వాడుకరి చర్చ:Bochiraaja
స్వాగతం
[మార్చు]Bochiraaja గారూ, వికీపీడియా లోకి స్వాగతం. వికీపీడియాలో చేరీ చేరగానే ఇక్కడ రాయడం మొదలుపెట్టారు. చాలా సంతోషం. ఇలా వెంటనే రాసేవాళ్లు చాలా అరుదు - అందుకు మీకు అభినందనలు కూడా. పోతే మీరు వినోద్ బాల పేజీలో దిద్దుబాటు చేస్తూ తెలుగులో ఉన్నవాటిని ఇంగ్లిషు లోకి మార్చారు. ఇంటిపేరు లాంటి కొన్ని విశేషాలను చేర్చారు కూడాను. కానీ ఇంగ్లీషులో రాయడం వలన వాటిని తీసెయ్యాల్సి వచ్చింది. తెలుగు వికీలో సమాచారం తెలుగు లోనే కదా ఉండాల్సింది! పోతే, తెలుగులో రాయడం బహు తేలిక. ఇక్కడ రోమను లిపిలో తెలుగులో రాస్తూ పోతూంటే, వికీపీడియాలో దాన్ని తెలుగు లిపి లోకి మారుస్తూ పోతుంది. అంటే "telugulO" అని మీరు టైపు చేస్తే వికీ దాన్ని "తెలుగులో" అని మారుస్తుంది. గమనించండి. ప్రయత్నించండి. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ రాయండి. నేను చెయ్యగలిగిన సాయం చేసేందుకు నేను సిద్ద్ధం. ఉంటానండి. __చదువరి (చర్చ • రచనలు) 10:07, 12 ఫిబ్రవరి 2021 (UTC)