Jump to content

వాడుకరి చర్చ:S172142230149/పాత చర్చ 3

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మాటలబాబు రాత్రిళ్ళు పని చేయడంవల్ల పగటి పూట తెవికి రాలేక పోతున్నడు. ఈ వారం అంతా ఇంతే


బాసూ! 172.142.230.149 నువ్వేనని నా అనుమానం. మరీ చప్పగా ఉండే వికిపీడియా చర్చలకు కాస్త మసాలా అంటించావు. స్వాగతం. --కాసుబాబు 14:00, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


బొమ్మలు

[మార్చు]

విశ్వామిత్రునికి, కుంభకర్ణునికి, శ్రీకాళహస్తికి బొమ్మలు చేర్చాను. చూశారా? --వైజాసత్య 19:20, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు బాగున్నాయి, దన్యవాదాలు, విశ్వామిత్రుడి వ్యాసములొ రవి వర్మ వేసిన బొమ్మలు బాగా అంటించారు, మేనకా మీద రెండు బొమ్మలు ఉన్నాయి. అయితే రెండు బొమ్మలు వ్యాసానికి క్రిందకు వస్తే బాగుంటుందని నాఅభిప్రాయము. రాముడు కి లక్ష్మణుడికి విద్యలు చెప్పే బొమ్మ మరియు బ్రహ్మ బ్రహ్మర్షి అని దీవించిన బొమ్మలు పెడితే బాగుటుందని భావిస్తున్నాను. కుంభకర్ణుడి బొమ్మ భలే పట్టారే, శ్రీకాళహస్తి బొమ్మలు కూడా బాగున్నాయి.--మాటలబాబు 19:25, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలకు మూలాలు

[మార్చు]

మాటలబాబుగారు, నాదొక చిన్న మనవి. మీరు తయారు చేస్తున్న వ్యాసాలలో చాలా మంచి సమాచారాన్ని చేరుస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. కానీ, మీరు చేరుస్తున్న సమాచారం ఎక్కడి నుండి తెస్తున్నారో ఆ మూలాలను (రిఫరెంసులు) పేర్కొనటంలేదు. అలా మూలాలను పేర్కొనటం వలన ఇతర సభ్యులు మీరు రాసిన వివరాలను దృవపరచుకోగలుగుతారు. అంతేకాదు, అలా మూలాలలో ఇచ్చిన లింకులనుండో, పుస్తకాలనుండో దొరికే సమాచారం వేరే వ్యాసాలకు కూడా ఉపయోగపడే అవకాశమ్ ఉంది. మూలాలు ఎలా చేర్చాలో ఈ పేజీని చూసి నేర్చుకోండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 00:16, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వ్రాసే దాదాపు అన్ని విషయాలు పురాణాలనుండే ఇప్పుడు రాస్తున్న పుణ్యక వ్రతం బ్రహ్మవైవర్త పురాణము లోనిది, శివపార్వతుల రతి భంగమైనప్పుడు పుత్రుడి కోసం పార్వతి శివుడుని ఏదైన వ్రతం గురించి చెప్పమనగా శివుడు పార్వతి చెప్పిన విషయాలను, నారణముని నారదుడికి చెప్పగా, సత్రయాగమ్ చేస్తున్నప్పుడు రోమ మహర్షి గా పేరు సంపాదించిన సూతుడు శౌనకాది ఋషులకు చెప్పిన విషయాలను నేను తెవికి లొ రాస్తున్నాను, ఏమైన అభ్యంతరమైతే చెప్పండి, మానేస్తాను.ముందు ముందు వివిధ దేవతల కవచలా గురించి రాద్దామను కొంటున్నాను--మాటలబాబు 00:27, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

హలో!

[మార్చు]

మాటలబాబు గారూ!

నేను ఇటీవల ఇతరవ్యాపకాలలో పడి తెవికీలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ అప్పుడప్పుడూ తొంగిచూస్తూనే ఉన్నాను. అందువల్ల మీరు చేస్తున్న కృషి నాకు బాగా తెలుసు. ప్రస్తుతం మీరు రాస్తున్న వ్యాసం పేరులోనే తప్పుంది. ఋష్యశృంగుడు అని ఉండాలి. వ్యాసాన్ని సరైన పేరుకు తరలించగలరు. -త్రివిక్రమ్ 05:55, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కన్నడ

[మార్చు]

