Jump to content

వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 7

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

మొలకల గురించి

మొలకల గురించి నా అభిప్రాయాలను, మొలకల జాబితా చర్చ పుటలో వ్రాశాను. దయచేసి చూడగలరు.--SIVA 17:04, 20 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకాదశ

మొలకల జాబితాలో ఈ కింది వ్యాసములు ఉన్నవి:

  1. ఏకాదశ స్కంధము
  2. ఏకాదశపితరులు
  3. ఏకాదశమంత్రములు
  4. ఏకాదశరుద్రులు

అన్నిటికి కూడా "ఏకాదశ"తో ప్రారంభమవుతున్నాయి.

ఈ వ్యాసములన్నిటిని, "ఏకాదశ" అని ఒకే వ్యాసముగా సమీకరించినచి,ఒక్కొక్కటి గా సైడు హెడ్డింగ్ కిందవ్రాసినచో తెలియని వారికి, "ఏకాదశ" మీద ఒక చొటనే పూర్తి వివరములు తెలియగలవు. దయచేసి పరిశీంచగలరు.--SIVA 01:12, 21 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"ఏకాదశ స్కంధము" వేరుగా ఉండాలి. మిగిలినవాటికి మీ సూచన వర్తిస్తుంది. ఐడియా నాకు సబబుగానే ఉంది. అయితే ఈ విధానాన్ని మిగిలిన సంఖ్యానుగుణ వ్యాసాలన్నింటికీ వర్తింపజేయడం లాజికల్ అవుతుంది. ఒక వారం ఆగండి. ఇలాంటివాటి గురించి జరుగుతున్న చర్చలన్నింటినీ పరిగణించి ఒక ప్రతిపాదనను పెడతాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:25, 21 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావుగారి వ్యాఖ్య

ధన్యవాదములు కాసుబాబుగారూ. నా ఉద్దేశ్యం, ఎవరూ కూడా ఆవతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరినీ కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయమం దయచేసి పూర్తిగా పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకొని, నాకు తెలియచేయగలరు.--SIVA 19:52, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికి నిబంధన ఏమంటోంది

వికి మధ్యవర్తిత్వంలో ఈ కింది విధంగా ఉన్నది "వివాద పరిష్కారానికి ఉత్తమ మార్గం, అసలు వివాదం తలెత్తకుండా చూడడమే. ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించండి. అంటే, ముఖ్యంగా వివాదంలో ఉన్న పేజీలో మార్పుచేర్పులను వెనక్కు తీసుకెళ్ళకండి. ఏదైనా దిద్దుబాటు పక్షపాతంగానో, అనుచితంగానో ఉందని మీకు అనిపిస్తే, దాన్ని మెరుగు పరచండి; వెనక్కి తీసుకుపోవద్దు. ఇతర సభ్యులు అభ్యంతరం చెబుతారనుకున్న దిద్దుబాట్లకు సముచితమైన దిద్దుబాటు సారాంశాన్ని రాయండి".

ఈ నిబంధనను రంగారావు గారు అతిక్రమించారు. అందుకనె, నేను మీ దృష్టికి తీసుకుని వచ్చాను. అదే నిబంధనలో ఈ విధంగా కూడా ఉన్నది "అనుచితమైన ప్రవర్తనను గమనించినపుడు మీరూ అదే పద్ధతిలో స్పందించకండి". అందుకని, నేను మళ్ళీ ఆయన చేసిన దిద్దుబాటును, సవరించలేదు, గమనించగలరు.

