Jump to content

వాడుకరి చర్చ:D.V.A.CHOWDARY

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
D.V.A.CHOWDARY గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

D.V.A.CHOWDARY గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Pranayraj1985 గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Pranayraj1985 గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:54, 14 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

అభినందనలు డి.వి.ఎ.చౌదరి గారు, వికీపీడియాలో చాలా బాగా రాస్తున్నారు, అయితే ఇందులో కొంత మీకు కొత్తదనం కాబట్టి కొన్ని సూచనలు చెప్పాలని ఇది రాశాను, ఇందులో వ్యాసాలు సమాచారం ఇవ్వడానికి మాత్రమే అనగా మనము ఎంత పెద్ద వారి గురించి రాసిన గారు, శ్రీ లాంటి పదాలను ఆ వ్యక్తి గౌరవసూచకంగా చేర్చకూడదు. పర్వాలేదు మీరు ఈమధ్య కొత్తగా చేరిన వారు కాబట్టి, ఇవి సరిచేసే వారు వేరే వారు ఇందులో అడ్మిన్స్ ఉంటారు. ఇది మీకు తెలియని విషయం కాదు కాబట్టి రాస్తూ ఉంటే మీకు అనుభవం మీద చాలా బాగా రాయగలరు కాబట్టి కొత్త విషయాలు వ్యాసాలుగా రాయడం చేస్తూనే ఉండండి, మీరు రాసే విధానం చాలా బాగుంది. ఇతర వ్యాసాలు గమనించండి. మరి ఏమైనా సమాచారం కావాలంటే ఇక్కడ అడగండి. ధన్యవాదాలు. __ప్రభాకర్ గౌడ్చర్చ 13:58, 14 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

లంకా దినకర్

[మార్చు]

డి.వి.ఎ.చౌదరి గారూ, వికీపీడియాలో మనం రాసే వ్యాసాలకు తగు మూలాలను ఉల్లేఖించడం అవసరం. మరీ ముఖ్యంగా వ్యక్తుల జీవిత చరిత్ర వ్యాసాల్లో, అందునా జీవించి ఉన్నవారి వ్యాసాల్లో, మూలాలు పేర్కొనడం ఎంతో ఆవశ్యకం. ఆరోపణలు విమర్శలూ చేసినచోట మూలాలు మరింత ఆవశ్యకం. లంకా దినకర్ బాబు వ్యాసంలో కొన్ని ప్రశంసలు, కొన్ని ఆరోపణలూ ఉన్నాయి గానీ వాటికి మూలాలు చూపలేదు. నేను ఆధారాలు చూపాలి అనే మూసను పెట్టాను. వాటిలో కొన్నిటిని సరిచేసి, మరికొన్నిటిని సరిచేయకుండానూ మూసలను తీసేసారు. సరిచేసిన వాటిలో కూడా కొన్నిటికి మూలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పరిశీలించి తగు చర్య తీసుకొవాల్సినదిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 09:08, 23 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయనతో కలిసి పనిచేశాను , వారి వ్యక్తిగత అనుమతి తోనే అవి వ్రాయడం జరిగింది. D.V.A.CHOWDARY (చర్చ) 09:37, 23 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయన అనుమతి తీసుకుని రాయడం మంచి విషయమే నండి. అయినప్పటికీ మూలాలు తప్పనిసరి. మరీ ముఖ్యంగా కింది ఉదాహరణలు చూడండి:
  • "2019 లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం చవిచూసిన చేసినా తప్పులు సరిద్ధిదుకోక పోవడమే కాకుండా, వీరిని దూరంగా పెడుతూ రావడంతో పాటుగా సుమారు 11 ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను సైతం విస్మరించడంతో"
  • "2004-14 మధ్య వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 295 నియోజకవర్గాల్లో కొన్ని లక్షల బోగస్ ఓట్లు సృష్టించడం జరిగింది ."
ఇలాంటి వాక్యాలకు మూలాలు అవసరమండి. మరొక విషయం - మీరు కొత్తగా చేర్చిన డెక్కన్ హెరాల్డ్ మూలంలో ఈ వ్యాసంలో చేర్చిన విషయాలను బలపరచే సంగతేదీ కనబడ లేదు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 10:01, 23 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ములాలలో యాడ్ చేయడం జరిగింది మీకు ఇంకా సమాచారం కావాలంటే చెప్పండి ఇస్తాను D.V.A.CHOWDARY (చర్చ) 14:43, 23 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బెల్లం కోటయ్య వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