మాటల బాబు గారూ, మీకు కన్నడ వచ్చా? కన్నడలో ఎంతటి పరిజ్ఞానమున్నది? తెలియజేయగలరు. బహుభాషావిదుల ఉపయోగము తెలుగులో ఎంతైనా ఉన్నది --వైజాసత్య 10:33, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

హలో మాటల బాబుగారు.నేనీ మద్య చాలా బిజీ ఇంట్లోలేను,పైగా నేను ఎక్కువగా విక్షనరీ లో ఎక్కువ పనిచేస్తాను,మీకు వీలైతే ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి.మీరిలా అడగటం చాలా సంతోషంగా ఉంది థాంక్స్. t.sujatha 17:48, 28 జూన్ 2007 (UTC) విక్షనరీ లొ పని చేస్తున్నారు అని చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఒక పదము అర్థము తెలియక చస్తున్నాను మీరేమైన సహాయం చెయ్యగలరేమో చూడండి. గవాక్షము అంటే అర్థం ఏమిటి--మాటలబాబు 17:53, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అర్ధము

[మార్చు]

మాటల బాబుగారు గవాక్షము అంటే కిటికీ. t.sujatha 18:02, 28 జూన్ 2007 (UTC)

శెలవు

[మార్చు]

పరీక్షించినందుకు పలకరించినందుకు ధాంక్స్,నాపనికి మీమాటలు స్వారస్యం అందించాయి.బాగుందండీ మీ పకరింపు.ఒకే శెలవు మరి. 18:39, 28 జూన్ 2007 (UTC)

జోక్

[మార్చు]

జోక్ బాగుంది ;-) మరీ చూడొద్దని చెప్పిన తర్వాతకూడా చూడకుండుంటామా రామా..హా..హా..హా (తీసేశాను..కానీ తీసివేసిన ప్రతులను కూడా నిర్వాహకులు మాత్రం చూడగలిగే అవకాశముంది) --వైజాసత్య 19:53, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలకు తెలుగు పేర్లు

[మార్చు]

బొమ్మలకు ఇంగ్లీషు పేర్లే ఇవ్వండి. భవిష్యత్తులో ఆ బొమ్మను ఇతర వికీల వాళ్లు ఉపయోగించుకోవాలన్నా, కామన్స్లో అప్లోడ్ చెయ్యాలన్న సులభముగా ఉంటుంది --వైజాసత్య 23:24, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా... సూచన పాటిస్తా...--మాటలబాబు 23:26, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మైలు రాళ్ళు

[మార్చు]

నా కొత్త బ్లాగు చూశారా చెప్పండి.యాభై వేలొ వికీపీడియా వ్యాసాన్ని నేనే(మాటలబాబు) సృష్టించానని ప్రదీప్ గారు వ్రాశారు నాకెంతో గర్వంగా ఉన్నది. నా బ్లాగు లొ వ్రాసిన విషయాలు వికిపీడియా లొ పెట్టవచ్చా పెట్ట రాదా.. చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ --మాటలబాబు 16:31, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త బ్లాగు కాదు..కొత్త టపా అనాలనుకుంటా..విషయాన్ని బట్టి..మీ సొంత విషయాలైతే కొంత సభ్యుని పేజీలో పెట్టుకోవచ్చు. ఇంతకీ ఏం పెట్టాలనుకుంటున్నారు. --వైజాసత్య 16:33, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
50 వేల పేజీ రాసిన సందర్భంగా శుభాకాంక్షలు..జీర్ణం జీర్ణం..అదేనా ఇక్కడ పెట్టాలనుకుంటున్నది. ఇక్కడ అంత సరిగా ఉండదేమోనని నాకనిపిస్తుంది. ఏ విషయం క్రింద దాన్ని పెట్టాలన్నదే ప్రశ్న --వైజాసత్య 16:37, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీరేంటొ నేను దేని గురించి రాసిన పట్టించు కోరు. సరె ఆవిషయాన్ని విడిచి పెట్టండి నా దగ్గర 2-3 మంచి ఇంద్రధనస్సు బొమ్మలు ఉన్నాయి వాటిని అప్‌లోడ్‌ చేయంటారా.. ఇంకో సందేహం నేనే 50 వేల మార్పు చేశాను అని చెప్పడానికి ఏమైన ఋజువు ఉన్నదా...--మాటలబాబు 18:55, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక సభ్యునికి కొంత వికీ విధానాలు తెలిసినా తర్వాత పెద్దగా అడ్డు తగలకుండా స్వతంత్రత ఇవ్వాలని నా వ్యక్తిగత అభిప్రాయం. అందునా మీరు రాస్తున్న విషయాల గురించి నాకు పెద్ద అవగాహన లేదు. రొమ్ము వ్యాసంలో మీరు రాసిన దాన్ని మెరుగుపరచటానికి ప్రయత్నించాను..కానీ నాకూ అవి ఎలా అనువదించాలో తోచలేదు. ఇక విద్యారణ్య వ్యాసాన్ని కొంత దిద్దాను. మరింత రాయటానికి విషయం సేకరిస్తున్నాను. ఇంధ్ర దనుస్సు బొమ్మలు అప్లోడ్ చెయ్యండి. ఉపయోగపడతాయి. --వైజాసత్య 19:03, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
50వేల పేజీలను మీరే దిద్దారని ఋజువు ఎలా కనుక్కోగలమో నాకూ తెలియదు. బహుశా చదువరి గారికి కానీ ప్రదీపు గారికి కానీ తెలిసిఉండవచ్చు..ఎందుకంటే ఫలానా తేదీ కళ్ళా ఇన్ని వ్యాసాలున్నాయని మైలురాళ్లలో ఉన్న పట్టికనే ఎప్పుడూ చదువరినే అప్‌డేట్ చేసేవారు. --వైజాసత్య 19:06, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్న దానికి జవాబు

