వాడుకరి చర్చ:Kumarsarma
Kumarsarma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. --Svrangarao 05:22, 6 డిసెంబర్ 2008 (UTC)
ఇదివరకు ఆంగ్లవికీపీడియాలో నిర్వాహకులుగా పనిచేశారు అన్నారు. అక్కడ కూడా మీ లాగిన్ నేమ్ ఇదేనా? --వైజాసత్య 04:30, 8 డిసెంబర్ 2008 (UTC)
కాదులే. నేను అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నప్పుడు ఇంకో అడ్మినిస్ట్రేటర్ సాక్ పప్పెట్స్ ని వాడుతున్నాడని నేను అతని ఐ.పి. బ్లాక్ చేశాను. అతనికి అనుకూలుడైన మరో అడ్మినిస్ట్రేటర్ నా ఐ.పి. బ్లాక్ చేశాడు. టాటా ఇండికాం ఉద్యోగుల్లో నాకు తెలిసిన వారు ఉండడం వల్ల డైనమిక్ ఐ.పి.లు తీసుకుని ఆంగ్ల వికిపీడియాలో పోస్ట్ చేసే వాడ్ని.
- ఒహో! అలాగా. అయితే ఆంగ్ల వికీపీడియాలో మీ లాగిన్ నేమ్ ఏంటి? --వైజాసత్య 04:52, 8 డిసెంబర్ 2008 (UTC)
రెండేళ్ళ్ క్రితం బ్లాక్ చేసినది ఇప్పటికి మరిచిపోయాను.
మీ భావాలు
[మార్చు]మీ భావాలు, అభిప్రాయాలు బావున్నాయి. ఒక బ్లాగు మొదలు పెట్టచ్చు కదా. నరిశెట్టి ఇన్నయ్య గారి బ్లాగు చూశారా? --వైజాసత్య 05:51, 8 డిసెంబర్ 2008 (UTC)
నేను కూడా వెబ్ డిజైనర్ నే. నా బ్లాగ్ లో శివసాగర్ కవితలు కూడా దర్శనమిస్తాయి.[1]. ఆకలి మంటలు అనే హెడింగ్ పేరుతో ఆకలి రాజ్యం సినిమాలోని ఒక సీన్ ని కూడా ఉదహరించాను.
- మంచి వెబ్ సైటునే తయారు చేశారు. తెలుగు వ్యాసాలు ఉంచాల్సి వచ్చినప్పుడు పిక్చర్స్ పెట్టకుండా, అచ్చంగా తెలుగు యూనీకోడ్లో వ్రాస్తూ ఉండండి. గూగూల్లో వెతికినప్పుడు మీ సైటు కనిపించే అవకాశలు మెండుగా ఉంటాయి. --వైజాసత్య 06:07, 8 డిసెంబర్ 2008 (UTC)
Old operating systems do not support unicode.
వికీలో తటస్థత
[మార్చు]- కుమారశర్మ గారూ, వికీ అభిప్రాయవేదిక కాదు. ప్రాపగాండా సాధనం అంతకంటేనూ కాదు. మీరు సృష్టిస్తున్న వ్యాసాలతో వ్యక్తిగతంగా నాకే ఇబ్బందీ లేదు కానీ అందులో సొంత అభిప్రాయాలు, మూలాలు ఉదహరించని వ్యాఖ్యలు వికీలో చెల్లవు. మూలాలంటే కాస్త విశ్వజనీయమైనవి, ప్రధానస్రవంతి పత్రికలో ప్రచురించనవై ఉండాలి. మీరు వెబ్‌సైటు చక్కగా ఉంది. ఒక బ్లాగు ప్రారంభించి కూడలిలో పెట్టుకుంటే నలుగురు వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. చాలామంది సభ్యులకు, నిర్వాహకులకు మీరు వ్రాసే వ్యాసాలు వికీకి తగవు అనిపించింది. తటస్థతను గాలికి వదిలేసి, ఇష్టం వచ్చిన సొంత అభిప్రాయాలను ఇలాగే వ్రాస్తూ ఉంటే మిమ్మల్ని నిషేధించకుండా నేను ఆపలేను. వికీ ప్రజాస్వామ్యమని ఎక్కడా చెప్పుకోలేదు WP:NOT చదవండి. ఇంతకుముందు మీ ఐపీ అడ్రసులను నిషేధించాము. అయినా నిషేధాన్ని మీరు లెక్కచేయకుండా సాక్‌పప్పెట్సును తయారుచేసుకొని తిరిగి ప్రవేశించడం ఏమీ బాగోలేదు. Gummanagaraju, Gangajalam మీరేనని ఋజువైంది. --వైజాసత్య 22:15, 8 డిసెంబర్ 2008 (UTC)
