Jump to content

వాడుకరి చర్చ:రవిచంద్ర/పాత చర్చ 2

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రవిచంద్ర/పాత చర్చ 2 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మాటలబాబు 10:10, 22 సెప్టెంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాగతం మూస

[మార్చు]

రవిచంద్ర గారు! మీరు కొత్త సభ్యులను ఆహ్వానించడానికి {{subst:స్వాగతం|సభ్యుడు=రవిచంద్ర|చిన్నది=అవును}} వాడవచ్చు. మరిన్ని వివరాలకు స్వాగతం పేజీని దర్శించండి.--దేవా/DeVచర్చ 14:08, 1 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పథకం

[మార్చు]
తెలుగు మెడల్
రవిచంద్ర గారి కృషికి దేవా ఇస్తున్న చిన్న బహుమానం. కొత్త సభ్యులను ఆహ్వానించడంలోనూ, సలహాలివ్వడంలోనూ, సహాయం చెయ్యంలోనూ, చిట్కాలు వ్రాయడంలోనూ, అన్నింటికీ మించి వ్యాసాలను అభివృద్ది పరచడంలోనూ ఇలా ఎన్నెన్నోఅంశాలలో ఈయన చేస్తున్న కృషి శ్లాఘనీయం. δευ దేవా 08:09, 7 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


పూర్ణ సంఖ్య

[మార్చు]

పూర్ణ సంఖ్య అంటే integers కదా? integersని Zతో సూచిస్తారు. Wతో కాదు. సాయీ(చర్చ) 05:37, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Whole Numbers అన్న పదానికి వేర్వేరు అర్థాలున్నాయి. ఇక్కడ చూడంది en:Whole number. సాయీ(చర్చ) 05:47, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మరి సహజ సంఖ్యలకి సంపూర్ణ లేదా పూర్ణ సంఖ్యలకి ఏంటి తేడా? సాయీ(చర్చ) 05:55, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే. నేను తెలుగులో గణితం చదవలేదు :) సాయీ(చర్చ) 06:01, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మెదటి పేజి

[మార్చు]

ఇంకొకటి. ఈ పేజి చూసి, మీ అభిప్రాయం తెలుపగలరు. సాయీ(చర్చ) 06:04, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు admin కదా. మీరు మెదటి పేజి మార్చవచ్చు కూడాను. ఇతర పేజిల వలే "మార్చు" ట్యాబ్ నొక్కండి. సాయీ(చర్చ) 06:41, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Fourier Series

[మార్చు]

Fourier Series ని తెలుగులో ఏమంటారో తెలుపగలరు. సాయీ(చర్చ) 06:38, 4 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ల గురించి

[మార్చు]

నేను విక్షనరీలోని పదాలను వర్గీకరించడానికి ప్రదీపు గారు మొదట్లో రాసిన బోటును వాడవచ్చా? రవిచంద్ర(చర్చ) 12:32, 1 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రవీ! బాట్ల గురించి నాకు ఏమీ తెలియదు. ప్రదీప్‌ను అడిగి చూడు (కాని అతను బిజీగా ఉన్నట్లున్నాడు) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:30, 4 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
User:Mpradeepbot పేజీలోకి వెళ్తే నేను ఇప్పటి వరకూ తయారు చేసిన ప్రోగ్రాముల వివరాలు ఉంటాయి అవి మీకు పనికి వస్తాయేమో పరిశీలించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:03, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం

[మార్చు]

రవిచంద్ర గారూ! మీరు వ్రాస్తున్న రామప్ప దేవాలయం మరియు రామప్ప దేవాలయములలో ఏదో ఒక వ్యాసాన్ని ఇంకో వ్యాసంలో విలీనం చేయండి. తరవాత దారి మార్పు పేజీ సృష్టించండి. δευ దేవా 10:18, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Boterror.JPG కి మీరు PD ట్యాగు తగిలించారు. కాని ఆ బొమ్మ కాపిహక్కులు మైక్రోసాఫ్ట్ కి చెందుతాయి. అటువంతి బొమ్మలను flickr వంటి వెబ్సైట్లలో అప్లోడ్ చేసి లింకు పెట్టడం మంచిది. ఆ పని చేసి తెవికీ నుండి తొలగించండి. సాయీ(చర్చ) 14:28, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాళహస్తి బొమ్మలు

