వాడుకరి చర్చ:B.K.Viswanadh/పాతచర్చలు 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.
B.K.Viswanadh/పాతచర్చలు 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైజాసత్య 08:03, 14 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

శ్రీకాకుళం

ఇక్కడ ఇప్పటికే శ్రీకాకుళం పైన ఒక వ్యాసం ఉంది. మీరు చేర్చాఅనుకున్న సమాచారాన్ని ఆ వ్యాసంలో చేర్చండి. __122.167.10.225 06:44, 26 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

jillaalu

జిల్లాకు సంభదించిన సమాచారాన్ని మండలాల్లోని ఒక మండలంలో ఇవ్వడం కంటే మండల సమాచారం మడలంలోనూ జిల్లా సమాచారం మొదటి పేజీలో ఇస్తే జిల్లా సమాచారం కొరకు మండలంలోని ఒక పట్టణంలోకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండదని నా భావన దయచేసి పరిసీలించగలరు.

మీరేం చెబుతున్నారో నాకు అర్ధం కాలేదు. కాస్త వివరంచండి. జిల్లాకు సంబంధించిన సమాచారం జిల్లా పేజీలోనే ఉంది కదా ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారం పశ్చిమ గోదావరిలో, కర్నూలు జిల్లా సమాచారం కర్నూలులోనే ఉన్నాయి కదా? --వైజాసత్య 14:45, 26 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మనం ఇంతకు ముందు ఒక సారి చర్చించుకున్నట్లుగా ఒకే పేరు ఉన్న జిల్లాలకు, పట్టణాలకు వేరువేరు పేర్లు ఉంటే బాగుంటుంది కాదా అని అంటున్నట్లున్నారు. ఉదాహరణకు, శ్రీకాకులం అనేది శ్రీకాకులం జిల్లాలోని ఒక మండలం కదా. మనమేమో శ్రీకాకుళం అనే పేజీలోనే (అంటే ఒక మండలం పేజీలోనే) జిల్లాకు సంబందించిన సమాచారం కూడా చేర్చేస్తున్నాము. దీనికి బదులుగా వీటికి వేరు వేరు పేజీలు కేటాయించాలని ఈయన కోరుతున్నట్లున్నారు. దీనిమీద ఎక్కడో చర్చించాము ఆ పేజీ ఎక్కడుందో ఇప్పుడు దొరకటం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:17, 26 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్ గారు మీరన్నదే నేచెప్పబోయినది. మీఊరు ఉందా అని మొదటి పేజీలో ఇచ్చారు అందులోకెళ్ళగానే జిల్లాలు జిల్లాల్లోకెళ్ళగానే మండలాలు కనిపిస్తున్నాయి.ఉదా-ప,గో, జిల్లా లో మూడు లైన్లు గ్రామాలు,పటములు, మండలాలు. మండలాల్లోకెళ్ళాక జిల్లా సమాచారం కోసం క్రిందున్న ప,గో, జిల్లాను క్లిక్ చేస్తే మళ్ళీ మెదటి పేజీ వస్తుంది.అపుడు జిల్లా సమాచారం కొరకు ఎక్కడ క్లిక్ చెయ్యాలి? ఈమండలాలకు పైన,మరియు గ్రామాలకుపైన,పటములకుపైన ఒకేలింకుగా జిల్లా సమాచారం అనే ఒక లైన్ చేరిస్తే జిల్లా సమాచారం కావలసిన వారు దానిని క్లిక్ చేస్తారు మండల,గ్రామ సమాచారంకొరకు మండలాల్లోకి గ్రామాల్లోకి వెళతారు. శ్రీకాకుళం పట్టణం గురించి పట్టణంలోనూ, మొదటి పేజీలో జిల్లా సమాచారంలో జిల్లా మ్యాపు మిగతా సమాచారం ఇస్తే బావుంటుందని నా సూచన. అలానే విజయనగరం,విశాఖ,వరంగల్,కరీమ్నగర్,ఇత్యాదులు.నాసూచనలో లోపాలుంటే దయచేసి వివరించగలరు..విశ్వనాధ్.28-7-07

ఈ పేజీలో ఉన్నట్లు వివరాలు ఉంటే సరిపోతుందా. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:30, 28 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]


photo

{{సహాయం కావాలి}}ఒక పోటోను వ్యాసానికి ఎలా చేర్చాలి.నేనొక పొటో ఉండవల్లి గుహాలయం పేరుతో అప్లోడ్ చేసా దానిని ఆవ్యాసపు పేజీకి తీసుకువచ్చుట ఎలా?

"సహాయం కావాలి" అనే దానిని "{ {" "}}" అనే బ్రాకెట్ల మధ్యన ఉంచాలి, పైన ఇప్పుడు వచిన పట్టీ ఒకటి వస్తుంది. బొమ్మలను ఎలా చేర్చాలో వివరంగా నేర్చుకోవాలంటే బొమ్మల పాఠం చదవండి. అలాకాదు వెంటనే బొమ్మను చేర్చాలని అనుకుంటే [[బొమ్మ:viswa.jpg|thumb|right|200px|ఉండవల్లి గుహలు]] అని వ్యాసంలో మీకు బొమ్మ కనపడాల్సిన విభాగంలో చేర్చండి. ఇకనుండి చర్చా పేజీలలో ఏదయినా రాసేసినప్పుడు ~~~~ అప్పుడు అక్కడ మీ సంతకం వస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:02, 28 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మను మళ్లీ అప్లోడు చేసినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:36, 28 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సూచన

మీరు చేరుస్తున్న బొమ్మలకు వివరణాత్మకమైన పేర్లు ఇవ్వండి. ఉదాహరణకు మీరు Viswa.jpg అనే పేరుతో చేర్చిన బొమ్మను "Undavalli_caves.jpg" అనే పేరుతో అప్లోడు చేసుంటే బొమ్మకు ఇంకా మంచి పేరు ఇచ్చినట్లు ఉంటుంది. ఇతర సభ్యులు బొమ్మల కోసం వెతుకుతుంటే వాళ్ళకు ఈ బొమ్మ సులువుగా లభించే అవకాశం ఉంది. వీలయితే "Undavalli_caves.jpg" లాంటి వివరణాత్మకమైన పేరుతో బొమ్మను మళ్లీ అప్లోడు చేయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:13, 28 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

photos

సహాయంనేను కొన్ని పొటొలను చేర్చుచున్నాను రేపు మరికొన్ని మంగళగిరి పొటొలను అందించగలను దయచేసి వాటిని అవసరమైన వ్యాసాలలో ఉంచగలరు.కృతజ్ఞతలు.