[మార్చు]
మీరేంటొ నేను దేని గురించి రాసిన పట్టించు కోరు. సరె ఆవిషయాన్ని విడిచి పెట్టండి నా దగ్గర 2-3 మంచి ఇంద్రధనస్సు బొమ్మలు ఉన్నాయి వాటిని అప్‌లోడ్‌ చేయంటారా.. ఇంకో సందేహం నేనే 50 వేల మార్పు చేశాను అని చెప్పడానికి ఏమైన ఋజువు ఉన్నదా...--మాటలబాబు 18:55, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో లాగులో, ఎప్పటికప్పుడు కొత్త పేజీలను చూసుకోవచ్చు. ఈ పేజీలో total అనే వేరియబుల్లో వికీపీడియాలో ఎప్పటికప్పుడు తెలుగు వికీపీడియాలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ రెండిటినీ కలుపుకుని, ఏ పేజీ ఎన్నోదో తెలుసుకోవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:12, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి కొత్త పేజీల లాగ్ ఇక్కడ ఉంటుంది. ఇందాకటి లింకులో కాదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:24, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తళ్ళికోట యుద్ధం శ్రవణ ఫైలు

[మార్చు]

కృతజ్ఞతలు మాటలబాబు గారూ, తళ్ళికోట యుద్ధం శ్రవణ ఫైలు నేను మొత్తం విన్నాను. అక్కడక్కడ కొన్ని చిన్న తప్పులు తప్ప బాగా వచ్చింది. --వైజాసత్య 01:32, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆడియో ఫైలు, వెబ్‌సైటు

[మార్చు]

ప్రదీప్ గారు నేను తళ్ళికోట యుద్ధాన్ని ఆడియో పైలు క్రింద మార్చాను విన్నారా, మరచి పోయాను నేను ఈ మధ్య ఒక వెబ్‌సైటు చేసుకొంటున్నాను, మీరు ఒకదర్శించ మని వేడుకొంటున్నాను --మాటలబాబు 18:33, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడే మీ సైటును చూసాను. మీ బ్లాగును కూడా చూసాను. రెండూ బాగున్నాయి. మీ వెబ్‌సైటులో ఉంచిన ఫొటో మీదేనా? అయితే మీ వెబ్‌సైటులో చిన్న అచ్చుతప్పు కనిపించింది నాకు. మీ ఆడియో ఫైలుని ఇంకా వినలేదు, తీరిక ఉన్నప్పుడు వింటాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:06, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

From kn wikipedia

[మార్చు]

Hi, this is ಶುಶ್ರುತ from the kannada wikipedia. I saw your note on my talk page. The Kannada wikipedia is currently in a bad state without any active administrator. There is only one guy who is semi-active and I've been trying to contact him asking him to give me admin privileges but he has not responded yet. Even I want to implement automatic transliteration thing that you guys have on the Telugu wikipedia but I am not an admin :-( Thanks for the note. Shushruth.

