగం చేస్తూ కేవలం సేవాభావంతో వికీకి పూర్తి సమయం వెచ్చించడానికి నాకు కుదురుతుందా. అలా ఉండే వికీపీడియన్లు కూడా అరుదు, ఎవరో పదవీ విరమణ చేసిన వాళ్ళు తప్ప.
మీరన్నట్టు ఎక్కడైనా నేను కటువుగా మాట్లాడి ఉండవచ్చు. అది కేవలం వికీని సరైన దారిలో నడపడం కోసమే కానీ, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీదా కోపం లేదు. నేను చేసిన వ్యాఖ్యలన్నీ వికీ బాగుకోసమే అని గట్టిగా నమ్ముతున్నాను. వికీలో చర్చలు సామరస్య పూర్వకంగా, సుహృద్భావ వాతావరణంలో జరగాలి, కానీ కొంతమంది వాడుకరులు అభ్యంతరకరమైన, భాష, తిట్లు, బూతులు వాడుతుంటే ఒక సామాన్య వాడుకరిగా, నిర్వాహకుడిగా వ్యతిరేకత చూపించడంలో తప్పేముంది? అది నా భాద్యత.
నేనేదో కోటరీలో సభ్యుడిని అంటున్నారు. ఎవరినైనా సమర్ధిస్తే నేను వారితో కుమ్ముక్కై గూడుపుఠాణీ చేస్తున్నాననా దాని అర్థం. ఎలా చేస్తారు ఇలాంటి ఆరోపణలు. నేను ఏ చర్చలు చేసినా ఆన్ వికీలోనే చేస్తాను. అసలు వికీ సభ్యులతో బయటి మాట్లాడ్డం అతి తక్కువ. అది కూడా సాధారణ స్నేహితులుగా వ్యక్తిగత విషయాలే మాట్లాడుతాను. మళ్ళీ చెబుతున్నాను నేను ఏ గుంపులో లేను. అలా కాదు అంటే ఆ గుంపు ఏది, అందులో చేరి నేను వికీకి ఏం చెడు తలపెట్టానో స్పష్టంగా చెప్పాలి. పై పై ఆరోపణలు చేస్తే నేను అంగీకరించను.
వికీమీడియా నుండి ప్రాజెక్ట్ ద్వారా డబ్బు పొంది కనీసం ముగింపు నివేదిక ఇవ్వని వ్యక్తి అధికారి అభ్యర్ధన పెట్టడం, ప్రాజెక్టు అజమాయిషీ చేస్తామన్న వారు మద్దతు ఇవ్వడం ఇంకొక వింత... ఈ పాయింటు అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. నేను ఎప్పుడూ వికీమీడియా నుండి డబ్బు కోసం ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. ఇక నివేదిక ఇవ్వకపోవడం ఏమిటి. అసలు ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింది. వివరాలు చెబితే సంతోషిస్తాను. నా ఉద్యోగంలో నాకు జీవించడానికి సరిపోయేంత జీతం వస్తుంది. వికీపీడియా లాంటి ఉచిత ప్రాజెక్టు నుంచి డబ్బులు ఆశించను. అసలు డబ్బు కోసమే ఆశ పెడితే పదిహేనేళ్ళకు పైగా వికీలో ఉచితంగా పనిచేయను.
ఇంకొక్క విషయం వికీలో గత పదహారేళ్ళకుపైగా పనిచేస్తున్నా ఇంత నిరాధారమైన ఆరోపణలు నా మీద ఎవ్వరూ చేయలేదు. ప్రసాద్ గారు, చంద్రకాంతరావు గారు కూడా ఎప్పుడే ఏదైనా స్పష్టమైన పాయింటు మీదనే ఆరోపణలు చేశారు.
- రవిచంద్ర (చర్చ) 10:28, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ గారు శుభాకాంక్షలతో తన చర్చను ముగించినా, ఆయన రాసిన అంశాలపై నా అభిప్రాయం తెలియజేయాల్సిన బాధ్యత తోటి వాడుకరిగా నాకుందని భావిస్తున్నాను.
  • రవిచంద్ర గారు కొత్త వాడుకరులను అడ్డుకున్నారు అనేది అసంబద్ధం. ఆయన ఓపికగా వాళ్ళకు సహాయం చేస్తారు తప్ప, అనుచితంగా మాట్టాడరు. పైన నేను రాసినట్టు ఆయన చర్చ పేజీ చూస్తే అది తెలుస్తుంది.