మంగళగిరి ఫోటోలో అప్లోడ్ చేసినందుకు కృతజ్ఞతలు. నేను వాటిని వ్యాసంలో పెడుతున్నాను. ఫోటోలను మీదగ్గర ఉన్న రెజల్యూషన్‌లోనే ఎక్కించండి. ప్రత్యేకంగా రెజల్యూషన్ తగ్గించాల్సిన అవసరం లేదు --వైజాసత్య 08:41, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మంగళగిరి మంచి ఫొటోలు అంటించిన మీకు ధన్యవాదాలు--మాటలబాబు 09:10, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పులికాట్ సరస్సుపై ప్రస్తుతానికి ఏవ్యాసమూ లేదు. మీరే ఒకటి మొదలు పెట్టండి :). _మాకినేని ప్రదీపు (+/-మా) 13:10, 6 ఆగష్టు 2007 (UTC)

ర్యాలి ఫోటో

ర్యాలి ఫోటో చాలాబాగా వచ్చింది. శెభాష్ --వైజాసత్య 08:52, 11 ఆగష్టు 2007 (UTC)

నేను అప్లోడ్ చేసిన బొమ్మే కదా మీరు ర్యాలి అప్లోడ్ చేసారు. బొమ్మని బాగా మార్చారు. నేను అప్లోడ్ చెసిన బొమ్మ అయితే మాత్రం మీరు బాగా పరిణితి చెందించారు.మీకో చిన్న చిట్కా మీ వ్రాసే చర్చా పేజి క్రింద వ్రాయండి. అప్పుడే చదివేవారికి అనువుగా ఉంటుంది. మార్చు ప్రక్కన ఉన్న + నొక్కవచ్చు అప్పుడూ ఆటొమేటిక్ క్రొత్త సందేశం పేజి క్రిందకు అస్తుంది. .--మాటలబాబు 14:24, 11 ఆగష్టు 2007 (UTC)

grama prachaaram

నేను అనుకోవడం తెవికీ గురించిన చిన్న కధనం గనుక ఈనాడు పేపరులో వస్తే అటు డైరెక్టుగా పేపర్ చదివే వారూ ఇటు నెట్ లో చదివేవారూ రెండు వర్గాల వారూ చేరువౌతారు అని.నాకూ దీని గురించి మొదట్లో తెలీదు బ్లాగులద్వారానే తెలిసింది.బ్లాగులను చదివేవారు బహు స్వల్పం. అదీ గ్రామాల సమాచారం అంటే అక్కడ ఉన్నవాళ్ళే ఇవ్వగలగాలి.vissu 13:18, 16 ఆగష్టు 2007 (UTC)

గ్రామ ప్రచారం అనే పదం రాలేదు కాని వికీపీడియా గురించి వివరించారు, ఇది చూడండి వికీపీడియా:రచ్చబండ (వార్తలు) , నేను ఈ మధ్య ఆర్కుట్ లొ తెలుగు గుంపుల కు వెళ్ళి నా వంతు ప్రచారమ్ చేస్తున్నా... వారి వారి పట్టణాల గుంపులకు , గ్రామాల గుంపులకు వెళ్ళి తెలుగు వికి లొ వ్రాయమని చెబుతున్నాను. --మాటలబాబు 15:33, 19 ఆగష్టు 2007 (UTC)

చిన్న మనవి

నొచ్చు కొరంటే ఒక విషయం చెబుతాను. మీరు బ్రాకెట్టు లకు మీసాల బ్రాకెట్లు వాడుతున్నారు. శైలి ప్రకారం మాములు బ్రాకెట్లు వాడాలి. --మాటలబాబు 09:01, 26 ఆగష్టు 2007 (UTC)

కిటుకు

{{subst:స్వాగతం|సభ్యుడు=Viswanath000}} అని మీసాల బ్రాకెట్లతో టైపు చేస్తే స్వాగత సందేశం వస్తుంది--మాటలబాబు 06:16, 30 ఆగష్టు 2007 (UTC)

స్వాగత సందేశం సభ్యుని చర్చాపేజిలొ చేయాలి.మీరు సభ్యుని పేజిలొ సందేశాన్ని తీసి {{subst:స్వాగతం|సభ్యుడు=Viswanath000}} తొ చర్చాపేజి లొ సందేశం ఇవ్వవచ్చు.
ఒకసారి ఊరు పేరు తెలుగు లొకి అనువదించేటప్పుడు తప్పులు దొర్లవచ్చు. అందువలన్ గుణింతం లొ కొద్దిగా లొపం ఉండవచ్చు. అప్పుడు ఆ పేజికి చరిం ప్రక్కన ఉన్న తరలింపు అనే మీట నొక్కి కావలసిన పేజి పేరు కి తరలించవచ్చు, కాని ఆవ్యాసము పేరు ఇప్పటికి పేరు ఉన్నచో ఆ తరలింపు అంగీకరించదు. మీరు కడమంచిలి కొడమంచిలి అనే రెండు పేజిలలొ సమాచారం వ్రాసినట్లున్నారు. అందువలన ఇప్పటికి అలా వదిలి వేద్దాం. వెతికే వారికి కొడమంచి అని వెతికినా లేదా కడమంచి అని వెతికినా దొరుకొతుంది.--మాటలబాబు 06:50, 30 ఆగష్టు 2007 (UTC)
రెండిట్లోనూ ఒకే సమాచారం ఉంది కాబట్టి కడమంచిలిని దారిమార్పు పేజీ చేసేస్తున్నాను. కొడమంచిలి సరైనా పేరు కదా? --వైజాసత్య 13:50, 1 సెప్టెంబర్ 2007 (UTC)