కుశలమే

[మార్చు]

మాటల బాబూ, కుశలమే. పని వత్తిడి వలన వికీలో నా కృషి తగ్గింది. ఐతేనేమి? వికీకి మాత్రం విరామం లేదు. నీవంటివారెందరో ఉన్నారు. నీ పలకరింపు నాకు చాలా సంతోషం ఇస్తుంది. --కాసుబాబు 17:53, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు

[మార్చు]

ప్రదీపు గారు ఇలా ప్రతి పట్టాణానికి సమాచార పెట్టె మార్చడం కష్టం కదా ఏదైనా బాటు ని ఏర్పాటు చెయ్య వచ్చుకదా!!!--మాటలబాబు 19:03, 8 జూలై 2007 (UTC) ప్రదీపు గారు మీరు ఎందుకు నేను ఏమి అడిగిన సమాధానం చెప్పరు. నేనంటె ఎందుకు మీకింత అయిష్టం , నేనేమేనా తప్పులు చెస్తే సరిదిద్దాలి కాని, నాతో మాట్లాడక పోతె ఎలా, మీరు నాతో మాట్లాడక పోతే ఏదో లా ఉంటుంది.--మాటలబాబు 19:18, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సమాధానాలు ఇచ్చేసరికి కొంత ఆలస్యమవుతుంది, అంతకంటే ఏమీలేదు. ఇక బాటుతో అన్ని పనులు చేయించటం కుదరదు. కొన్ని కొన్ని పనులు వాటి ద్వారా చేయించలేము, ఒక వేళ చేయించ గలిగినా వాటికి బాటును తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. బాటుతో ఏదయినా పని చేయించాలంటే మొదటగా ఆ పనిని గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి, అప్పుడె ఒక మంచి బాటును తయారు చేయగలం. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:31, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉపయోగపడే వనరు

[మార్చు]

మీరు వివిధ దర్శనీయ స్థలాల గురించి రాస్తున్నారు కాబట్టి మీకీ సైటు ఉపయోగపడవచ్చు. ఇందులోని సమాచారమంతా (ఫోటోలతో సహా) క్రియేటివ్ కామన్స్ లైసెన్సు క్రింద ఉన్నది. కాబట్టి వాళ్ల సైటునుండి తీసుకున్నామని చెప్పుకుని ఏదైనా సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. --వైజాసత్య 21:15, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భలే, మనిద్దరం ఒకేసారి ఒకేబొమ్మను అప్లోడ్ చేసినట్టున్నాము. కానీ మీరు అప్లోడ్ చేసిన బొమ్మ చిన్నది (6 కేబీ) నేను చేసినది 54కేబి (ఒకటే బొమ్మ)..మీరు అప్లోడ్ చేసిన కూర్పును తొలగిస్తున్నాను --వైజాసత్య 21:33, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుందరకాండ

[మార్చు]

మాటల బాబూ!

  • సుందరకాండ వ్యాసం నువ్వు ఇంతకు ముందు చాలావరకు వ్రాసావని గుర్తు. వ్యాసం చరిత్రలో కూడా వివరాలున్నాయి. కాని ఇప్పుడు వ్యాసం చాలా భాగం తగ్గింది? ఎవరైనా తొలగించారా? లేక నీవే తిరగరాస్తున్నావా?
  • సుందరకాండ అయోమయనివృత్తిలో కొన్ని మెలికలు ఉన్నాయనిపిస్తుంది. సరిచేస్తాను.

--కాసుబాబు 08:44, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారు సుందరకాండ లొ సాగర లంఘనం మాత్రమే వ్రాయడం ప్రారంభించాను తరువాత, వ్రాసిన దానికి కూడా చాల శుద్ధి అవసరం అందుచేత మరియు, సుందరకాండ మెత్తం ఒకే పేజి వ్రాస్తే చాలా పెద్ద వ్యాసం అవుతుందని నిర్ణయించి, ఆ వ్యాసాన్ని అక్కడే విడిచి పెట్టాను. మీరు రచ్చబండ లొ వ్రాసిన విషయాన్ని చదివాను, మీరు చెప్పింది యదార్థం, సుందరకాండ మెదటి మరియు చివరి శ్లోకాలా (2 శ్లోకాల మీద)మీద వ్యాఖ్యానాలతో పరిశోధకులు పెద్ద పుస్తకాలు వ్రాశారు.కాని మీరు ఇచ్చిన సందేశాన్ని చూసి మళ్ళి ప్రారంభించాలి అనే కుతూహలం బయలు దేరింది. --మాటలబాబు 17:00, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పతాకం సంపాదించినందుకు అభినందనలు

[మార్చు]