- వికీపీడియా:ఐదు మూలస్తంభాలు లో ఈ పేరా చదవండి. వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం. --వైజాసత్య 22:17, 8 డిసెంబర్ 2008 (UTC)
ఇక్కడ నేను వ్యక్తిగత అభిప్రాయాలు వ్రాయడం లేదు. గతంలో ఒక వీర ముస్లిం భక్తుడొకరు నేను చెయ్యని విమర్శలకు నన్ను దూషిస్తూ ఇ-మెయిల్స్ పంపాడు. ఆ ఇ-మెయిల్స్ చదివిన తరువాతే ఇస్లాంను విమర్శించాలనే ఆలోచన నాకు వచ్చింది. అందుకు కోసం నేను సల్మాన్ రష్దీ, అలీ సీనా లాంటి మాజీ ముస్లింల రచనలు కూడా వెలికి తీశాను. నిరాధార అరోపనులు చెయ్యడం, మతం పై వ్యక్తిగత విమర్శలు చెయ్యడం లాంటివి నాకు కూడా నచ్చవు.
- మీ భావజాలం చాలా లోతైనది కుమార శర్మ గారూ! మీలాంటి ఆలోచనాపరులు తెలుగు వికీకి అవసరం. ఎవరో చెయ్యని విమర్శలకు మీమీద బురద జల్లారని మీరు కూడా అలాగే చేసి వ్యక్తిగత ప్రతిష్టను పోగొట్టుకోకండి. తెలుగు వికీ లో మానవజాతిని విద్వేషం వైపు మరల్చే అలాంటి విషయాలకు తావు లేకుండా సర్వ మానవాళికి విజ్ఞానాన్ని పంచే విధంగా ఉండాలని మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాం. అందులో మీరు కూడా భాగం కాగలరని మనసారా కోరుకుంటూన్నాం. రవిచంద్ర(చర్చ) 11:19, 10 డిసెంబర్ 2008 (UTC)
మీరు వ్రాయగలిగే వ్యాసాలు
[మార్చు]శర్మగారూ, మార్క్సిజం, చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం మొదలైన అంశాలపై మీకు బాగా అవగాహన ఉన్నట్లుంది. వీటిపై తెవికీలో ప్రస్తుతానికి వ్యాసాలు లేవు. అలాంటివి నాకు సరిగా అర్ధంకావు. అందువల్ల మీరు ఈ అంశాలపై చక్కటి వ్యాసాలు వ్రాయాలని విజ్ఞప్తి --వైజాసత్య 07:54, 9 డిసెంబర్ 2008 (UTC)
ఆంగ్ల వికీ లింకులివ్వండి
[మార్చు]కుమార శర్మగారూ! మీరు వ్రాసే వ్యాసాలకు ఆంగ్ల వికీ లింకులు ఇవ్వమని కోరుతున్నాను. అలాగే ఇంగ్లీషు వికీలో కూడా తెలుగు వికీ లింకులు చేర్చగలరు. ఇలాంటి క్లిష్టమైన విషయాల గురించి వ్యాసాలు వ్రాస్తున్నందుకు అభినందనలు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:37, 9 డిసెంబర్ 2008 (UTC)
భాష అర్థమయితే తత్వం అర్థం చేసుకోవడం సులభమే. మార్క్సిజం సులభంగానే అర్థమవుతుంది కానీ హెగెల్ తత్వశాస్త్రం సులభంగా అర్థం కాదు. భాష అర్థమైనా అంతరార్థం (implications) అర్థం కావు. హెగెలీయ తత్వశాస్త్రపు అంతరార్థం నాకు అర్థంఅయ్యింది కానీ నేను అవి ఆంగ్లంలో చదవడం వల్ల తెలుగులో వ్రాయలేకపోయాను.
