వాత
శరీరంపై వేడి చేసిన వస్తువుతో ఏర్పరచే లేదా వేడిగా ఉన్న వస్తువు ప్రమాదం సాత్తు తగలటం వల్ల ఏర్పడే గాయాన్ని వాత అంటారు.బెత్తం లేదా మేళ్ళుతో కొట్టినప్పుడు శరీరం కందినచో ఆ గాయాన్ని కూడా వాత అంటారు.[1]
వైద్యంలో వాతలు
[మార్చు]పచ్చకామెర్లు ఉన్న వారికి కొన్ని ప్రాంతాలలో ఆయుర్వేద వైద్యులు తగిన పద్ధతులను అనుసరించి కొన్ని రసాయనాలను ఉపయోగించి వాత పెట్టడం ద్వారా వైద్యం చేస్తారు, అయితే ఇది క్రూరమైన వైద్యంగా పరిగణింపబడుతుంది.
భయపెట్టడానికి
[మార్చు]పిల్లలు తప్పు చేసినప్పుడు పిల్లలు మళ్ళీ తప్పు చేయకుండా ఉండేందుకు పిల్లలకు వాత పెడతామని తల్లిదండ్రులు భయపెడతారు.[2]
పందెపు గుర్రాలకు వాతలు
[మార్చు]పందెపు గుర్రాలకు తగిన రసాయనాలను ఉపయోగించి కాళ్ళపై వాతలు పెట్టడం ద్వారా వైద్యం చేస్తారు,[3] అందువలన వాటి కాళ్ళలో కఠినత్వం ఏర్పడి అవి వేగంగా పరిగెత్తడానికి సహాయ పడగలదనే ఒక సిద్ధాంతం ఉంది, అయితే ఈ విధానం క్రూరమైనదిగా పరిగణింపబడుతుంది.
సామెతలు
[మార్చు]పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
మూలాలు
[మార్చు]- ↑ "Pinfiring proves obsolete" Archived 2021-01-26 at the Wayback Machine, Thoroughbred Times, Brian Nielsen and Jessica Fattal, November 21, 2006
- ↑ "Pin Firing". Your Guide to Equine Health Care. Retrieved April 4, 2007.
- ↑ "Pin firing: A needless pain". Thoroughbred Times (October 2000). Archived from the original on 2021-04-11. Retrieved April 29, 2009.