తెవికీకి మరిన్ని వినగలిగే వ్యాసాలను అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ వారానికి టి.జి.కమలాదేవి వ్యాసాన్ని "ఈ వారం వ్యాసం"గా ఎంపిక చేస్తున్నాను. మీరేమంటారు? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:14, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించండి ఆలస్యంగా సమాధానం చెప్పుతున్నందుకు, ఇప్పుడె తిరిగి వచ్చాను, పతాకం ఇచ్చినందుకు వైజాసత్యాగారికి ధన్యవాదాలు. ఏదో వచ్చిరాని మాటలతొ అక్కడ ఉన్న వ్యాసాన్ని చదివాను,అంతే.., మరిన్ని శ్రవణ పైల్సు చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. టి.జి.కమలాదేవి తప్పకుండా ఈ వారం వ్యాసంగా మలుద్దాం, ఆ వ్యాసం లొ నా హస్తం కూడా ఉన్నది నేను సభ్యుడి చేరక మునుపు. --మాటలబాబు 16:43, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
హన్నా! మాటల బాబు అంటే అర్ధం ఇప్పుడు తెలిసింది! - --కాసుబాబు 06:17, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
చేతలబాబుకు వందనాలు! --నాగడు 21:32, 12 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కర్ణాటక జిల్లాలు

[మార్చు]

మాటలబాబు గారూ, చాలా నెలల నుండి కర్ణాటక జిల్లాల పేజీలు చలనం లేకుండా ఖాళీగా పడున్నాయి. (ఇవి సృష్టించింది నేనే..తెవికీకి కొత్తలో అలా ఉట్టిపేజీలు సృష్టించడం వల్ల లాభం లేదని తెలియక సృష్టించా). మీరు వాటిని కదిలించగలరా. మీకు మీ ఇష్టం వచ్చిన పేజీల మీద పనిచేసే స్వేఛ్ఛ ఉంది. ఇది కేవలం సూచన మాత్రమే --వైజాసత్య 05:51, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకో సూచన, కర్ణాటక జిల్లా పేజీలలో ఇప్పుడున్న మూసను తీసేసి {{భారత స్థల సమాచారపెట్టె}}ను చేర్చగలరా... ఉదాహరణకు నేను హసన్ జిల్లా వ్యాసంలో పైన ఉన్న సమాచార పెట్టెకు చేసిన మార్పులను చూడండి. _మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:11, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదిపు గారికి, వైజా సత్యా గారికి,కర్ణాటక జిల్లాల గురించి వ్రాయడానికి నావంతు ప్రయత్నం చేస్తాను, సమాచార పెట్టెలు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను--మాటలబాబు 06:18, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మాటలబాబు

[మార్చు]

మాటలబాబు రాత్రిళ్ళు పని చేయడంవల్ల పగటి పూట తెవికి రాలేక పోతున్నడు. ఈ వారం అంతా ఇంతే --మాటలబాబు 08:57, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సెలవు మూసలు

[మార్చు]

సెలవు మూసలు తయారు చేసినందుకు,రాత్రి కంగారు లొ మీకు కృతజ్ఞతలు చెప్పడం మర్చి పోయాను, సెలవు మూసలు చేసినందుకు చాలా కృతజ్ఞతలు, నాకు తెవికి ఒక జబ్బు లాగే పట్టుకొంది, పగలు నిద్ర పోయఏటప్పూదు కూడా అప్పుడప్పుడు లేచి ఇటీవల మార్పులు పేజి మీద నొక్కి ఏమి జరుగుతోందో చూస్తున్నాను--మాటలబాబు 16:59, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీకే కాదు, నాకు కూడా అంతే. తెలుగు వికీలో ఇలాంటి శెలవు మూసలాంటి దానిని మొదటి సారిగా పెట్టుకుంది నేనే అనుకుంటా... ఆ తరువాత ఇంకో రెండు మూడు సార్లు వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ కుదరలేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:49, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం

[మార్చు]

రచ్చబండలో మీకు ఈ వారం వ్యాసం అందటం లేదని రాశారు... నేను వికీపీడియాలో ఉన్న సభ్యులకు పంపించటం లేదు, ఎందుకంటే, వికీపీడియాలో సభ్యులైన వారి ఈమెయిలు నా దగర లేదు. నేను ప్రస్తుతానికి telugublog, teluguwiki గూగుల్ గుంపులకు మాత్రమే పంపిస్తున్నాను. పైగా మీరు వికీపీడియాకు ఇచ్చిన ఈమెయిలును confirm కూడా చేసినట్లు లేరు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 03:07, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]