[మార్చు]

రవీ! ఇంతకు ముందు శ్రీకాళహస్తి వ్యాసంలో నేను బొమ్మ:APtown Kalahasti 3.JPG బొమ్మను పెట్టినట్లు గుర్తు. దాన్ని నువ్వు వ్యాసంలోంచి తీసేశావు అనుకున్నాను (నేను పొరపడుతుండవచ్చు.) కారణం ఏమి కావచ్చు?. బొమ్మ:APtown Kalahasti 1.JPG కూడా నేనే అప్‌లోడ్ చేశాను కాని అది బాగుండలేదు (కారు అద్దాలలో జెండాల ప్రతిబింబం వచ్చింది.) నీవు కాస్త మంచి బొమ్మ తేగలిగితే ఈ బొమ్మను replace చెయ్యి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:05, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రామప్ప బొమ్మలు

[మార్చు]

రవిచంద్ర గారూ మీరు తీసిన రామప్ప బొమ్మలు కామన్స్‌లో ఎక్కించగలరా? ఆంగ్ల వికీలో కూడా సరైన బొమ్మలు లేవు. δευ దేవా 15:57, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే, మీ వద్ద వేయి స్తంభాల గుడి బొమ్మలు, భద్రకాళీ గుడి, ఖిలా వరంగల్ బొమ్మలు ఇతరాలుంటే కూడా సమకూర్చండి. δευ దేవా 16:02, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు సమస్య

[మార్చు]

మీరు మీ ప్రోగ్రామును నడిపే ముందుగా login.py అనే ప్రోగ్రామును నడపండి. ఆ తరువాత మీ ప్రోగ్రామును నడపండి. login.py ప్రోగ్రామును నడిపినప్పుడు ఏవయినా సమస్యలు తలెత్తితే IEని (not firefox) తెరచి, అక్కడ ఒక సారి మీ బాటుకోసం సృష్టించిన సభ్యనామంతో login అవ్వండి. అప్పుడు కూడా సమస్యలు తలెత్తితే మీ pywikipedia bot frameworkని ఇంకొక సారి దిగుమతి చేసుకుని ఆ కొత్త దానితో మళ్లీ ప్రయత్నించండి. అప్పటికి కూడా login.py ప్రోగ్రాము నడవక పోతే నేనేమీ చేయలేను...

ఇంకో విషయం, మీరు మీ బాటు ఖాతాకు, వీక్షనరీలో ఇంకా బాటు హోదా సంపాదించలేదు కాబట్టి నిమిషానికి 1 లేదా 2 మార్పులు కంటే ఎక్కువ మార్పులు చేయనివ్వకుండా మీ బాటును నడపండి. (పేజీని మార్చిన ప్రతీసారీ sleep() ఉపయోగించి మీ బాటును కొంత సేపు పొడుకోబెటవచ్చు.) తరువాత మీకు బాటు బాగా నడుస్తుందని నమ్మకలిగినప్పుడు బాటుహోదా కల్పించటానికై ఒక విన్నపాన్ని చేయవచ్చు. ___మాకినేని ప్రదీపు (+/-మా) 17:40, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

page receiving vandalism. protect it temporarily. సాయీ(చర్చ) 09:00, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మూస కాదండి. అది admins మాత్రమే చేయగలరు. ఏలా చేయాలో నాకు తేలీదు. సాయీ(చర్చ) 09:14, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
లేదా వదిలేయండి. వేరెవరైనా చేస్తారు. సాయీ(చర్చ) 09:17, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దాని వల్ల ఏమీ అవ్వలేదు. నేను ఆ పేజీ ని మార్చగలుగుతున్నాను. ఒక నిమిషం ఆగండి. ఐపి మార్చగలుతుందో లేదో చూస్తాను. సాయీ(చర్చ) 09:19, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఐపీ గా కూడా మార్చగలుగుతున్నాను. సాయీ(చర్చ) 09:20, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వ్రాసిన Please protect this page తీసేయలేదే సాయీ(చర్చ) 13:20, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం సమైక్య కృషి

