వాల్మీకి జాతీయ ఉద్యానవనం
స్వరూపం
వాల్మీకి జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | చంపారన్, బీహార్, భారతదేశం |
వాల్మీకి జాతీయ ఉద్యానవనం, బీహార్ రాష్ట్రంలోని పడమర చంపారన్ జిల్లా లోని గండక్ నది ఒడ్డున ఉంది. ఈ ఉద్యానవనం పులుల సంరక్షణ వన్యప్రాణుల కేంద్రంగా ఉంది.[1] 2018 లెక్కల ప్రకారం ఈ కేంద్రంలో 40 పులులు ఉన్నాయి.[2]
మరిన్ని విశేషాలు
[మార్చు]1950కి ముందు ఈ అడవి ప్రాంతం బెట్టియా రాజ్, రాంనగర్ రాజ్ ఆధీనంలో ఉండేది. ఈ ఉద్యానవనం ఒక అడవి ప్రాంతంగా ఉంటుంది. ఈ అడవి ప్రాంతం మొత్తం 900 చ.కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా అందులో వాల్మీకి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం 880 చ.కిలోమీటర్లు, జాతీయ ఉద్యానవనం 335 చ.కిలోమీటర్లుగా విస్తీర్ణంలలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం ఉత్తరాన నేపాల్ దేశంలో ఉన్న చిట్వాన్ జాతీయ ఉద్యానవన సరిహద్దులను తాకుతూ, దక్షిణాన ఉత్తర ప్రదేశ్ హద్దులను తాకుతుంది.