పేరు మార్పు

చదువరి గారికి కాని వైజా సత్యా గారికి కాని విన్నపం పెట్టుకొండి వారు మీ పేరు మారుస్తారు. మీ పాత దిద్దుబాట్లు అన్ని కూడా మీ కొత్త పేరు తో ఉంటాయి. సమ్కేత పదం కూడా మార్చుకొనసవరం లేదు. తరలింపు వల్ల పని జరగదు. కంగారు పడకండి చదువరి గారో సత్యాగారో సహాయాన్ని త్వరగా అందిస్తారు --మాటలబాబు 07:49, 5 సెప్టెంబర్ 2007 (UTC)

అవును, ఇలా పేజీ తరలించేస్తే కేవలం ఈ పేజీ పేరు మాత్రం మారుతుంది మీ లాగిన్ పేరే ఏకంగా తెలుగులో మార్చాలంటే చెప్పండి. మార్చేస్తాను. నేనూ,కాసుబాబు గారూ ఇదివరకు పేర్లు మార్చుకున్నాం. --వైజాసత్య 12:04, 5 సెప్టెంబర్ 2007 (UTC)
మీ సభ్యనామం మార్చాను. పరిశీలించి ఏమైనా సమస్యలుంటే తెలియజేయగలరు --వైజాసత్య 14:59, 5 సెప్టెంబర్ 2007 (UTC)

గ్రామాల సమాచారం

విశ్వనాధ్ గారూ, ఈ గ్రామాల సమాచారం విస్తరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీకు చాలా ఊర్లు తెలిసినట్టు ఉందే? మీకు ఏదైనా సమాచార వనరు తెలిసుంటే మాకూ చెప్పండి. మా జిల్లాలోని గ్రామాలకూ ఆ సమాచారాన్ని చేర్చే ప్రయత్నం చేస్తాను --వైజాసత్య 08:29, 6 సెప్టెంబర్ 2007 (UTC)

నేను పని చేసే ప్రదేశంలో ఈ ప్రాంతాలకు చెందిన వారు చాలామంది ఉన్నారు.వారి ద్వారా సేకరించిన సమాచారమేనండి ఇదంతా.నిజానికి నాకు పెద్దగా ఏమీ తెలియవండీ.విశ్వనాధ్. 08:36, 6 సెప్టెంబర్ 2007 (UTC)
ధన్యవాదాలు. ఈ ఆలోచన చాలా బాగుంది..నేనూ నా మిత్రులకి మెయిళ్ళు రాసి సమాచారం పంపిచమని కోరతా.--వైజాసత్య 08:40, 6 సెప్టెంబర్ 2007 (UTC)

గండపెండేరము

గండపెండేరము చాలా బాగుంది. నాకు గండపెండేరము బహూకరించినందుకు కృతజ్ఞతలు. --వైజాసత్య 09:47, 6 సెప్టెంబర్ 2007 (UTC)

విశ్వనాథ్ గారూ! నాకూ గండపెండేరం తొడిగినందుకు కృతజ్ఞతలు. __చదువరి (చర్చరచనలు) 15:56, 8 సెప్టెంబర్ 2007 (UTC)

విశ్వనాధ్ గారు గండపెండేరం తయారు చేసి నాకు తొడిగినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఈ మధ్య ఇంక్ స్పేస్ లొ బొమ్మలు గీసే ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. చాలా కృషి చేయవలసి ఉన్నది. మళ్ళి మళ్ళి ధన్యవాదాలు చెప్పకొంటూన్నాను--మాటలబాబు 16:01, 8 సెప్టెంబర్ 2007 (UTC)
ఆర్యా, మీరు నాకు తొడిగిన గండపెండేరానికి ధన్యవాదాలు. దానిపేరు ఇంగ్లీషులో గండపెడేరం అని ఉందేమిటి? ఇది ఉద్దేశ్య పూర్వకమా? అక్షర స్ఖాలిత్యమా? మీరు మంచి చిత్రకారులూ, శిల్పీ అయిఉండాలి. అల్లసాని పెద్దనకు కూడా ఇలాంటి గండపెండెరం దొరికిందో,లేదో. మరొక్కసారి ధన్యవాదాలు.----కంపశాస్త్రి 03:16, 14 సెప్టెంబర్ 2007 (UTC)
శాస్ర్తిగారూ క్షమించాలి. పని వత్తిడిలో కంగారు వలన ఆంగ్లములో తప్పు దొరలినది. అప్ లోడు జరిగిన తరువాత గాని తప్పు గమనించలేకపోయాను. మీరూహించినది నిజం నాకు చిత్రలేఖనంలో అతికొద్దిగా ప్రజ్ఞ కలదు దాని సహాయముతో ఇలాంటి చిన్నచిన్న గిమ్మిక్కులు చేస్తుంటా. మీకు అన్నిటా విజయాలే కలుగాలని కోరుకొనుచూ అందించుచున్న *** వినాయక చతుర్ధి శుభాకాంక్షలు ***. విశ్వనాధ్. 06:36, 15 సెప్టెంబర్ 2007 (UTC)


కృతజ్ఞతలు

విశ్వనాధ్! వికీ సినిమా మెడల్ బహూకరించినందుకు కృతజ్ఞతలు. మీ బ్లాగు ఇప్పుడే చూశాను. చిత్రాలంకరణలో మీ నైపుణ్యానికి అభినందనలు. నాకిప్పుడే తట్టిన ఆలోచన - ఒకో వికీ సభ్యుడూ తనకొచ్చిన పతకాలను ప్రింట్ చేసి, ఫ్రేము కట్టించి (ఇంట్లోవాళ్ళు వప్పుకుంటే) డ్రాయింగ్ రూములో పెట్టుకోవడానికి మంచి నేపధ్యపటం లాంటిది ఏదైనా చేయగలరా! అప్పుడు ఇంటికొచ్చినవారు "ఇదేవిటీ?" అని నొసలు చిట్లిస్తారు. మనం మన సుత్తిని బయటకు తీయవచ్చును! హి, హి, హి - --కాసుబాబు 06:20, 9 సెప్టెంబర్ 2007 (UTC)

మెచ్చుకున్నందుకు చాలా థాంక్సండి.దేవా 06:50, 25 అక్టోబర్ 2007 (UTC)

విశ్వనాధం గారికి, మీ సలహా నచ్చింది,మిగతా వన్నీ దఫ దఫాలుగా మాఊరికి కలుపుతూ పోతాను మీ సలహా కు నా కృతజ్ఞతలు.మీ బ్లాగ్ ను చూసాను. చాలా బాగుంది.--సభ్యుడు:geddambabu. 22.05, 27 october 2007.