మంచి వ్యాసాలు
[మార్చు]తత్వశాస్త్రం చాలా క్లిష్టమైనది. సామాన్య వికీ సభ్యులకు ఇవి చాలావరకు అర్ధంకావు. కానీ వీనికి మూలకారకులైన తత్వవేత్తలను, వారు జీవించిన కాలాన్ని ఆనాటి సాంఘిక పరిస్థితులను కూడా తెలియజేసి వివరిస్తే మంచిదని నా అభిప్రాయం. మతంతో లింకు పెట్టద్దు. మత విషయాలను వదలిపెట్టి మనుషుల నమ్మకాలతో విమర్శిస్తూ లేదా సమర్ధిస్తూ వ్యాసాలు రచిస్తే ఎవరికీ కష్టం కలిగించదు. ములాలు తప్పకుండా చేర్చాలి. లేకపోతే వాటిని మీ స్వంత వ్యక్తిగత అభిప్రాయాలుగా అపోహ కలిగిస్తాయి.Rajasekhar1961 05:04, 10 డిసెంబర్ 2008 (UTC)
హెగెల్ తత్వశాస్త్రం పై క్రైస్తవ మత ప్రభావం ఉంది కాబట్టే ఆ విషయం వ్రాసాను. సంప్రదాయవాద హెగెలీయులు క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. వామపక్ష హెగెలీయులు మతాన్ని తిరస్కరించారు. హెగెలీయవాదానికి, మతానికి మధ్య ఎంత వరకు సంబంధం ఉందో తెలుసు కోవడం అవసరమే. టాల్స్టాయ్ ఒక మూఢ భక్తుడని తెలిసి కూడ లెనిన్ అతన్ని అభిమానించేవాడు. మతంతో సంబంధం లేని ప్రగతి నిరోధక భావాలు ఉన్న వారు కూడా ఉంటారు. హెగెల్ లో ప్రగతివాద తత్వం, ప్రగతి నిరోధక తత్వం రెండూ ఉండేవి. అయితే హెగెల్ లో ఉన్న జడతత్వ భావాలన్నీ మతానికి సంభందిచినవి అని నేను అనుకోను. కనుక సంప్రదాయ హెగెలీయవాదాన్ని విమర్శించడమంటే మతాన్ని విమర్శించడం కాదు.
- మూలాలను ఉదహరించడం నేర్చుకోండి. అప్పుడు చాలామటుకు వ్యక్తిగత అభిప్రాయాలు అన్న విమర్శ రాదు. వికీపీడియా:మూలాలను పేర్కొనడం / en:Wikipedia:Citing sources --వైజాసత్య 05:34, 10 డిసెంబర్ 2008 (UTC)
నేను ఆంగ్లంలో వ్రాస్తే ఇక్కడ ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే కొందరికి తెలుగు అర్థం చేసుకోవడం కూడా కష్టమే. Phenomenology of nature గురించి హెగెల్ వ్రాసినది ఆంగ్లంలో ఎక్కడో చదివాను. దాని లింకు గుర్తు లేదు. దాన్ని Andy Blunden అనే మార్కిస్టు అనువదించినట్టు మాత్రం గుర్తు ఉంది. తెలుగులో కూడా హెగెల్ గురించి ఒక పుస్తకం చదివాను. అది విశాలాంధ్ర వారు పబ్లిష్ చేసినదో ప్రజాశక్తి వారు పబ్లిష్ చేసినదో నాకు గుర్తు లేదు. అది నా బీరువాలో ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తు లేదు. అందుకే రిఫరెన్సులు రాయలేక పోయాను.