[మార్చు]

రవిచంద్రగారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రవీ! నెల్సన్ మండేలా మిగిలిన భాగం అనువాదం బాగా కుదించడం మంచిది. మొత్తం అనువదించవద్దు. ఉదాహరణకు మూడు వివాహాలూ మూడు వాక్యాలు చాలు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:07, 26 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీకీ బొమ్మ కనబడుతున్నదా? సాయీ(చర్చ) 03:01, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Meta CheckUser

[మార్చు]

నాకు Gopikrishna123 (చర్చదిద్దుబాట్లు) మరియు మౌర్యుడు (చర్చదిద్దుబాట్లు) sockpuppets అని అనుమానం వచ్చి, మెటాలో CheckUser విజ్ఞప్తి చేసాను. ఒక సారి చూడండి. చర్చసాయీరచనలు 12:01, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు క్షమాపన అడుగుతూనే, నేను చేసింది తప్పయితే అని అంటున్నారు. మీరు చేసింది తప్పే. మీరు క్షమాపన అడిగారు. అందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. మిగతా ఇద్దరు sockpuppets ఎవరో గానీ ఆ మాత్రం కూడా చేయలేదు. వారు కూడా క్షమాపనలు అడిగి ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుంది. మీరు మిగతా ఇద్దరు ఎవరో గుర్తించడంలో సహకరించగలరా? ఇలాంటి విషయాలను మర్చిపోయి కలసికట్టుగా తెవికీని అభివృద్ది చేద్దాము. ఇంకో విషయం ఎవరైనా నిర్వాహకులు అయితే వారి మీద పనిభారం పెరుగుతుందే తప్ప వారికి ఎలాంటి అధికారాలు ఉండవని నా ఉద్దేశ్యం. δευ దేవా 15:39, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు మీ మీద ఏలాంటి కోపము లేదు. నాకు ఎవరైనా చేసింది తప్పనిపిస్తే డైరెక్టుగా చెప్పేస్తాను. మీరు అలానే చేయాల్సింది. వికీ నియమాలు ప్రకారం ఒక account ఉండి, ఇంకో account తో వోటు వేయడం చాలా పెద్ద తప్పు. నా CheckUser విజ్ఞప్తి చూసిన steward, desyospping procedure మొదలుపెట్టమన్నారు. You will the first person to be desysopped. చర్చసాయీరచనలు 02:24, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు తప్పుకు క్షమాపన అడిగినందువళ్ల ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. --వైజాసత్య 05:02, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇది అంత సీరియస్ విషయంగా చూడడంలేదు (కారణాలు తరువాత వివరిస్తాను). కాని భవిష్యత్తులో కొన్ని సమస్యలు రాకుండా ఉండడం కోసం - రవీ! నీకు సమ్మతమైతేనే, నీ నిర్వాహక హోదాను ఉపసంహరించమని వైజాసత్యకు వ్రాయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:22, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:31, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నన్ను బాధపెట్టింది మీరు కాదు

[మార్చు]

రవిచంద్ర గారూ! మీరు కాదు నన్ను బాధ పెట్టింది. నేను మీరు సాయి పేజీలో చేసిన వ్యాఖ్య చూసాను. నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి. మీరు చెప్పి ఉండకపోతే ఆ సభ్యత్వం మీదేనని తెలిసేది కాదేమో. మీకు నా అభినందనలు. δευ దేవా 09:22, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేనయితే మీరు నిర్వాహకుడిగా కొనసాగాలనే కోరుకుంటాను. మీరు తెవికీకి చాలా అవసరం. δευ దేవా 11:42, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పాలసీలు

[మార్చు]