కాబట్టి, దయచేసి,ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించగలరు, తద్వారా మళ్ళీ వికీలో నా ఉత్సాహాన్ని పునరుద్ధరించగలరు.--SIVA 00:04, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివ స్పందన

కాసుబాబు గారూ! నమస్తే. మీరు ఎస్వీ రంగారావు(నటుడు) చర్చా పుటలో వ్రాసిన విషయం ఈ రోజునే చూడటం జరిగింది. నేను ఈ కింది విధంగా స్పందించాను:

మీరు కూడా illogical అనే ఆంగ్ల పదానికి సరయిన తెలుగు పదం వ్రాయక పోవడం వలన ఏదో అపార్థం వచ్చిదన్నట్టు ధ్వనించేట్టుగా వ్రాశారు. నా అభిప్రాయము, వికీపీడియాలో ఏ సభ్యుడైన కూడ స్వతంత్రముగా వ్యాసాలకు మార్పులు ఛేయవచ్చు, అటువంటి మార్పులమీద వ్యాఖ్యలు చెయ్యాల్సిన అవసరం ఏమిటి? చేసిన మార్పులు బాగాలేదనుకున్నపుడు, ఆ సభ్యుడితో చర్చించాలి, లేదా ఆ మార్పుని సరి చెయ్యాలి, అంతేకాని, ఇతర సభ్యులు చేసిన మార్పులమీద వ్యాఖ్యలు చేయటం ఎంతమాత్రము సమంజసం కాదు, వికీపీడియా స్పూర్తి అంతకంటే కాదు.

నా ఉద్దేశ్యము కూడా ఈ విషయాన్ని సాగదీయాలని కాదు. వికీపీడియా స్పూర్తిని అందరు సభ్యులూ అర్థం చేసుకోవాలని నా తపన. అంతకంటే ఏమీలేదు.

నేను ఈ విషయానీ ఇంతటితో మర్చిపోతున్నాను.

ఎస్వీ రంగారావు వ్యాసన్ని నేను కొంత మార్చ దలుచుకున్నాను. ప్రస్తుతము, ఈ వివాదము పరిష్కారమయిందని భావించి, నేను ఆ వ్యాసాన్ని edit చేయవచ్చునా? ఇంతవరకూ వివాదములో ఉన్నదని నేను ఏవిధమయిన మార్పులు ఛేయలేదు. దయచేసి తెలుపగలరు.

నాకు బాధ కలిగినప్పుడు తగిన ఉపశమన వ్యాక్యాలు చెప్పినందుకు, ధన్యవాదములు.--SIVA 17:32, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాలు

నాకు వర్గాల గురించి సరిగా తెలియదు. విమానాలు అని ఒక కొత్త వర్గం తయారు చేసి బోయింగ్ 747కు తగిలిస్తారా? సాయీ(చర్చ) 12:51, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక సారి చూడండి. మీ వూరు ఉందా బొమ్మ దొరికింది. సాయీ(చర్చ) 12:44, 20 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం సమైక్య కృషి

కాసుబాబుగారూ! మీరనుకున్నట్లు ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని స్కెచ్ లు

కాసుబాబు గారు! నావి కొన్ని పాత స్కెచ్ లు -(రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ,వహీదా రెహ్మాన్, చేగువేరా ,దేవులపల్లి) అప్ లోడ్ చేశాను. కమల్ హాసన్ వ్యాసం లో ఒక బొమ్మ కలిపాను. ఐతె ఇవి ప్రత్యేకంగా వేసినవి కావు. ఇలాంటివి (కొంచం శ్రద్ధ తో వేస్తే) ఉపయోగపడతాయనుకొంటే ప్రయత్నిస్తాను. మీ అభిప్రాయం చెప్పగలరు.Deepasikha 06:08, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మండలం

కాసుబాబు గారూ అర్ధవీడు గురించి వ్రాయాలని మొదలుపెట్టలేదు అనేక గ్రామాల పేజీలలో ఒక లైనుకి మించి సమాచారం లేదు కనుక ఒక్కో మండలానికి చెందిన గ్రామాలను గురించిన సమాచారం ఒకే పేజీలో చేర్చామంటే మిగిలిన గ్రామాలపేజీలను తొలగించడానికి వీలుగా ఉంటుందని అలా చేసాను.ఒంగోలు మండలాలు,అద్దంకి మండలం మండలాలకు పేజీలు తయారు చేశాను .మీరు వాటిని చూసి అవి ప్రయోజనమా కాదా అని మీ అభిప్రాయం చెప్పండి.మిగిలిన మండలాలకు పేజీలు సృష్టించాలా వద్దా అని నిర్ణయించడానికి వీలవుతుంది.
--t.sujatha 09:18, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అర్ధమైంది కాసుబాబుగారూ చర్చించిన తరవాతే చేద్దాం.వెంటనే సమాధానం ఇచ్చినందుకు నెనర్లు.
--t.sujatha 09:18, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిట్కాలు