చిన్న గమనిక

విశ్వనాధ్! మీరు వ్రాసేప్పుడు comma లేదా fullstop తరువాత space ఇవ్వడం మరచిపోతున్నారు. ఇందువలన వాక్యాలు విరిగినట్లు వచ్చే అవకాశం ఉంది. గమనించవలెను. వూళ్ళ గురించి మీరు వ్రాస్తున్న వ్యాసాలు నాకు చాలా సంతోషం కలుగ జేస్తున్నాయి. వీలయితే ఈ విషయమై కాస్త ప్రచారం కూడా చేయ గోరుతున్నాను. ఇందుకు ఉపయోగపడే ప్రచార వ్యాసం ఇక్కడ ఉన్నది. - --కాసుబాబు 06:59, 10 సెప్టెంబర్ 2007 (UTC)

ఊరి ఫొటో

ఆ వెబ్సైటుకు నేను నిర్వహకుడిని కాదు. ఆ ఫొటోలు కూడా నేను తీయలేదు. అయినా మానవప్రయత్నం చేయాలి కాబట్టి ఆ వెబ్సైటు నిర్వాహకునికి ఒక ఈమెయిలు రాస్తాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:16, 12 సెప్టెంబర్ 2007 (UTC)

వినాయక చవితి శుభాకాంక్షలు

విశ్వనాధ్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు--మాటలబాబు 11:47, 15 సెప్టెంబర్ 2007 (UTC)

సుదర్శన చక్రం పేజి కి మంచి బొమ్మలు అంటించారు, ధన్యవాదాలు--మాటలబాబు 14:18, 17 సెప్టెంబర్ 2007 (UTC)

ఫొటో ప్రస్థానం

విశ్వనాధ్ - పశ్చిమ గోదావరి జిల్లా వ్యాసానికి ఫొటోలు చాలా అందం తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా Land Scape format లో ఉన్న ఫొటోలు చాలా బాగున్నాయి. అభినందనలు. కొనసాగనీ ఈ ఛాయాచిత్ర ప్రస్థానం. నాదో చిన్న సూచన. నువ్వు అప్‌లోడ్ చేసిన బొమ్మలన్నింటికీ ఏదైనా మూస {{విశ్వనాధ్.బి.కె. బొమ్మలు}} వంటిది గానీ లేదా [[వర్గం:సభ్యుడు విశ్వనాధ్.బి.కె. బొమ్మలు]] అన్న వర్గం కానీ చేర్చు. తరువాత ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి పేజీలో ఈవారం ఫొటో కోసం బొమ్మలు వెతుక్కోవడం తేలిక అవుతుంది. - --కాసుబాబు 09:17, 19 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ వ్యాఖ్య కి వ్యక్తి గతంగా తీసుకొనవద్దని మనవి. కాసుబాబు గారు సూచించిన విషయం బాగుంది కాని {{విశ్వనాధ్.బి.కె. బొమ్మలు}} అని సూచించడం ఎంత వరకు ఉచితం. విశ్వనాధ్ గారు అంటించిన బొమ్మలు ఈ విధంగా వెతుకోవచ్చు కదా నా అభిప్రాయం చెప్పాను. విశ్వనాధ్ గారు తెలుగు వికీపీడియా లొ బొమ్మలకు ప్రాణం పోస్తున్నారు. వారు బొమ్మ అంటించినప్పుడు వ్యాసము చర్చా పేజిలో కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. కాని ఆలా వర్గం అని వ్రాయడం ఎంతవరకు ఉచితమో తెలియడం లేదు.--మాటలబాబు 09:23, 19 సెప్టెంబర్ 2007 (UTC)
'వ్యక్తిగతం' ఏ మాత్రం కాదు. మాటలబాబు అన్నట్లు ఈ పద్ధతి వ్యాసాలకైతే అసలు పొసగదు. మరి చిత్రాలకు? ఆలోచించాలి. ఆంగ్ల వికీలో బొమ్మలకు తరచు అలాంటి వర్గాలు, మూసలు చూశాను. చిత్రకారులు 'GFDL-Self' మూసను 'GFDL-by-somebody' అని రూపాంతరం చేసి పెట్టుకొంటున్నారు. ఆ మూసలోనే వర్గం పేరు కూడా నిక్షిప్తమవుతున్నది. కనుక పరవాలేదనుకొన్నాను. ఎందుకంటే ఆంగ్ల వికీలో చాలా ఫొటోలకు "నేను తీశాను" అన్న Tag తరచు ఉంటున్నది. ముఖ్యంగా Creative Commons లో తగిలించిన Attributes ని బట్టి చిత్రకారుడి పేరు ఒకోసారి అవుసరం అవుతుంది. --కాసుబాబు 09:37, 19 సెప్టెంబర్ 2007 (UTC)

మాటలబాబూ,కాసుబాబూ మీ ఇద్దరకూ దన్యవాదాలు. మీరిద్దరు చెప్పినదీ బాగున్నది. మొదటినుండీ నాకొన్ని చిత్రాలకు నాబ్లాగ్ పేరును చిన్నగా ఏదో మూల తగిలిస్తున్నాను {ఎందుకంటే తరువాత్తరువాత వీటిలో చాలా వరకు నాబ్లాగులో దర్శనమిచ్చే పొటోలే}. అందువలన ప్రస్తుతం ఇలా సరిపోతుందనుకొంటున్నాను.{మీ సలహాలను మాత్రం మరిచిపోకుండా ఇస్తుండండి } మరోసారి మీ ఇరువురికీ కృతజ్ఞతలు.విశ్వనాధ్. 11:33, 19 సెప్టెంబర్ 2007 (UTC)