ఆంగ్ల వికీపీడియాలో అప్పటివరకూ జరిగిన ఎన్నో చర్చల (కొట్లాటలు?) కారణంగా అక్కడి నియమాలు తయారయ్యాయి. అక్కడి నియమాలు ఎన్నో మార్పులు-చేర్పులు తరువాత చాలామంది సభ్యుల ఆమోదం పొందాయి. కాబట్టి ఆ నియమాలన్నిటినీ ప్రామాణికమైన నియమాలుగా భావించవచ్చు. కానీ తెలుగు వికీపీడియాకి కూడా యధాతదంగా ఉపయోగించేసుకోవచ్చు. కానీ వాటన్నిటినీ ఉన్నదున్నట్లుగా తెలుగు వికీపీడియాకు కూడా అన్వయిస్తేనే సమస్యంతా... అందులో మొదటిది అసలే సమాచార లోపంతో ఉన్న తెలుగు వికీపీడియాలో, సభ్యులను ఎక్కడినించో తెచ్చిన నియమాలతో బయపెడితే సభ్యులెవరూ రచనలు చేయకుండా తెవికీ నుండి నిశ్క్రమించే అవకాశం ఉంది. అంటే నియమాలను పాటించటంవలన తెలుగు వికీపీడియా సమగ్రత బాగానే ఉంటుందేమో, కానీ విజ్ఞానాన్ని పోగుచేయడం అనే మౌలిక ప్రక్రియ దెబ్బతినేస్తుంది అని అనుకుంటున్నాను. (అందుకనే తెలుగు వికీపీడియాకు మనమే ప్రత్యేకంగా నియమాలను సృష్టించుకోవాలని ప్రతిపాదన చేసాను). ప్రస్తుతానికి వోటింగులో అనామక సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చనే అనుకుంటున్నాను, కానీ ఈ విషయమై నేను ఇతర సభ్యుల అభిప్రాయాల కోసం కూడా వేచి చూస్తాను. అలాగే ఒక సభ్యుడి ఖాతా sockpuppet అనే అనుమానం వచ్చిన తరువాత, ఆ sockpuppet ఎవరిదో కనుక్కోవడాన్ని కూడా ప్రస్తుతానికి నేను వ్యతిరేకిస్తున్నాను. అలా కనుక్కోవడం వలన వికీసమాజానికి జరిగే మేలుకంటే కీడే ఎక్కువని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:47, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ముసుగుబొమ్మతో (సాక్ పప్పెట్) తెలియజేసినా, మామూలు ఖాతాతో తెలియజేసిన కొందరి సభ్యులకు అలాంటి అభిప్రాయముంది అన్న విషయాన్ని పరిగణించాలి. అనామక సభ్యుల వోట్లను పరిగణనలోకి తీసుకోకపోయినా, వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలను మాత్రం ఎమాత్రం తోసిపుచ్చరు. వికీలో అప్పుడప్పుడు ఏకాభిప్రాయసాధనలో భాగంగా ఓటింగు జరిపినా వికీ ప్రజాస్వామ్య ప్రయోగము కాదు (en:WP:NOT) అన్న విషయం మరచిపోకూడదు. సాయీ నిర్వాహక హోదా అభ్యర్ధనలో అనామకంగా అదే వ్యాఖ్యాలు చేసినా పనిజరిగి ఉండేది. ప్రదీపన్నట్టు ఆంగ్ల వికీని మార్గదర్శకంగా తీసుకున్నా గుడ్డిగా అక్కడి విధానాలు ఇక్కడ అవలంబించడం తగదు. తెవికీ పెరుగుతున్న కొద్ది దాని పరిపక్వతకు అనుగుణంగా దాని స్థాయిలో నియమాలు పుడతాయి. ఆంగ్ల వికీ నియమాలు ఇక్కడ రుద్దటం కురువృద్ధుని వ్యవహారశైలిని కుర్రవాన్ని అవలంబించమనటమే --వైజాసత్య 03:40, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొనసాగండి

[మార్చు]