కాసుబాబు గారూ! మీరు చిట్కాలకు ముందుగానే పేర్లు పెట్టి ఏదో రాద్దామని ఉద్దేశించినట్లున్నారు. వాటిని దయచేసి పూర్తి చేయండి. ఇకనుండి చిట్కా వ్రాసిన తర్వాత పేరు ఇవ్వండి. δευ దేవా 13:48, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

కాసుబాబు గారు! బొమ్మల విషయం లొ మీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యగలరు.ధన్యవాదాలు Deepasikha 07:10, 20 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం మీకు తెలుసా?

మార్చలేదే. నేను ఒకటి చెబుదామనుకున్నాను. ప్రపమ్చంలోని అత్యంత పెద్ద కట్టడము బోయింగ్ ఎవెరెట్ట్ కర్మాగారము. బోయింగ్ 747#కర్మాగారము చూడండి. చర్చసాయీరచనలు 05:10, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారపు వ్యాసం, బొమ్మ

చేసాను. 20వ వారం కి పాలపుంత బొమ్మ పెట్టాను. అంతలోపు వ్యాసం మెరుగుపరుస్తాను. చర్చసాయీరచనలు 07:52, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Meta CheckUser

నాకు Gopikrishna123 (చర్చదిద్దుబాట్లు) మరియు మౌర్యుడు (చర్చదిద్దుబాట్లు) sockpuppets అని అనుమానం వచ్చి, మెటాలో CheckUser విజ్ఞప్తి చేసాను. ఒక సారి చూడండి. చర్చసాయీరచనలు 12:01, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చూశాను. ఓ.కే. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:09, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మరి ఏం చేయాలనుకున్నారు? చర్చసాయీరచనలు 12:12, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
"మెటాలో CheckUser విజ్ఞప్తి "కి ఏమైనా సమాధానం వస్తుందేమో చూద్దాము. తరువాత ఆలోచిద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:41, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వారి సమాధానం ఇప్పుడే చూశాను. అతను Sysop అనేది అప్రస్తుతం. ఏమి చేయాలో ఆలోచించుకోనివ్వు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:53, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:32, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చెప్పింది సబబే

వోట్లు వేసే దగ్గర అభ్యర్థులు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని నా ఉద్దేశ్యం. సాధారణ ఎన్నికల్లో కూడా రహస్య బ్యాలట్ పెట్టడానికి అదే కారణం. ఎన్నికల కేంద్రం దగ్గరే ఓటర్లను బెదరగొడితే వారు నిర్భయంగా ఓటుహక్కును ఎలా వినియోగించుకుంటారు?. ఎలాగైతేనేం ఇక ఈ సంగతి మర్చిపోయి, మనకు మనమే పాలసీలు (మొదట్లో కొద్దిగానైనా సరే)సృష్టించుకోవడనే మంచి పద్దతి.అప్పటి దాకా ఆంగ్ల వికీలోని నియమాలను మన సందర్భానికి సరిపోతేనే వాడుకుందాం. లేకపోతే ఇలాంటి వివాదం తలెత్తినప్పుడల్లా ఒక్కో నియమాన్ని సృష్టించుకోవచ్చునని నా అభిప్రాయం. రవిచంద్ర(చర్చ) 14:03, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకని?

