వాడే వీడు
వాడే వీడు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
నిర్మాణం | ఎన్. రామబ్రహ్మం |
తారాగణం | నందమూరి తారక రామారావు, మంజుల (నటి), నాగభూషణం, పద్మనాభం, పండరీబాయి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీగౌతమ్ పిక్చర్స్ (చిత్రభాను ప్రొడక్షన్స్?) |
భాష | తెలుగు |
వాడే వీడు 1973లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్ సరసన మంజుల (నటి) నటించిన తొలి సినీమా. గౌతమ్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎన్.రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు దాసరి యోగానంద్.సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
కథ
[మార్చు]చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు కోసం అతని తల్లి (పండరీబాయి) ఎదురుచూస్తూఉంటుంది. ఆమె ఆస్తి మీద కన్నేసిన కోదండం (నాగభూషణం) ముఠా రిక్షా వాడైన ఎన్.టి.ఆర్ ను ఆమె కుమారుడని చెప్పి ఇంట్లో ప్రవేశపెడతాడు. అంతకు మునుపే అతనికి పరిచయమున్న మంజుల ఎన్.టి.ఆర్ కు అక్కడ తారసపడుతుంది. విలన్ల బండారం బయట పెట్టటం, తప్పిపోయిన బాబు ఎన్.టి.ఆర్ కావడం తరువాతి కథ.
నటీనటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు - రాంబాబు
- మంజుల (నటి) - సావిత్రి, కోదండం కూతురు
- నాగభూషణం - కోదండం
- పద్మనాభం
- పండరీబాయి - రాంబాబు తల్లి
- అల్లు రామలింగయ్య - పురోహితుడు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: డి.యోగానంద్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నిర్మాత: ఎన్.రామబ్రహ్మం
నిర్మాణ సంస్థ: శ్రీ గౌతమ్ పిక్చర్స్
కధ, స్క్రీన్ ప్లే: డి.వి.నరసరాజు
గీత రచయితలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి కృష్ణమాచార్య,దేవులపల్లి కృష్ణశాస్త్రి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, రమోల శిష్ట్లా జానకి
కెమెరా: ఎస్.ఎస్.లాల్
కళ: ఎన్.కృష్ణారావు
కూర్పు: ఆనంద్ స్వామి
విడుదల:18:10:1973.
పాటలు
[మార్చు]- అహ లవ్లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- అటు చల్లని వెలుగుల జాబిలి ఇటు వెచ్చని చూపుల - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరథి
- ఎదుటనుండి కదలను పదములింక వదలను - పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నె- ఘంటసాల, రమోల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- నేటికి మళ్ళీ మాయింట్లో ఎంచక్కా పండుగ - పి.సుశీల, ఎస్. జానకి, ఘంటసాల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం గురువు - ఘంటసాల, పిసుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- హరేరామ హరేరామ ఆగండి కాస్త ఆగండి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వసంత - రచన: కొసరాజు
- ఏమి కావాలోయి నీకు ఏది కావాలోయీ మనసుకు హాయి- ఎస్ జానకి - రచన:కొసరాజు.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)