Jump to content

వారెన్ విస్‌నెస్కీ

వికీపీడియా నుండి
వారెన్ విస్‌నెస్కీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వారెన్ ఆంథోనీ విస్‌నెస్కీ
పుట్టిన తేదీ (1969-02-19) 1969 ఫిబ్రవరి 19 (వయసు 55)
న్యూ ప్లైమౌత్, తారనాకి, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 112)2000 ఫిబ్రవరి 17 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2000 ఫిబ్రవరి 26 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 71 80
చేసిన పరుగులు 10 1,750 519
బ్యాటింగు సగటు 10.00 21.60 14.41
100s/50s 0/0 0/9 0/0
అత్యధిక స్కోరు 6 89* 45*
వేసిన బంతులు 114 13,672 3,858
వికెట్లు 0 248 101
బౌలింగు సగటు 26.06 28.29
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 12 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 7/151 6/43
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 46/– 32/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 20

వారెన్ ఆంథోనీ విస్‌నెస్కీ (జననం 1969, ఫిబ్రవరి 19) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 2000లో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఓపెనింగ్ లేదా ఫస్ట్-చేంజ్ బౌలర్ గా, లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

1992 నుండి 1996 వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల తరపున 1996 నుండి 2004 వరకు కాంటర్బరీ కొరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1] 2000-01లో ఆక్లాండ్‌పై కాంటర్‌బరీ తరపున 151 పరుగులకు 7 వికెట్లు తీసుకోవడం అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ బౌలింగ్ గణాంకాలుగా ఉన్నాయి.[2] 1997–98లో షెల్ ట్రోఫీ ఫైనల్‌లో, 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి, న్యూజిలాండ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 11వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇతను, లీ జెర్మన్ 143 నిమిషాల్లో పదో వికెట్‌కు 160 పరుగులు జోడించారు.[3] సదరన్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు తరపున కూడా ఆడాడు.

హాక్ కప్‌లో తార్నాకి తరపున కూడా ఆడాడు. 2004లో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.

2010, 2011లలో క్రైస్ట్‌చర్చ్ భూకంపాలు సంభవించిన సమయంలో క్రైస్ట్‌చర్చ్‌లోని సహాయక బృందాలలో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Williamson, Martin. "Warren Wisnewski". Cricinfo. Retrieved 7 April 2018.
  2. "Canterbury v Auckland 2000-01". CricketArchive. Retrieved 7 May 2018.
  3. Wisden 1999, p. 1320.
  4. Campbell, Peter. "Hero dreads return to quake city". Cook Islands News. Retrieved 7 May 2018.

బాహ్య లింకులు

[మార్చు]