నేను మీకు నా మనసులో ఉన్నది చెప్పేస్తున్నాను. మీకు నేను చేసే మార్పులు గానీ చర్చలు గానీ తప్పనిపిస్తే నాకు వెంటెనే ఎందుకు చెప్పలేదు? నేను వచ్చి 3 నెలలు అయ్యింది. ఒక్కరు కూడా నేను చేసినది తప్పు అని ఒక్క సారి కూడా చెప్పలేదు. ఎందుకని? చర్చసాయీరచనలు 15:01, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


నువ్వు "తప్పేమిటి?" అని అడగడంలేదు. "ఎందుకు చెప్పలేదు?" అని అడుగుతున్నావు. మూడు నెలలూ ఇతరుల తప్పుల గురించి ఆలోచిస్తే నాకు వికీలో వేరేవి వ్రాయడం కుదరదు.

ఎందుకంటే నేను తప్పు చేసానని నాకు తెలుసు కాబట్టి.

తెలుగు వికీలో తప్పులు కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగు వికీ బాల్యదశలో ఉంది. తప్పటడుగులు లేకుండా ఎవరూ నడక నేర్చుకోలేరు. పసి పిల్లవాడిని "మార్చ్‌పాస్ట్" సరిగ్గా చేయలేదని దండించదగునా? తప్పులెన్నడం చాలా తేలిక. అధికంగా వాటిని పట్టించుకోము. కాని ఒక నిర్ణయానికి అవుసరమైనపుడు అవి పరిగణలోకి వస్తాయి.

నాకది తెలీదు

నాకు వ్యాసాలు వ్రాయడం అంటే ఇష్టం. నిర్వాహక బాధ్యతలు నిర్వహించడంపై అంత ఉత్సాహం లేదు. కనుక సభ్యులకు సహాయం, ప్రోత్సాహం గురించి మాత్రమే అధికంగా ప్రయత్నిస్తాను.

నేను మీకు opposite అనుకోండి.

అయినా నువ్వు అడిగావు గనుక వీలయినన్ని (నిజంగా తప్పులు కాదు - నాకు అలా అనిపించినవి) ఎత్తి చూపుతాను. ఇది నీకు ఉపయోగపడుతుందని. "రోజుకో తప్పు" (ఈరోజు చిట్కా లాగా) పరవాలేదా?

ఖచ్చితంగా

చర్చసాయీరచనలు 15:47, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేనూ వికీ

పొద్దు బానే ఉందండి. రెండు రోజులైంది వికీకొచ్చి.. చాలా జరిగిపోయాయి! వికీ పరిణతి చెందడంలో ఇదో పరిణామం! బొమ్మల విషయమై ప్రదీప్‌కు బోలెడన్ని సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంది. ముందు వాటిని పూర్తిచేసి, తిరిగి అసలు పనిలో పడాలి.__చదువరి (చర్చరచనలు) 19:01, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఫైరుఫాక్సులో ఈ పేజీ

కాసుబాబు గారూ, ఫైరుఫాక్సులో ఈ పేజీలోని అక్షరాలు విడిపోయి కనిపిస్తున్నాయి. అయ్యీలో బానే ఉంది. పైనున్న ఆ Div ట్యాగుల్లోని కొన్ని పరామితుల వలన అయ్యుండొచ్చు. బొమ్మల విషయంలో మీ సాయానికి నెనరులు. __చదువరి (చర్చరచనలు) 19:11, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దర్శనము

కాసుబాబు గారు, పరీక్షలు.... పరీక్షలు వాటి వత్తిడి... ఇలాగే ఇంకా 4-5 నెలలు గడుస్తుంది.అంత వఱకు చురుకుగా పాల్గొనే అవకాశము లేదు అని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. కానీ ఇటు ప్రక్క ఒక కన్ను వేస్తునే ఉంటున్నాను--బ్లాగేశ్వరుడు 18:12, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వేమూరి వారి గురించి