నిర్వాహక హోదా

విశ్వనాధ్ గారు, నేను మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. ఇక్కడ అంగీకారము తెలుపగలరు --వైజాసత్య 20:35, 10 అక్టోబర్ 2007 (UTC)

విశ్వనాధ్ గారు, తెవికీలో నిర్వాహకులైన సందర్భంగా అభినందనలు --వైజాసత్య 21:17, 17 అక్టోబర్ 2007 (UTC)
విశ్వనాధ్ గారికి శుభాకాంక్షలు, ఇలాగే కొనసాగించంది మీ సహాయం తెలుగు వికీకి --బ్లాగేశ్వరుడు 23:45, 17 అక్టోబర్ 2007 (UTC)
విశ్వనాథ్ గారూ, అభినందనలు! వికీపీడియా:నిర్వహణ ప్రశ్నలు లింకు కెళ్తే నిర్వాహకత్వ విధి విధానాల గురించిన సమాచారమూ, కొన్ని లింకులూ చూడొచ్చు. అవి మనకు ఉపయోగపడతాయి. __చదువరి (చర్చరచనలు) 02:48, 18 అక్టోబర్ 2007 (UTC)
మద్దతిచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. విశ్వనాధ్. 04:50, 18 అక్టోబర్ 2007 (UTC)

పుస్తకాల బొమ్మలు

మీరు అప్లోడ్ చేసిన పుస్తకాల బొమ్మలకి మూలం కూడా తెలపండి. అప్పుడే అవి ఫెయిర్ యూజ్ క్రిందకి వస్తాయి. --వైజాసత్య 07:52, 17 అక్టోబర్ 2007 (UTC)

సత్యాగారూ- మూలం బొమ్మ పేజీలో ఎక్కడ తగిలించాలో చెప్తారా. నేనింతకు ముందు చేయలేదు. 'స్కాన్ చేయబడిన పేజీ' అని తగిలిస్తే సరిపోతుందిగా ?...కృతజ్ఞతలు..విశ్వనాధ్. 07:58, 17 అక్టోబర్ 2007 (UTC)
మామూలు పేజీని ఎడిట్ చేసినట్టే బొమ్మల పేజీ మార్చు నొక్కి దిద్దవచ్చు. అక్కడ ఎక్కడ వ్రాసినా ఫర్వాలేదు. మీరు స్కాన్ చేసినట్టైతే అదేమాట అక్కడ వ్రాయండి. బొమ్మలు బాగున్నాయి. అదే ఏంటబ్బా avkf.org లో ఇంతమంచి బొమ్మలు ఉండవే అనుకున్నాను --వైజాసత్య 08:02, 17 అక్టోబర్ 2007 (UTC)

సాధరణ తెలుగు పదాలు

దీనిలో మీరు సహాయం చేస్తున్నందుకు నా ధన్యవాదాలు. నేను వాటికి మరికొంత సమాచారం చేర్చి ఇంగ్లీషు వికీకి లింకులిచ్చాను. అందులో మంచి సమాచారం ఉంది. వీలుంటే మరికొన్ని ముఖ్యమైన విషయాలు చేర్చండి.Rajasekhar1961 08:46, 29 అక్టోబర్ 2007 (UTC)

విషేషాలు కాదు విశేషాలు, మీసాల బ్రాకెట్టు కాదు మాములు అర్ధచంద్రాకార బ్రాకెట్లు. దయచేసి గమనించండి.

1.jpg

బొమ్మ:1.jpg బదులుగా "Desktop Computer.jpg" అనే పేరు పెట్టుంటే బాగుండేది. అప్పుడు పేరును చూసిన వెంటనే బొమ్మ ఎంటో చూడకుండానే తెలుసుకోవచ్చు. ఈ బొమ్మను ఎక్కడి నుండి సంపాదించారో కూడా తెలుపండి. ఉదా: "ఇది నా సొంత కంప్యూటరు. నేనే పోటో తీసాను." __మాకినేని ప్రదీపు (+/-మా) 13:59, 6 నవంబర్ 2007 (UTC)

ప్రదీప్ మీరు చెప్పిన విధంగా మళ్ళీ లోడ్ చేసా. అది నా సొంత కంప్యూటరే..నేనే పొటో తీసాను..కృతజ్ఞతలు...విశ్వనాధ్. 03:54, 7 నవంబర్ 2007 (UTC)

బొమ్మలు

విశ్వనాథ్ గారు మీరు గీసిన బొమ్మలు చాసాను. చాలా అందంగా ఉన్నాయి. నాదొక రిక్వెస్ట్, దశావతారాల బొమ్మలు సరళంగా గీయగలరా? నేను ఆ బొమ్మలను దశావతారములు కొరకు అడుగుతున్నాను. ఆ మూస చర్చా పేజీలో కూడా రిక్వెస్ట్ చేసాను. బొమ్మలు గీయడం వీలవుతుందేమో చూడండి. దేవాచర్చ 13:33, 8 నవంబర్ 2007 (UTC)

సమయం దొరికితే తప్పక ప్రయత్నిస్తాను.కృతజ్ఞతలు..విశ్వనాధ్. 13:39, 8 నవంబర్ 2007 (UTC)

ప్రకటనలు

మీరు బొమ్మలు తయారుచేసి ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. దేవా/DeVచర్చ 09:23, 22 నవంబర్ 2007 (UTC)

విశ్వ గారు మీరు అప్లోడ్ చేసిన బొమ్మ చూసాను. కొద్దిసేపట్లో హిందూమతం ప్రాజెక్టు ప్రకటన తయారుచేస్తాను. దేవా/DeVచర్చ 11:14, 22 నవంబర్ 2007 (UTC)
విశ్వ గారు హిందూమతం ప్రకటన చూసారా? మీరు అలానే చేద్దామనుకున్నారా? దేవా/DeVచర్చ 05:54, 24 నవంబర్ 2007 (UTC)