బెల్లం కోటయ్య వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

నోటబిలిటీని నిర్థారించే మూలాలు లేవు. తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బెల్లం కోటయ్య పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. -- కె.వెంకటరమణ 14:52, 6 అక్టోబరు 2021 (UTC) -- కె.వెంకటరమణ 14:52, 6 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మిస్టర్ మీరు ఒక మూలలలోని లింక్ చూడండి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది , అది చూడకుండా మీ ఇష్టం వచ్చినట్లు తొలిగించేందుకు అధికారం ఎవరు ఇచ్చారు, బెల్లం కోటయ్య గారు లాంటి ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త గురించి కష్టపడి వ్యాసం వ్రాస్తే తొలిగించేందుకు మీరు పూనుకున్నారు , నేనేదో వికీపీడియాలో కొత్త వ్యక్తుల గురించి నా వ్యక్తిగతంగా సమాచారం సేకరించి రాస్తుంటే మీకు ఇష్టమొచ్చినట్లు కారణాలు చెప్పి తీసేస్తారు, మీరు ఇలా ప్రవరిస్తే నేను ఇక వికీపీడియా లో వ్యాసాలు వ్రాయను , వ్యాసం నచ్చితే మెచ్చుకోండి అంతే D.V.A.CHOWDARY (చర్చ) 15:54, 6 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా D.V.A.CHOWDARY గారూ, వికీలో రచనలు చేసేటప్పుడు దానికంటూ నియమాలు కొన్ని ఉన్నాయని గమనించండి. బెల్లం కోటయ్య గారు ప్రముఖులే కావచ్చు. కానీ ఆయన గురించి ప్రముఖ ప్రచురణాలయం ప్రచురించిన పుస్తకాలో, ప్రముఖ వార్తా పత్రికల్లో వ్యాసాలో ఆధారంగా చూపాలో గాకీ కోరా లంకెలు కాదు. ఎందుకంటే కోరాలో రాసింది విశ్వసనీయమైన సమాచారం కాదు. స్వయంగా సేకరించిన సమాచారం కావచ్చు. వారు ఎక్కడి నుంచి సమాచారం సేకరించారో చెబితే దాన్ని మూలంగా పేర్కొనాలి. అంతేకానీ వికీ నిర్వాహకుల మీద కోపగించుకోకండి. వారంతా స్వచ్ఛందంగా వికీకి సేవచేస్తూ వికీని సరైన సమాచారానికి వేదికగా రూపొందించే వారు. ఒక్క విషయం గుర్తించండి. వికీ ఫేస్ బుక్, బ్లాగులు, కోరా లాంటి సామాజిక వేదిక కాదు. ఇందులో సమాచారం ఉండాలంటే తగు ఆధారాలు చూపాలి. దయచేసి గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 17:18, 6 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా మీకు పేపర్ లో వస్తానే ప్రామాణికం అయితే అక్కడ లేకే కదా ఇప్పటి వరకు ఆయన గురించి తెలిసిన ఏవరు రాయలేదు. సామాజిక మాధ్యమాలు అసలు ప్రామాణికం కాకపోతే , వికీపీడియాలో ఉన్న కొన్ని వందల సంఖ్యలో ఉన్న వ్యాసాలు తీసేయాలి ఎందుకంటే మీరు పేర్కొన్న పేపర్ లో కూడా లేని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చూసి వ్రాస్తున్నారు వికీపీడియాలో, కాబట్టి సమాచారాన్ని ఎక్కడ సేకరణ చేసిన తప్పులేదు , ఒక వేళ అలాంటి నియమాలను పెట్టుకున్నట్లు వికీపీడియా నిబంధనలలో లేదే. సమాచారాన్ని ఏ రూపంలో సేకరించిన తప్పులేదు. వికీపీడియాలో ఒక కొత్త వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నాను అనే సంతృప్తి కోసం రాస్తున్నాను ,వాళ్ళు గురించి తెలిసుంటే ఇప్పటికే రాసేవారు కదా రాయలేదు . వికీపీడియా అనేది స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఒకటిగా భావించి తెలియని వ్యక్తులు గురించి వ్రాస్తున్నాను అంతేకాని నాకు ఎవరి మీద అసహనం లేదు. సమాచారానికి అన్ని మార్గాలు ప్రామాణికమే అంతేకాని ఇదే ప్రామాణికం అని పేర్కొనడం అజ్ఞానం అవుతుంది D.V.A.CHOWDARY (చర్చ) 01:08, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం D.V.A.CHOWDARY గారు, వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు గమనించగలరు:
  1. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
  3. మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 02:17, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు , ఇక నుంచి వికీపీడియాలో నా నుంచి ఎటువంటి వ్యాసాలు రావు మీకు హామీ ఇస్తున్నాను D.V.A.CHOWDARY (చర్చ) 04:31, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటి దాకా వ్రాసిన వ్యాసాలు సైతం మీకు ఇష్టముంటే ఉంచండి ఇష్టం లేకపోతే తీసేయాలి అని కోరుతున్నాను. D.V.A.CHOWDARY (చర్చ) 04:32, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

డి.వి.ఎ చౌదరి గారూ, మీ కృషిని కించపరచాలని, మీ వ్యాసాలు తొలగించాలని మా ఉద్దేశ్యం కాదు. మీరు రాసిన వ్యాసాల్లో అయినా మేం స్వయంగా పరిశీలించి మూలాలు వెతికి ఆ వ్యాసాల్లో చేరుస్తాం. మూలాలు దొరకని సమాచారం మాత్రమే తొలగించడం జరుగుతుంది. వికీలో స్వచ్ఛందంగా రాయడానికి వచ్చినపుడే మీ నిబద్ధతను మేము అర్థం చేసుకోగలం. కానీ వికీ నియమాలు దయచేసి అర్థం చేసుకోండి. మూలాలు ఎందుకంటే సమాచారానికి ప్రామాణికత కోసమే. అలాగని వికీలో మీరు చెప్పినట్లు సమాచారం అంతా ఈ నియమాలకు లోబడి ఉందని కాదు. ఇది నిరంతరం మెరుగయ్యే ప్రక్రియ. - రవిచంద్ర (చర్చ) 05:23, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

[మార్చు]

@D.V.A.CHOWDARY గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 00:58, 11 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]