వేమూరి వారికి వికీపీడియా నుంచి నేనే ఈమెయిలు పంపించాను అప్పుడప్పుడూ రాస్తుండమని. అలాగే ఎప్పుడో సభ్యులుగా చేరి క్రియాశీలకంగా లేని వారికి ఇద్దరు ముగ్గురికి కూడా పంపించాను. ఇలా పంపిస్తే మరచి పోయిన సభ్యులు తిరిగి వస్తారేమోనని నా భిప్రాయం. రవిచంద్ర(చర్చ) 06:08, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి పని చేశారు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:28, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రవి చంద్ర నన్ను రాయమని తొయ్యక పోతే రాత మళ్ళా మొదలు పెట్టేవాడిని కాదేమో. - Vemurione 20:20, 3 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఉజ్జయిని

కాసుబాబు గారూ నమస్తే, ఉజ్జయిని, 'ఉజ్జయినీ', రెండింటిలో ఏది సరియైనది? ఓవేళ 'ఉజ్జయినీ' సరైనదైతే, ఆ వ్యాసానికి పేరుమార్చండి ప్లీజ్, ధన్యవాదాలు, మిత్రుడు nisar 14:39, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"ఉజ్జయిని" సరి అనుకొంటున్నాను. "నగరం" కలిపితే "ఉజ్జయినీ నగరం" అంటారు. చూస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:44, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆశీర్వచనం

ఆశీర్వ్దించమన్నది నన్ను కాదు! నేను తయారు చేసిన వ్యాసాన్ని. :-) Vemurione 20:18, 3 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


భేతాళ కథలు

కాసుబాబు గారూ, నమస్తే, నా బాల్యంలో చందమామ చదివేటప్పుడు, 'భేతాళ కథలు' అని చదివినట్టు గుర్తుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలలో "భేతాళ" అని పలికినట్టు విన్నాను. కాని ప్రస్తుతం చందమామ లో 'బేతాళ కధలు' అని వ్రాసి వున్నది.[1] ::: 'భేతాళ' కు బదులు 'బేతాళ' అని, 'కథ' కు బదులు 'కధ' అని వున్నది. పరిశీలించి, సరైన పేరు పెట్టడం సమంజసం. సభ్యుడు nisar 09:20, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకూ ఇదే అనుమానం వచ్చింది. కాని శివా గారు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి "బేతాళ కధలు" అన్నది ప్రస్తుతం వాడే పదం గనుక మనం కూడా అదే వాడడం సరి అన్నారు. అయినా మన సొమ్మేం పోయింది. ఒక దారిమార్పు పేజీ కూడా పెడదాం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:14, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

మీరు ప్రేమతో ఇచ్చిన బంగారు గండపెండేరము చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు. నాకు అడ్మినిస్ట్రేషన్ అంతగా తెలియదు. వీలుంటే కొంచెం సాయం చెయ్యాండి. జీవ శాస్త్రము ప్రాజెక్టు పేజీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. జాబితా ఇప్పటికే ఉన్నది. మంచి సలహాలు ఇవ్వండి.Rajasekhar1961 12:18, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పరిశీలిస్తాను. ఒక వారం తరువాత. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:31, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పిన్‌కోడు వ్యాసం

కాసుబాబు గారూ నమస్తే, 'పిన్‌కోడు' వ్యాసం వ్రాయవచ్చా?, పిన్‌కోడు వ్యాసం సృష్టించడానికి పోతే అక్కడ ఓ హెచ్చరిక కనబడింది, తిరిగీ దానిని సృష్టించి వ్రాయవచ్చా లేదా, కొంచెం తెలుపగలరు, కారణం, పిన్ కోడు వ్యాసం మంచి సమాచారాన్ని ఇవ్వగలదు. మిత్రుడు. Nisar 14:10, 6 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిస్సందేహంగా వ్రాయవచ్చు. ఇంతకు ముందు అది ఖాళీగా ఉన్న పేజీ గనుక తొలగించి ఉండొచ్చు. క్రొత్త పేజీ సృష్టించండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:18, 6 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Wrong license