భయంకరాచారి వ్యాసం

పొద్దులో వచ్చిన ఈ వ్యాసం లోని కొంత భాగం, ప్రతివాది భయంకర వెంకటాచారి‎ వ్యాసానికి పనికి రావచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 13:18, 10 నవంబర్ 2007 (UTC)

అతడు, ఆమె

తెలుగు ప్రొనౌన్స్ పట్టిక తయారుచేయమని అభ్యర్ధన.Rajasekhar1961 10:52, 12 డిసెంబర్ 2007 (UTC)

బొమ్మలు

విశ్వనాధ్! నీ అభినందనలకు కృతజ్ఞతలు. నేను తీసిన ఫొటోలలో గద్దేవారి గూడెం పాఠశాల బొమ్మా, మర్రి చెట్టు ఎదుగుదల బొమ్మా నాకు చాలా ఇష్టమైనవి. గ్రామం వ్యాసాన్ని ప్రస్తుతానికి ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదిస్తున్నాను. దానిని తెలుగు వికీకి అనుగుణంగా మలచాలి. బొమ్మలు కూడా భారత దేశానికి సంబంధించినవి చేర్చాలి. నీకు వీలయినంత సహాయం చేయగలవు. --కాసుబాబు 06:44, 14 డిసెంబర్ 2007 (UTC)

విశ్వనాధ్! బొమ్మ:Vis-1.jpg అద్భుతం. గీతలు కొంచెం మందంగా ఉంటే కంప్యూటరులో చూడడానికి బెటరనుకొంటాను. బొమ్మ పేరు మాత్రం "Indian_Saree_sketch" వంటి అర్ధవంతమైన పేరు ఉండడం మంచిది. రోడ్డుమీద ఏదైనా అడ్వర్టైజింగ్ హోర్డింగ్ బొమ్మ కూడా తీసి ఈ వ్యాసానికి జత చేయగలవా! --కాసుబాబు 11:33, 16 డిసెంబర్ 2007 (UTC)
కృతజ్ఞతలు. అవి పెన్సిల్ ఉపయోగించి గీసినవి స్కాన్ చేసిన తరువాత అంతకంటే బాగా రావడం లేదు. హోర్డింగ్ పొటో కోసం తప్పక ప్రయత్నిస్తాను.విశ్వనాధ్. 04:35, 17 డిసెంబర్ 2007 (UTC)

విశ్వనాథ్ గారు మీ గిసిన బొమ్మలు చాలా అద్భుతముగా ఉన్నవి. దేవుడు మీకు ప్రసాదించిన వరము కదా ఇది--బ్లాగేశ్వరుడు 16:06, 16 డిసెంబర్ 2007 (UTC)

బొమ్మ చాలా బాగుంది. కళాకారులని నిరూపించుకున్నారు. --వైజాసత్య 18:50, 16 డిసెంబర్ 2007 (UTC)
కృతజ్ఞతలు.సరదాగా గీసిన బొమ్మలు. పేపర్లు ఎలాగూ పాడయిపోతాయి అని స్కాన్ చేసి ఇందులో ఉంచాను.విశ్వనాధ్. 04:35, 17 డిసెంబర్ 2007 (UTC)

ఒక మాట

విశ్వనాధ్.బి.కె గారూ ఒకమాటలో మీరు వ్రాసిన మాటలు ఎంతో బాగున్నాయి.ఎంతో ఆదర్శనీయమైన పలుకులు ఇవి. --t.sujatha 17:02, 23 డిసెంబర్ 2007 (UTC)

ధన్యవాదాలు

మీరు నా స్వీయప్రతిపాదనకిచ్చిన మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. δευ దేవా 06:55, 21 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

విశ్వనాథ్ గారూ నమస్తే, తెలుగు వికిపీడియా చాలా బాగుంది. నేను మావూరి గురించిన సమాచారం ఎక్కడ పెట్తాలి అని ఆలోచిస్తున్న సమయం లో తె.వికి గురించి ఈనాడు లో చూడడం జరిగింది. సభ్యుల సహకారం తో నెల్లూరు జిల్లాలోని యల్లాయపాళెం గురించి పరిచయం చేయగలిగాను. దీనికి చాలా సంతోషంగా ఉంది. మీ సలహా ప్రకారం ఫోటో లకు సారాంశం కూడా రాశాను.

వెబ్ లో తెలుగు ప్రభ పెంచడానికి నా వంతు సహకారం అందించగలను.

జితేష్..

బొమ్మల కాపీహక్కులకు ఒక బాటు

నేను నిర్వహిస్తున్న బాటుద్వారా కాపీహక్కులు లేని బొమ్మలను కనుక్కుని వాటిని అప్లోడుచేసిన సభ్యులను హెచ్చరించటానికి మరియూ ఆ కాపీ హక్కులను ఎట్లా చేర్చాలో సలహాలు ఇవ్వటానికి ఒక బాటును తయారు చేసాను. ఆ బాటును నడపటానికి ఆమోదం కోసం ఇక్కడ చేర్చాను. అక్కడ మీ అభిప్రాయం తెలుపగలరు __మాకినేని ప్రదీపు (+/-మా) 09:01, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ

పనులతో వ్యగ్రముగా ఉండి తరువాత అంతర్జాల సౌకర్యము సరిహగాలేనందున వికీ వైపు రాలేకపోయాను. --బ్లాగేశ్వరుడు 15:25, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కలిసి పూర్తి చేద్దాం

కుక్క వ్యాసం పెద్దది చేయడంలో సహాయ పడుతున్నందుకు థాంక్స్. physical characteristics కి సరి అయిన తెలుగు పదం ఏంటొ మీకు తెలుసా? అది మీరు చెప్తే నేను ఆ అంశాన్ని వ్యాసంలో జోడిస్తాను. --Uday kanth 20:16, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ్ గారు, ముక్తేశ్వరం అయినవిల్లి మండలం లోకి వొస్తుందని జ్ఞాపకం.బాలబ్లాగరి 10:32, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త మూస

{{అగంతకుడు}} అనే మూస తయారు చేశాను. ఎవరైనా ఐపి అడ్రసు నుంచి మార్పులు చేస్తుంటే మనం దాన్ని వాడుకోవచ్చు. --రవిచంద్ర 13:27, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ

