Jump to content

వాడుకరి చర్చ:Sairatna

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Sairatna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ఈ నాటి చిట్కా...
బ్రౌసర్ కాషెను తొలగించడం

కొన్నిసార్లు మీరు చేసిన మార్పులు వెనువెంటనే మీరు వీక్షించడానికి ప్రయత్నిస్తే కనిపించకపోవచ్చు. అలా అని తొందరపడి మరలా మార్పు చేయకండి. ఒకసారి బ్రౌసర్ కాషెను తొలగించి చూడండి. మీరు వాడే బ్రౌసర్‌ను బట్టి క్రింది విధంగా కాషెను తొలగించండి.

  • మొజిల్లా/ఫైర్‌ఫాక్స్‌/సఫారి: shift కీని నొక్కి పెట్టి Reload నొక్కండి, లేదా Ctrl-shift-R నొక్కండి (యాపుల్‌ మాక్‌ లో Cmd-shift-R)
  • ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్: Ctrl నొక్కి పెట్టి, Refresh నొక్కండి, లేదా Ctrl-F5 నొక్కండి;
  • కాంకరర్‌: Reload మీట నొక్కండి, లేదా F5 నొక్కండి;
  • ఒపేరా ను వాడే వారు Tools→Preferences కు వెళ్ళి కాషె ను పూర్తిగా తీసివేయ వలసి ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల



సుభాషితాలు

[మార్చు]

ఇక్కడ కొంత విషయం వాడుకరి:Sairatna పేజీకి మార్చడమైనది. --కాసుబాబు 11:50, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పై వ్యాఖ్య రాసిన సన్హ్యునికి విన్నపం. ఇక్కడ కేవలం తెవికీ కి సంబంధించిన ప్రతిపాదనలు చర్చలు మాత్రమే జరుగుతాయి. ఇలాంటి సామాజిక సందేశాలను, సమస్యలను మీ బ్లాగుల ద్వారా ప్రచారం చెయ్యండి. అలాంటి విషయాలు ఇక్కడ రాయవద్దని మనవి. -- రవిచంద్ర(చర్చ) 04:40, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం, సుస్వాగతం, గమనించవలెను.

[మార్చు]

శ్రీ రంగశాయిగారూ! నమస్కారం మరియు స్వాగతం. మీవంటి పెద్దలు తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరినందుకు మాకు ఎంతో సంతోషం. మీ అనుభవం మరియు సుహృద్భావం తెలుగు వికీపీడియా ప్రగతికి తోడ్పడగలవని ఆశిస్తున్నాను. మీరు రచ్చబండలో వ్రాసిన ప్రతిపాదనలు చాలా సముచితంగా ఉన్నాయి కాని అవి మీ అభిప్రాయాలు గనుక మీ సభ్యుని పేజీకి మారుస్తున్నాను. వికీపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వం. ఇది అభిప్రాయాలను వెలిబరచే వేదిక కాదు. కొన్ని ఇతర వ్యాసాలను పరిశీలిస్తే ఇందులో ఉండాల్సిన విషయ సంగ్రహం పరిధులు మీకు తెలుస్తాయి. మీ వూరి గురించి, మీకు ఆసక్తి ఉన్న విషయం గురించి, పుస్తకం గురించి - ఇలా ఎన్నో విషయాలు వ్రాసే ఆస్కారం ఉంది. మరియు మీరు ఇతర వ్యాసాలలో తప్పులు దిద్దవచ్చును. వాటిని మెరుగుపరచవచ్చును. దయచేసి మీ రచనలు అందించండి. ఏవయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు 12:00, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన, ఇతరత్రా

[మార్చు]

వందేమాతరం

కందుకూరి వీరేశలింగం గారి గురించి తెలువికి లో ఎక్కడ రాశారు  ? మొన్న 27-5-09 ని ఆయన యొక్క 90వ వర్ధంతి నాడు ఏ పత్రికా, టీ వీ వాళ్ళూ మహిళా మండళ్ళూ ఏవైనా కార్యక్రమాలు చెశారా? తెలువికిపెదియా వారైనా ఏవైనా వ్యాసాలు ప్రచురించారా  ? అలాంటి మహానుభావుణ్ణి మరచిపోతున్న మన వాళ్ళకి గుర్తు చేస్తూ రాయాలంటే ( రచ్చబండలో) ఎలాగ రాయాలి ? - Sairatna 12:21, 30 మే 2009 (UTC) మా వెం రంగశాయి[ప్రత్యుత్తరం]


వందేమాతరం

కొత్తగా చేరిన 74 సం.ల వ్రుధ్ధుణ్ణి కాబట్టి నవ్వుకోకుండా చెప్పండి. రచ్చబండ లో పాల్గొనాలంటే ఎక్కడ క్లిక్ చేసి రాయాలి  ? సామాజిక దురాచారాల గురించి రాయాలంటే ఎక్కడ క్లిక్ చేసి రాయాలి ? Sairatna 15:32, 30 మే 2009 (UTC) మా వెం రంగశాయి[ప్రత్యుత్తరం]

రంగశాయి గారూ! కందుకూరి వీరేశలింగం గురించి ఒక వ్యాసం ఉన్నది. క్రింది లింకుపై క్లిక్ చేయండి.
కందుకూరి వీరేశలింగం పంతులు
నవ్వుకోవడమా? ఎంతమాట? అలాంటి భావనే వద్దు మీకు. మీవంటి పెద్దలు తెలుగు వికీలో చేరడం మాకందరికీ ఎంతో సంతోషం. ఒకటి రెండు రోజులు తెలుగు వికీని పరిశీలిస్తే ఇక్కడి నియమాలు, విధానాలు మీకు తెలుస్తాయి. మీరు లాగిన్ బాగానే అవుతున్నారు గనుక మీ వాడుకరి చర్చ పేజీలో ఇతర విషయాలు చర్చించుకోవచ్చును. ఆ పేజీకోసం ఈ లింకు నొక్కండి--> వాడుకరి చర్చ:Sairatna . (ఈ జవాబు వ్రాసిన సభ్యుడు --కాసుబాబు 04:28, 31 మే 2009 (UTC) )[ప్రత్యుత్తరం]