క్రైస్తవ మతం పైన భూస్వామ్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. హెగెల్ పెట్టుబడిదారీ వ్యవస్థని నమ్మేవాడు. భూస్వామ్య సంస్కృతికి, పెట్టుబడిదారీ సంస్కృతికి మధ్య కనిపించగల తేడా ఉంటే క్రైస్తవ మతానికి, హెగెల్ తత్వశాస్త్రానికి మధ్య కూడా తేడా ఉంటుంది. హెగెల్ వ్యక్తిగతంగా సంప్రదాయవాద ప్రొటెస్టంటు క్రైస్తవుడు అనేది నిజం. అయినా కూడా హెగెల్ తత్వశాస్త్రం పూర్తిగా క్రైస్తవ మత ప్రభావితమైనదని అనుకోలేము. పరిశీలన జరిపేటప్పుడు మనకి తెలిసిన నిజాలు వ్రాయాలి. అందుకే హెగెల్ కి క్రైస్తవ మతానికి మధ్య ఉన్న సంబంధం గురించి వ్రాసాను.
- మీకు గూగుల్ బుక్స్ తెలుసా. అందులో ఒక విషయాన్ని వెతికితే వివిధ పుస్తకాలనుండి వెతికి చూపిస్తుంది. ఉదాహరణ ఈ లింకు చూడండి. ఇలాంటివి వెతికి మూలాలుగా చేర్చవచ్చు --వైజాసత్య 05:53, 10 డిసెంబర్ 2008 (UTC)
హెగెల్ "Phenomenology of Nature" గురించి నేను మార్కిస్ట్ ఇంటర్నెట్ ఆర్కివ్ [[2]]లో చదివాను కానీ ఆ లింకు ఏ మూలన ఉందో నాకు గుర్తు లేదు.
మూలాలు
[మార్చు]ఆంగ్ల వ్యాసం తెలుగులోకి అనువదించేటప్పుడు మూలాలను తొలగించకుండా జాగ్రత్త పడండి. అవి మళ్ళీ చేర్చాలంటే అదనపు పని. మూలాలు <ref> మరియు </ref> మధ్యలో ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది. --వైజాసత్య 05:17, 11 డిసెంబర్ 2008 (UTC)
నిర్వహణ టాగ్‌లు
[మార్చు]- ఎవరైనా ఒక వ్యాసంపై తొలగింపు అనిగానీ ఇంకా ఏదైనా నిర్వహణ మూసలను ఉంచితే వాటిని సరైన వివరణ లేకుండా ఏకపక్షంగా తొలగించడాన్ని వికీలో అమర్యాదగా భావిస్తారు --వైజాసత్య 05:18, 12 డిసెంబర్ 2008 (UTC)
వివరణ ఇచ్చాను.
గౌరవార్ధ సూచకాలు
[మార్చు]తెవికీలో వ్యక్తులకు బహువచన ప్రయోగం చేయకూడదు. వివరణ కోసం వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి --వైజాసత్య 06:18, 12 డిసెంబర్ 2008 (UTC)
మూలం గురించి
[మార్చు]క్షమించాలి. మీరు సున్నితమైన విషయం అన్న మూసను తొలగించడాన్ని రద్దు చేయటంలో పొరపాటున ఆ మూలం తొలగిపోయింది. అలా జరిగినప్పుడు నా చర్చాపేజీలో ఒక మాట వ్రాయవచ్చును. ఏకంగా నేనేదో కావాలని తీసేశాని ఊహించుకోవద్దు. always assume good faith వికీ మర్యాదల్లో ఒకటి --వైజాసత్య 16:21, 14 డిసెంబర్ 2008 (UTC)
వ్యక్తిగత దూషణలు
[మార్చు]ఇలాంటి వ్యక్తిగత దూషణలకు ఇంకోసారి పాల్పడకండి. అలా చేస్తే మిమ్మల్ని తెలుగు వికీపీడియా నుండి బహిష్కరిస్తాను. అలాగే చర్చాపేజీలలో రాసేటప్పుడు ~~~~ (నాలుగు టిల్డేలు) పెట్టి సంతకం చేయడం మొదలుపెట్టండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:31, 15 డిసెంబర్ 2008 (UTC)
వ్యక్తిగత దూషణలు కాదు. భారత నాస్తిక సమాజం నాయకులు నా కంటే భయంకరంగా మాట్లాడుతారని చెప్పడానికే అలా వ్రాసాను. జయగోపాల్ గారు పాకిస్తాన్, ఇజ్రాయెల్, పాలస్తీనాలలో జరుగుతున్న మత హింస గురించి భయంకరమైన లెక్చర్లు ఇచ్చారు. అతని ప్రభావం వల్లే నేను వీర నాస్తికున్నయ్యాను. రహంతుల్లా గారు తనకి జయగోపాల్ తెలుసునని అన్నారు. కానీ నేను జయగోపాల్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడాను. అందుకే నేను అతన్ని భారత నాస్తిక సమాజం మీటింగులకి రమ్మన్నాను.