మొదటి పేజీలో రచ్చబండ కనిపించడం లేదండీ--రవిచంద్ర 04:10, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

నా స్వీయ నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 12:34, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొడవగంటి కుటుంబరావు

కొడవగంటి కుటుంబరావు గారి వ్యాసం ఇక్కడుంది. చిన్న వ్యాసంలోని సమాచారం ఇక్కడ] కల ఈ వ్యాసంలో చేర్చాలేమో చూసి, తరువాత మీ వ్యాసం తుడిచివేయాలేమో చెప్పండి.--విశ్వనాధ్. 12:19, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు మార్చాలి . ఆయన పేరు కొడవగంటి కుటుంబరావు. నా వ్యాసాన్ని తుడిచి వేయండి. రవిచంద్ర 12:25, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
పేరు కూడా మార్చనక్కరలేదు నేనే పొరపాటు పడ్డాను. రవిచంద్ర 12:27, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Nisar

ఆ వ్యాసం నిజంగా వేరే వాళ్ళు మెదలుపెట్టుంటే, నేను ఏమి మాట్లాడేవాణ్ణి కాదు. కాని అది మొదలుపెట్టిన IP మార్పులు చేర్పులు ఒక సారి చూడండి. ఇంకోకటి ఆ IP ఎక్కడిదో కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాను. తెలుసుకున్న తరువాత చెప్తాను. సాయీ(చర్చ) 13:04, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సైట్ ప్రకారం వ్యాసం మెదలుపెట్టిన 221.134.250.177 పూనేలో ఉంది. నిసార్ గారు తాను ప్రస్తుతం ఉంటున్నది పూనే అని చెప్పారు... సాయీ(చర్చ) 13:18, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక్క పూనే అని మాత్రమే తెలుసు కాని అది ఆయన సిస్టం నుండి రాయబడినది అని తెలియ లేదుగా! ఒక వేళ ఆయన అభిమానులెవరయినా 'మీరు కూడా ప్రముఖులేగా మీ వ్యాసం కూడా ఉంటే బావుంటుంది'అని అక్కడి నుండి మొదలు పెట్టి ఉండవచ్చుగా. --విశ్వనాధ్. 13:27, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే అనుకుందాం. మీరు ఆ పేజి చరితం చూస్తే, నిసార్ గారు ఆ పేజికి వెయ్యి బైట్లకు పైగా material add చేసారు. అది చిన్న మార్పు కింద వస్తుందా మీరే చెప్పండి. సాయీ(చర్చ) 13:42, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొకటి విశ్వనాథ్ గారు. ఇండోనీషా పేజికి vandalism జరిగింది. Warning Templates ఎక్కడ ఉన్నాయి? సాయీ(చర్చ) 14:00, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రాకెట్ల ముందు ఖాళీ

విశ్వనాధ్!

అర్జున్(2004 సినిమా), అర్జున్(నటుడు), అర్జున్(అయోమయనివృత్తి) - వంటి వ్యాసాల పేర్లలో మీరు గమనించ వలసిన విషయం - బ్రాకెట్టుకు ముందు ఖాళీ (Space) ఉంచాలి. వ్యాకరణ పరంగా ఇది సరైన విధానం. అంతే గాక "అయోమయనివృత్తి"ని కూడా సాధారణంగా "అయోమయ నివృత్తి" అని వ్రాస్తున్నాం. (ఈ పొరపాటు ఇందతకు ముందు నేను వందలాది పేజీలలో చేశాను! వీవెన్ సరి చేయక ముందు) --కాసుబాబు 13:35, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు

విశ్వనాథ్ గారు, మీరు మొదలుబెట్టిన వ్యాసానికి మార్పులు చేర్పులు చేశాను. దయ చేసి చూడండి. Kumarrao 16:49, 14 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ కావాలి

విశ్వనాధ్! విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాసంలో ఉన్న బొమ్మ GFDL or Free image కాదు. ఈ వ్యాసానికి సరిపోయే ఏదైనా బొమ్మను సంపాదించ గలవా? (ఉదాహరణ: స్తోత్ర పారాయణం చేసే భక్తులు). లేక గీయ గలవా? నీవు బిజీగా ఉన్నట్లున్నావు. సమయం దొరికితేనే! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:03, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:25, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

నా స్వీయ నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యుడను రవిచంద్ర(చర్చ) 04:55, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకాదశపితరులు

విశ్వనాథ్ గారు నమస్తే. మీరు ఒక చక్కటి వ్యాసమును మొదలు పెట్టినారు.ఈ విషయమునందు, ఈ కింది విషయములను గమనించగలరు: ఈ వ్యాసము ప్రత్యేకముగా ఉండవలసిన అవసరము ఉన్నదా, లేదా వేరొక వ్యాసములో అంతర్భాగమా?

వ్యాసమును విస్తరించవలసిన అవసరము కనపడుతున్నది:

  1. ఏకాదశపితరులు ఏ సందర్భంగా తలచుకుంటారు
  2. వారి జాబితాలో ఎవరి తరువాత ఎవరిని వ్రాయాలి, లేదా ఏ వరుసలోనయినా వ్రాయవచ్చా,
  3. ఈ జాబితాను ఎవరు నిర్ణయించారు
  4. జాబితాలో "బంధువు" అని ఉన్నది. అంటే ఏ బంధువు దయచేసి వ్యాసమునందు తెలుప గలరు.

ఈ విషయాలమీద పూర్తి చెస్తే, వ్యాసం సంపూర్తి అవుతుందని నా అభిప్రాయం.--SIVA 00:32, 21 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:41, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ లైసెన్సు గురించి

విశ్వనాధ్! నాకు బొమ్మ:Poorna kumbbam.png గురించి ఇలా మెసేజి వచ్చింది.