మన్నించలేని తప్పు మీరు చేయలేదు రవిచంద్రగారు.నలుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో కూడా అభిప్రాయభేదాలు సహజం 5 వేల పైగా సభ్యులున్న తేవీకీ కుటుంబం మనది ఇలా జరగటం సహజం.ఇది కేవలం అభిప్రాయభేదం మాత్రమే ఈ అభిప్రాయభేదాలు చర్చలు సభ్యులను మరింత సన్నిహితంచేయాలని కోరుకుంటున్నాను.ఇతర సభ్యులపట్ల ఇంత వరకూ మీరు సంయమనంగానూ గౌరవ మర్యాదలను చూపుతూ ఉన్నారు.రవిచంద్రగారూ ఎప్పటిలా మీ పని కొనసాగించండి.భావి తరాలకు విజ్ఞానదీపికలందించే కృషిలో మనమందరం మునుపటిలా పాలుపంచుకుందాం.మీరు నిర్వాహకులుగా కొనసాగాలని కోరుకుంటున్నాను.--t.sujatha 13:13, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రవీ! నువ్వింతగా ఫీల్ అవ్వనవుసరం అసలు లేదు. తెలియకపోవడం వల్ల పొరపాటు జరగడం నీకు మాత్రమే సొంతంకాదు. నేను కూడా ఇంగ్లీషు వికీ పరీక్షలు పాస్ కాలేదు. నాకు sockpuppets అన్న పదం మొన్నటి వరకు తెలియదు. దాన్ని గురించి ఇంత శాస్త్రం ఉందని ఇప్పుడే చూస్తున్నాను. మరో విషయం - నువ్వు multiple voting చేయలేదు గనుక నీ రెండవ అకవుంట్‌ను దుర్వినియోగం చేయలేదు. ఇంగ్లీషు వికీలో ఏవో రూల్స్ చూపి కొరడా ఝుళిపిస్తే క్షోభ పడనక్కరలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:36, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా మీరు నిర్వాహకుడిగా కొనసాగాలనే కోరుకుంటున్నాను. కానీ రూల్స్ రూల్సే కదా. కాబట్టి అలా చెప్పాను. ఆంగ్ల వికీ నియమాలు ఏలాగూ తెవికీలో వాడకూడంటున్నారు. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బావుంటుంది. చర్చసాయీరచనలు 14:39, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు sock puppets గురించి తెలీదన్న విషయం నాకు తెలీదు. మిమ్మల్ని నొప్పించినందుకు క్షమించండి. చర్చసాయీరచనలు 15:08, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకని?

[మార్చు]

నేను మీకు నా మనసులో ఉన్నది చెప్పేస్తున్నాను. మీకు నేను చేసే మార్పులు గానీ చర్చలు గానీ తప్పనిపిస్తే నాకు వెంటెనే ఎందుకు చెప్పలేదు? నేను వచ్చి 3 నెలలు అయ్యింది. ఒక్కరు కూడా నేను చేసినది తప్పు అని ఒక్క సారి కూడా చెప్పలేదు. ఎందుకని? చర్చసాయీరచనలు 15:02, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విన్నపం

[మార్చు]

నాకు ఇష్టమయితే నా నిర్వాహక హోదాను ఉపసంహరిచమని నన్ను మిమ్మల్ని అడగమని కాసుబాబుగారు చెప్పారు. నాకయితే నిర్వాహక హోదా కోల్పోవాలని లేదు. కానీ ఒకవేళ మీరందరు కలిసి నిర్ణయం తీసుకుంటే దానికి బద్దుడను.నా అంగీకారాన్ని ఇక్కడే తెలియ జేస్తున్నానునా హోదాను వెనక్కు తీసుకున్నా సాధారణ సభ్యునిగా దిద్దుబాట్లు కొనసాగిస్తాను. రవిచంద్ర(చర్చ) 09:43, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వహకహోదా తొలగించే హక్కులు తెవికీ అధికారులకు కూడా లేవు. నిర్వాహకహోదా తొలగించాలంటే సముదాయం చర్చ, ఓటింగు జరగాలి. ఆ చర్చ మరియు ఓటింగు ఫలితాన్ని మెటాలోని ఒక స్టీవార్డుకు విన్నవించి నిర్వాహకహక్కులు తొలగించమని నివేదించుకోవాలి. కానీ, మీకు నిర్వాహకహోదా కోల్పోవాలని లేనప్పుడు అలాంటి చర్చను మీరు ప్రారంభించకండి. ఇతర సభ్యులెవరైనా తొలగింపు చర్చను ప్రారంభిస్తే అప్పుడు దానిపై చర్చించవచ్చు. --వైజాసత్య 03:28, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]