  • కొత్త అడ్మిన్లు ఎవరినీ కాకుండా అడ్డుకున్నాడు అని రాసారు. అడ్మిన్లు ఎవరు కావాలి ఎవరు అవకూడదు అనేది సముదాయం నిర్ణయం. ఒకరు చేసేదీ కాదు, ఒకరు అడ్డుకునేదీ కాదు. వ్యక్తులు తమ అభిప్రాయాలు చెబుతారంతే. ఇప్పుడు ప్రభాకర్ గౌడ్ గారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినంత మాత్రాన, ఆయన అడ్డుకున్నారు అని అనలేం. ఆయన వ్యతిరేకించారంతే. అయితే గియితే.. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్టాడ్డం, కారణం ఒకటి చెప్పి అభిప్రాయం మరొకటి చెప్పడం, ఇప్పుడొక అభిప్రాయం చెప్పి కాసేపయ్యాక దాని వ్యతిరేక అభిప్రాయం చెప్పడం, అయోమయంగా మాట్టాడ్డం.. - ఇలాంటివి పొరపాటు అవుతాయేమో తప్ప, నిర్దుష్టమైన అభిప్రాయం చెప్పడం తప్పెలా అవుతుంది?
  • ఇతరులను నిర్వాహకునిగా చెయ్యలేదనడం కూడా అసంబద్ధం. ఎవరినైనా నిర్వాహకులుగా చెయ్యడం చెయ్యకపోవడం అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. ప్రభాకర్ గారి ఉద్దేశం బహుశా ప్రతిపాదించడం అని అయి ఉండవచ్చు. ఎవరినైనా ప్రతిపాదించడం అనేది వాడుకరులకు గానీ, నిర్వాహకులకు గానీ బాధ్యతేమీ కాదు. నిర్వాహక అభ్యర్థులు స్వీయ ప్రతిపాదన చేసుకోవడమనేదే ఉత్తమ సంప్రదాయం.
  • చర్చల్లో ఇతరులను నొప్పిస్తారని, గుంపు అని, గుప్తాధిపత్యం అనీ ఆధారాలేమీ ఇవ్వకుండా ఆరోపణలు చేసారు. రవిచంద్ర గారు గట్టిగా వ్యతిరేకించారు. యర్రా రామారావు గారిని గురించి కూడా అనుచితంగా వ్యాఖ్యానించారు. అన్నిటి కన్నా ఘోరం - ప్రాజెక్టు పేరిట డబ్బులు తీసుకుని నివేదిక ఇవ్వలేదు అని అనడం. ఇది అవతలి వ్యక్తి నిబద్ధతనూ నిజాయితీనీ వ్యక్తిత్వాన్నీ ప్రశ్నించడం. ఆధారాలు చూపకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చెయ్యడం అసమంజసం, అవాంఛనీయం.
  • "ఇంటర్నెట్ పుష్కలంగా ఉంది. క్రియాశీల వాడ్కర్లు ఏరి మరి" అనే వ్యాఖ్య హాస్యాస్పదంగా ఉంది. వికీలో క్రియాశీల వాడుకరులు లేకపోతే రవిచంద్ర గారు ఏం చేస్తారు?
