Divakarpuduri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.
నేను ఓ అంశంపై ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. ఐతే కొత్త ఆర్టికల్ ఎక్కడ లింక్ చేయాలో తెలియటం లేదు. ఇంతకు ముందు ఓ ఆర్టికల్లో "మార్పులు" చేశాను కాని కొత్తది ఎప్పుడు రాయలేదు. ఎలా?
అది చాలా సులభం. ప్రక్కనున్న వెతుకు పెట్టెలో మీరు వ్రాయాలనుకొన్న వ్యాసం పేరు వ్రాసి, "వెళ్ళు" నొక్కండి. "ఆ పేరుగల పేజీ లేదు. మీరీ పేజీని సృష్టించవచ్చు. " అని సందేశం వస్తుంది. సందులో "సృష్టించవచ్చు" అనే ఎర్ర లింకు నొక్కితే ఆ పేరుమీద ఒక ఖాళీ పేజీ తెరుచుకొంటుంది. మీరు వ్రాయాలనుకొన్న విషయం వ్రాసి, భద్రపరచండి. అంతే. అయితే ఆ శ్రమ కూడా లేకుండా క్రొత్త వ్యాసం మొదలు పెట్టడానికి క్రింద ఇచ్చిన బాక్సు వాడవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:56, 23 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]