- భారత నాస్తిక సమాజం నాయకులు ఇలా అర్ధం లేకుండా మాట్లాడరు.వీర నాస్తికుడు అంటే భయంకరంగా మాట్లాడటం కాదు.గోరా లాగా మాట్లాడటం.జయగోపాల్ గారు నాకు తెలుసునని నేను చెప్పలేదు.ఇలా సవాళ్ళు చేసి బెదిరించి ఎవరి మనసూ మార్చకపోగా నాస్తిక సమాజాన్ని నామర్దా పాలు చేస్తారా?.మానవ సంక్షేమాన్నికోరే నాస్తికమతాన్నిఅరివీర భయంకర వాదనగా చెయ్యటం భావ్యం కాదు.మత హింస , మానసిక హింస రెండూ హేయమే.--Nrahamthulla 15:58, 15 డిసెంబర్ 2008 (UTC)
నేనేమీ హింసావాదినని చెప్పుకోలేదు. మీకు ఎందుకంత భయం? జయగోపాల్ గారు సెక్యులరిస్టులందిరికీ ఆదర్శ పురుషుడు. అనేక పెళ్ళిళ్ళు చేసుకుని, అనేక మంది ఉంపుడుగత్తెలని ఉంచుకున్న ముహమ్మద్ ప్రవక్త స్థాపించిన మతం మనిషికి ఎలాంటి భూస్వామ్య కుళ్ళు నీతిని నేర్పిస్తుందో నాకు తెలుసు. జయగోపాల్ గారు నా కంటే స్పష్టంగా మాట్లాడుతారు. అంతే. ఇస్లాం మతమే కాదు, ఇతర మతాలు కూడా భూస్వామ్య మూలాల నుంచి పుట్టిన మతాలే. అవి నేర్పించేది కూడా భూస్వామ్య నీతే. ఒకప్పుడు జెర్మనీ లాంటి క్రైస్తవ దేశాలలో స్త్రీలకి డాక్తర్ ఉద్యోగం చేసే అవకాశం ఇవ్వలేదు. రోజా లక్సెంబర్గ్ లాంటి స్త్రీవాదులు పోరాడి హక్కులు సాధించుకున్నారు. ఇస్లామిక్ దేశాలలో ఇప్పుడు కూడా ఉద్యోగం చేసే స్త్రీల సంఖ్య తక్కువే. అది కూడా భర్తల పర్మిషన్ తోనే చేస్తారు కానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోరు.
- "మీకు ఎందుకంత భయం?" ;-) హహ్హహ్హ --వైజాసత్య 02:42, 16 డిసెంబర్ 2008 (UTC)
నవ్వితే వచ్చేదేమీ లేదు. మీరు కూడా పాకిస్తాన్ లోనో, ఇస్రాయెల్ లోనో, పాలస్తీనాలోనో పుట్టి ఉంటే టెర్రరిజం మధురమో భయానకమో అర్థమవుతుంది. అర్.ఎస్.ఎస్. నాయకులకి ఇండియాని పరిపాలించడానికి అధికారం ఇచ్చినా వాళ్ళు ఇండియాని మరో పాకిస్తాన్ గానో ఇస్రాయెల్ గానో మార్చేస్తారు. నిజం మాట్లాడకు, పరువు పోతుంది అంటూ నిజాలు చెప్పేవాళ్ళని తిడితే ప్రయోజనం ఉండదు. చరిత్ర అడక్కు, చెప్పింది విను అని అన్న ఒక సినిమా విలన్ డయలాగ్ లాగ ఉంటుంది.
కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం 2008 డిశెంబరు 10 న సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక,మూలాలు లేవు.విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:09, 4 మే 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:09, 4 మే 2020 (UTC)