ఆధారాలు చూపించకుండా చేసిన ఆరోపణలు అసమంజసం గాను, అనుచితం గానూ ఉన్నాయి. ఓవైపు ఇలా ఆరోపణలు చేస్తూనే మరో వైపు - "రవిచంద్ర గారు చాలా మంచి వ్యక్తినాకు తెలుసు... కానీ ఇతరుల మాటను అభిప్రాయాలను వింటూ ఇతరులకు బాధను కలిగిస్తారు" అని అన్నారు. ముందు పేరాల్లో చెప్పిన అభిప్రాయాలు ఈ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నై. __చదువరి (చర్చరచనలు) 13:16, 2 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ గారు, ఈ చర్చలో నాపేరు ప్రస్తావించవలసిన అవసరంవస్తే 2017 తరువాత కొత్త అడ్మిన్స్ ఎవర్ని కాకుండా అడ్డుకున్నాడు.ఒక్క ఎర్ర రామారావు గారిని తప్ప అనటంలో ఎలాంటి తప్పు లేదు.కానీ తాన "అనగానే తందాన అనే ఒక ఎర్ర రామారావు గారిని తప్ప", అని వ్యాఖ్యానించటం నేను త్రీవంగా ఖండిస్తూ, అది గౌడ్ గారి విజ్ఞతకే వదలివేస్తున్నాను.అలా అన్నందుకు గౌడ్ గార్కి విలువ ఏమైనా పెరిగిందేమో కానీ, నాకైతే తగ్గిందేమీ లేదు.ఎవరి మనస్సు అయినా తగినంతగా పరిపక్వం చెందనప్పుడు, అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు.ఏమి చేద్దాం.కానివ్వండి. నాచేతైనంతవరకు వికీపీడియాను తీర్చిదిద్దాలనే నా సంకల్పం ముందు ఇటువంటివి సముద్రంలో నీటిచుక్కలాంటివి.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 17:30, 2 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం ప్రకటన చేయుటను కోరుట గురించి

రవిచంద్ర గారు అధికారిగా భాధ్యతలు నిర్వర్తించటానికి చేసుకున్న స్వీయప్రతిపాదనకు అభిప్రాయాలు లేదా మద్దతు తెలుపటానికి నిన్నటితో (2023 జులై 1) తో గడువు ముగిసింది. అభిప్రాయాలు లేదా మద్దతు ప్రకటించే కార్యక్రమంలో పాల్గొనని నిర్వాహకులలో ఎవరైనా 2023 జులై 3 లోగా నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:49, 2 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గడువు ముగిసి వారమై పోయింది. చర్చ ఆగిపోయి కూడా 6 రోజులైంది. నిర్ణయం ప్రకటించేందుకు ఇక్కడ పాల్గొనని నిర్వాహకులెవరూ ముందుకు రాలేదు. కాబట్టి చర్చలో పాల్గొన్నవారెవరైనా నిర్ణయం ప్రకటించవలసినది. @K.Venkataramana గారూ, పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 01:25, 7 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం (Result)

[మార్చు]

రవిచంద్ర గారు తెవికీ అధికారిగా భాద్యతలు నిర్వర్తించడానికి చేసుకున్న స్వీయ ప్రతిపాదనకు గడువులోపు (2023 జూలై 1 నాటికి) సముదాయంలో క్రియాశీలక సభ్యులు 15 మంది అనుకూలంగా స్పందించారు. ఒక సభ్యుడు ప్రతిపాదనకు వ్యతిరేకించి కొన్ని అభ్యంతరాలు తెలియజేసినా వాటికి సరైన ఆధారాలను చూపించలేకపోయాడు. తటస్థంగా కూడా ఎవరి స్పందనలు లేవు. కావున రవిచంద్ర గారు అధికారి హోదాలో భాద్యతలు నిర్వర్తించడానికి చేసుకున్న స్వీయ ప్రతిపాదన విజయవంతమైనట్లు ప్రకటించడమైనది. ఈ ఫలితాన్ని ఈ చర్చలో పాల్గొనని నిర్వాహకులు ప్రకటించాల్సి ఉన్నా గడువు దాటి ఒక వారం రోజులు అయినా ఎవరూ ప్రకటించనందున క్రియాశీల నిర్వాహకునిగా నేను ప్రకటిస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 02:02, 7 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి హోదాలో ఉన్న రాజశేఖర్ గారు, రవిచంద్ర గార్కి అధికార భాద్యతలు సంక్రమించడానికి తగిన చర్యలు తీసుకొనవలసినదిగా కోరుచున్నారు. ఈ ప్రతిపాదనలో పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు.➤ కె.వెంకటరమణచర్చ 02:02, 7 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • నిర్వాహకుడిగా తన అధికారి హోదా విజ్ఞప్తికి వాడుకరుల మద్దతు ఆధారంగా ఫలితం ప్రకటించబడినది. ఎంతో సాంకేతిక అనుభవం కలిగిన రవిచంద్ర గార్ని అధికారిగా సంబంధించిన హక్కులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. వారికి నా హార్ధిక శుభాకాంక్షలు. తెవికీలో వారి కృషి మరింతగా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతుందని ఆకాంక్షిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 13:50, 9 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్బంగా వారికి నా శుభాకాంక్షలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:53, 9 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నా మీద నమ్మకం ఉంచి నాకు మద్ధతు పలికిన శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ఈ కొత్త బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలనని అనుకుంటున్నాను. - రవిచంద్ర (చర్చ) 14:29, 10 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]