బొమ్మ:Poorna kumbbam.png is most likely to be made by the Government of Andhra Pradesh and hence is copyrighted. The license is wrong and the image must not be displayed on the main page. 117.193.33.154 11:44, 7 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గమనించాను. పరిశీలిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:15, 7 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొల్లోజు బాబా గారి సందేశాన్ని ఇక్కడకు కాపీ చేయడమైనది

కాసుబాబు గారికి,

అయ్యా యానాం విమోచనోద్యమము వ్యాసాన్ని చూసాను. చాలాబాగుంది. యానాం పేరు నేను టైపుచెయ్యటం తప్పుగా చేసాను. దానిని నేను కరెక్ట్ చెయ్యాలనుకుంటున్నాను. మీరు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. పాటిస్తాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు.

యానాం పై ఇది మరొక వ్యాసం. దీన్ని కూడా దయచేసి వికి లో పెట్టండి.

-బొల్లోజు బాబా సభ్యులు:Bollojubaba


మిత్రులు కాసుబాబు గారికి, వికి లో మీ కృషి అనన్యము. యానం ప్రత్యేక ప్రతిపత్తి అనె అంశాన్ని ఎడిట్ చేసి పెట్టినందుకు ధన్యవాదములు . నాతదుపరి వ్యాసాన్ని కూడా ఈ విధంగానే మీకు పంపిస్తాను. అప్ లోడ్ చెయ్యగలరు. కృతజ్ణతలతో -- మీ బొల్లోజు బాబా

ధన్యవాదాలు

అంగ్ల వికీలో మాలిక్ మక్బూల్ సమాధి బొమ్మలు పెట్టినందుకు ధన్యవాదాలు. బౌద్ధమతము లో మీరు పెట్టిన స్థూపము బొమ్మ అమరావతి స్థూప నమూనా. దాన్ని అమరావతి లోకూడ పెట్టగలరా?Kumarrao 15:07, 8 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే చేస్తాను. నా దగ్గర మల్లంపల్లి సోమశేఖర శర్మ పుస్తకం అమరావతి స్తూపం ఉంది. (ఇంటర్నెట్లో దొరుకుతుంది). అది చూసి అమరావతి వ్యాసాన్ని విస్తరించాలనుకొంటున్నాను కాని సమయం దొరుకడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:59, 8 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాధమిక హక్కులు

కాసుబాబుగారూ నమస్కారం, ప్రాథమిక హక్కులు వ్యాసంలో 'Right against exploitation' మరియు 'Right to constitutional remedies' లకు తెలుగు పదాలను కొంచెం తెలుపగలరా! మిత్రుడు నిసార్ అహ్మద్ 12:05, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ అహ్మద్

కాసుబాబుగారూ నమస్తే, మీకో చిన్న విన్నపం, నిసార్ అహ్మద్ వ్యాసం చూసాను, చాలా మథనపడ్డాను, ఆ వ్యాసం తీసెయ్యండని చెప్పాను నేను, దాని చర్చా పేజి చూసాను, తీవ్ర నిరాశకు గురయ్యాను, అంతటి ఛిద్రమైన వ్యాసం ఉంచి మనస్సుకు గాయపరిచేబదులు హుందాగా తీసివేయడం మేలుగా, దాని గురించి నేను ముందే అన్నివిషయాలు చెప్పాను, మరియు దానిని తొలగించండి అనికూడా అన్నాను, ఈ వ్యాసం గూర్చి ఇంత తతంగం జరుగుతుందని ఎవరూ ఊహించైనా యుండరు. మీరు విజ్ఞులు, దయచేసి ఆ వ్యాసం తొలగించండి, నా మనస్తాపం, నాకు తెవికీ నుండి వైదొలిగేలా చేస్తుందేమో?, అలా నేను కోరుకోవడంలేదు. దయవుంచి, ఆవ్యాసం తొలగించండి, లేదంటే అది ఎలా తొలగించాలో నాకు చెప్పండి, అన్ను అర్థం చేసుకోగలరనే భావనలతో, ధన్యవాదాలతో మిత్రుడు. నిసార్ అహ్మద్ 20:30, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]