వాడుకరి చర్చ:Pramodkumar
స్వాగతం
Pramodkumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాలో రచనలు ఎలా చెయ్యాలో చెప్పే పుస్తకం చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.
హలో
[మార్చు]ప్రమోద్ కుమార్ గారూ, నమస్కారం. వికీపీడియాకు స్వాగతం.
- "మొదటి రచన"లో మీ ప్రయత్నం, కవిత్వం బాగున్నాయి.
- కాని ఇది వికీ సంప్రదాయానికి అనుగుణంగా లేదు. అంటే వికీ అనేది విజ్ణానాన్ని ఒకచోట కూర్చే వేదికే గాని, సాహితీ సృజనకు సరైన స్థలం కాదు.
- కనుక నిర్వాహకులు (నేను కాదు) దీనిని తొలగించే అవకాశం ఉన్నది. దయచేసి దీనిని మీ కవితపై అభిప్రాయంగా అనుకొని నిరుత్సాహ పడవద్దు.
- బ్లాగులో గాని, వేరే వేదికలలో గాని మీ కవితా ప్రస్థానాన్ని కొనసాగించండి
- అన్యధా భావించకుండా తెలుగు వికీపీడియాలో విజ్ణానపరమైన రచనలు చేస్తూ ఉండండి.
కాసుబాబు 18:08, 5 డిసెంబర్ 2006 (UTC)
- తెలుగులో రాయాలన్న మీ ఉత్సాహం బాగుంది; దానికి ముందు పైన ఉన్నదానిని చదివి; ఒక సారి ఆలో చించి ఆ తరువాత రచణలు చేయండి. వర్షించని వెన్నలనీ నవ వర్షం మరియు Modati rachana రెండూ కూడా విజ్ఞాన సార్వస్వానికి తగినట్లుగాలేవు. అవి అతి త్వరలో తలగించబడతాయి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 13:48, 6 డిసెంబర్ 2006 (UTC)
- ప్రమోద్ కుమార్ గారూ,
- సాహితీ రచనలకోసం మీరే ఒక బ్లాగు సృష్టించవచ్చు. బ్లాగు ఎలా మొదలుపెట్టాలో తదితర అంశాలపై సహాయానికి తెలుగుబ్లాగు గూగుల్ సమూహం ను సంప్రదించండి.
- లేదా, మీ రచనలని సాహిత్యం గూగుల్ సమూహంతో కూడా పంచుకోవచ్చు.
- --వీవెన్ 08:57, 7 డిసెంబర్ 2006 (UTC)
- ప్రమోద్ కుమార్ గారూ,
తొలగిస్తున్నాను
[మార్చు]Pramodkumarగారు, మీరు చేసిన కొన్ని రచనలు వికీపిడియాకు సమంజసంగాలేవు అని ఇంతకుముందు ఒక సారి మాట్లాడుకున్నాము. కాబట్టి ఆ రెండు రచనలను మీ సభ్యపేజీలో చేర్చాను. ఆ సభ్యపేజీలో మీరు ఏదయినా రాసుకోవచ్చు. అప్పుడు అది ఎవరికీ అబ్యంతరం కాదు. అలాగే వికీపిడియాలో మిరు చేయగలిగే పనులు ఇంకా చాలా ఉన్నాయని అనుకుంటున్నాను. దయచేసి ఒకసారి వికీపిడియా ప్రాజెక్టుల పేజీని సందర్శించండి. అక్కడ మీకు నచ్చిన ప్రాజెక్టు ఒక్కటయినా ఉంటుందనే అనుకుంటున్నాను. ఒక వేల ఏదీ లేకపోతే మీరే ఒక ప్రాజెక్టు మొదలుపెట్ట్వచ్చు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:36, 9 డిసెంబర్ 2006 (UTC)
కవితలు
[మార్చు]ప్రమోద్ కుమార్ గారూ! నమస్కారం. "ఎదుగుతున్న బిడ్డను చూసి తల్లి , ఆయువు తగ్గుతున్నదనుకోదు కద!" - మీ కవితలు బాగున్నాయి. ఈ మాట మర్యాదకోసం కాదు. మనస్ఫూర్తిగా అంటున్నాను. కాకపోతే వికీ కార్మికులకు అంతగా కవిత్వం పై శ్రద్ధ కనిపించడంలేదు. మీరు కవితలతో పాటు అప్పుడపుడూ మీకు తెలిసిన విషయాలగురించి (ఉదాహరణకు తెలుగు సాహిత్యము) వికీలొ వ్యాసాలు కూడా వ్రాస్తూ ఉంటే మాకు మరింత సంతోషంగా ఉంటుంది. --కాసుబాబు 11:22, 7 మార్చి 2007 (UTC)