Wrong license - బొమ్మ:Poorna kumbbam.png is most likely to be made by the Government of Andhra Pradesh and hence is copyrighted. The license is wrong and the image must not be displayed on the main page. 117.193.33.154 11:44, 7 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాఖ్య సరైనదనే అనుకొంటున్నాను. బొమ్మ:Poorna kumbbam.png మీరే స్వయంగా తయారు చేశారనుకొంటున్నాను. అయినా దీని కాపీ హక్కు గురించి సందేహం ఉంది. ఇది ప్రభుత్వం అధికారిక చిహ్నం అయితే దాన్ని GFDL, CC వంటి ఉచిత లైసెన్సులతో వాడకూడకూడదు. (మీరు స్వయంగా వేసినదైనా గాని) Fair USe క్రింద కొన్ని చోట్ల మాత్రం వాడవచ్చును. ఈ విషయమై నేను పరిశీలిస్తాను. ప్రస్తుతానికి మీరు బొమ్మ లైసెన్సుకు అనుబంధ వివరణ జత చేస్తే మంచిది (ఉదా: " నేను స్వయంగా వేసిన చిత్రం. లైసెన్సు గురించి పరిశీలన జరుగుతున్నది" వంటిది.) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:25, 7 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అది ఎక్కడి నుమ్డి తీసుకొన్నానో సరిగా గుర్తులేదు. అలాంటి సంధిగ్ధత ఉంటే మరొక బొమ్మ స్వయంగా చేసి పెడతాను. ప్రస్తుత బొమ్మ తొలగించి వేయండి. కాకుంటే రెండు రోజులలో ఇవ్వగలను.--విశ్వనాధ్. 13:30, 7 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సరే. మీకు బాగా గుర్తు లేదు కనుక తొలగించడమే మంచిది. కాకపోతే ఇప్పుడు అది మొదటి పేజీలో ఉంది గనుక దానికి వేరే బొమ్మ ఏర్పాటు చేశినాక తొలగిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:38, 7 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడు అప్‌లోడ్ చేసిన బొమ్మ బాఘుంది. కాపీ హక్కుల సమస్య లేదు. అయితే కుంభం ఉపరితలంపై ఇంకొంచెం డిజైన్ ఉంటే ఇంకా బాగుంటుంది. గోడ అంచుల మీద వేసే ముగ్గులలాంటివి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:16, 8 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


విశ్వనాధ్! బొమ్మ:Budda-1.jpg - మీరు స్వయంగా గీసిందా? లేక ఏదైనా బొమ్మనుండి తీసిన ఫొటోనా? ఇది ఈ వారం బొమ్మ పరిగణనలో ఉంది గనుక స్పష్టమైన సమాచారం ఆ బొమ్మ సారాంశంలో వ్రాయ గలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:29, 6 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సుదాకర్ గారూ ఈ మెసేజ్ నేను గమనించలేదు. ఇప్పుడే చూసా. ఇది నేను తీసిన పొటోనే. ఇలాంటి చిత్రాలు అమ్మకమునకు పెట్టిన స్టాల్ నుండి తీసుకొనబడినది. వేరొకటి ఉన్నది. వాటి ప్రక్కన నేను నిల్చుని ఉన్నది. అది కూడా అప్ లోడ్ చేయమంతే చేస్తాను. కాకుంటే అందులో నేనే ఎక్కువ స్థలం ఆక్రమించి ఉన్నాను. ఆచిత్రానికి తగిన వివరణ సారాంశములో వ్రాస్తాను. శెలవు.--విశ్వనాధ్. 07:30, 7 అక్టోబర్ 2008 (UTC)
అర్ధమయింది. బుద్ధుని బొమ్మలు ఆంగ్ల వికీ వ్యాసాలలో చాలానే దొరుకుతాయి గనుక మరొక మార్కెట్ వస్తువు బొమ్మ అవుసరం లేదనుకొంటాను. ఏవయినా విశిష్ష్టమైన విలువ గలవి (చారిత్రికంగా కాని లేదా కళాత్మకంగా గాని) దొరికితే అప్‌లోడ్ చేయవచ్చును. మీరు కొంత కాలంగా కానరావడంలేదు - కుశలమా! మీ చర్చా పేజీ కాస్త పొడవయ్యింది. పాత చర్చలు నిక్షిప్తం చేయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:02, 7 అక్టోబర్ 2008 (UTC)

స్వంత కృతైతే Godaavari.blogspot.com అని ఎందుకుంది? 117.193.34.224 05:29, 9 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

స్వంత కృతి కనుక --విశ్వనాధ్. 08:45, 9 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాథ్ గారూ, నమస్తే, పూర్ణకుంభం బొమ్మ, సాంప్రదాయబద్ధంగా చక్కగా వున్నది. రూపొందించినందుకు అభినందనలు. మిత్రుడు నిసార్ అహ్మద్ 11:55, 9 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
Wikipedia is not the place to advertise your blog. It's better if you remove it. 117.193.33.109 05:56, 22 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తెలియచేసినందుకు కృతజ్ఞతలు. నా సభ్య పేజీలో నాకిష్టమైనది రాసుకొనే హక్కు నాకు ఉన్నదని నా అభిప్రాయము. వ్యాసాలకు సంభందించి స్వవిషయాలు రాస్తే మీ అభిప్రాయములు తెలియ చేయండి. దయచేసి మీ పేరుతో రాస్తే మిమ్ములను సంభోదిస్తూ రాయగల అవకాశము కలిగిఉంటాను.--విశ్వనాధ్. 09:02, 22 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సభ్యుని పేజీలో మీకిష్టమొచ్చినది వ్రాసుకోండి. వికీలో వాడే బొమ్మల మీద కాదు. మీరు తీయక పోతే నేను తీస్తాను. చర్చసాయీరచనలు 11:29, 6 ఆగష్టు 2008 (UTC)
మీరు చేసినది WP Image Use Policy కి వ్యతిరేకం. "Also, user-created images should not be watermarked, distorted, have any credits in the image itself or anything else that would hamper their free use, unless, of course, the image is intended to demonstrate watermarking, distortion etc. and is used in the related article. All photo credit should be in a summary on the image description page." చర్చసాయీరచనలు 13:49, 6 ఆగష్టు 2008 (UTC)

ఉన్నవ వ్యాసం ఉన్నది

ఉన్నవ లక్ష్మీనారాయణ :-) --వైజాసత్య 07:20, 30 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]