Jump to content

వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 10

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.


{{సహాయం కావాలి}} సహాయానికి ధన్యవాదాలు. పాటలో కొంత భాగం రాయవచ్చుననీ, పూర్తి పాట కూడదని, రాజశేఖర్ గారు సెలవిచ్చారు. కానీ ఎవరో ఠాగూర్ వ్యాసంలో పూర్తి పాటని రాశారు. దీనిని మీ నిబంధనల ప్రకారం సరి చేయవలసినది గా మనవి. నా వ్యాసాలపై మీ ప్రోత్సాహానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. Veera.sj 09:42, 10 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}} కాసుబాబు గారికి నమస్సుమాంజలులు. పాటలు, పద్యాలు వగైరాలని నేను వికీసోర్స్ లో రచించాను. కావున వికీపీడియాలో ఉండకూడదని అభిప్రాయపడితే మీరు వాటిని నిస్సంకోచంగా తొలగించవచ్చును. ఇక పోతే, ఒక సినిమా కథ, విశేషాలు రాసిన తర్వాత, ఆ సినిమాలోని కొన్ని సంభాషణలని వికీ లో రాయవచ్చునా? - వీరా.

జవాబు ఈ సభ్యుని చర్చా పేజీలో వ్రాస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:06, 9 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]



కాసుబాబుగారూ, నమస్తే. నేను వైజా సత్యగారి చర్చా పుటలో వివరణలు కోరిన విషయాలు,మీకు కూడ తెలియచేయటానికి ఇక్కడ కూడ కాపీ చేస్తున్నాను. దయచేసి, నాకు తెలుపగలరు.

వివరణల అవసరం

వైజా సత్యగారూ నమస్తే. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంటినుండి వికీలో వ్రాయగలుగుతున్నాను. నేను వికీలోకి వచ్చిన తరువాత మీరు మరియు కాసుబాబుగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మీరిచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను అనేక వ్యాసాలు, దిద్దుబాట్లు చెయ్యగలిగాను, చెయ్యటానికి ఉత్సాహం వచ్చింది. కాని, ఈ మధ్య జరిగిన (అతి చిన్న విషయం మీద)జరిగిన సంఘటన(ఎంత కాదని మర్చిపోదామన్నా) చాలా చీకాకు పరుస్తున్నది, మళ్ళీ వ్రాయటానికి మనస్కరించటంలేదు. అందువలన దయచేసి, నాకు కొన్ని వివరణలు ఇవ్వగలరా.

  1. ఈ వారం బొమ్మగా ఒక బొమ్మను పెట్టటానికి ఎన్ని రోజులు, గంటలు,నిమిషాలు, సెకండ్లు వేచి చూడాలి లేదా వ్యవధి ఉండి తీరాలి. అలాంటి నియమం గనుక ఉంటే ఆ నియమం ఆ పుటలోనే ఎందుకు పొందుపరచలేదు. ఆపైన ఈ పని నిర్వాహకులే చెయ్యనక్కర్లేదు, సభ్యులెవరైనా చొరవగా చెయ్యచ్చు అని ఎందుకు వ్రాశారు.
  2. వెరొకరి చర్చా పుటలో మరొక సభ్యుడు వ్యాఖ్య వ్రాసేప్పుడు, ఇక్కడే వ్రాయాలని (కిందనే) అని నియమేమన్నా ఉన్నదా? ఉంటే ఆ నియమం ఎక్కడ వ్రాసి ఉన్నది?
  3. నేను పైన ఉదహరించిన వాటిగురించి లిఖిత నియమాలు లేక పోతే,ఎవరైనా సభ్యుడుగాని, నిర్వాహకుడుగాని లేని నియమాన్ని ఉదహరిస్తే సామాన్య సభ్యుని పరిస్థితి ఏమిటి.
  4. ఏదైనా విషయం గురించి ఇతర సభ్యులు వ్రాయదలచుకొన్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన చర్చా పుటలో కాకుండా, నేరుగా ఆ సభ్యుని చర్చా పుటలో వ్రాయవచ్చునా లేక నిర్వాహకులకు అటువంటి ప్రత్యేక అధికారాలు ఏమన్న ఉన్నాయా. ఉంటే, వికీ నియమాలలో ఎక్కడ ఉన్నాయి.
  5. విషయానికి సంబంధించిన చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్య, నాకు సంబంధించిన చర్చా పుటలో వ్రాస్తే, ఆ వ్యాఖ్య నా చర్చా పుటలో నేను అనవసరం అని బావిస్తే ఆ మాటే వ్రాసి నేను తొలగించకూడదా
  6. చిన్న అభిప్రాయ భేదం వస్తే నిర్వాహకుడైనవారు(ఆ సభ్యునితో ఏమాత్రం చనువు లేని), సభ్యుని వెంటనే "నువ్వు" "నీవు" అని సంభొదించవచ్చునా(మనం వ్యాసాలలో ఎంత గొప్పవారి గురించైనా అతను అని వ్రాయటానికి ఈ విషయం ఒకే గాటన కట్టలేమని నా మనవి), ఒక చిన్న విషయానికి "సభ్యత" వంటి మాటలు వ్రాయవచ్చా.

నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే.

ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--S I V A 03:10, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిర్యాదు

కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి దయచేసి కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా సంయమనం ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా. చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది ఏమిటీ దాష్టీకం, పిడివాదం సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా. -- C.Chandra Kanth Rao-చర్చ 20:47, 26 ఏప్రిల్ 2009 (UTC)

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb" నుండి వెలికితీశారు


ఇంతవరకు జరిగిన సంఘటనలు

  • నేను ఒక మంచి బొమ్మను(ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన కార్టూన్ పాత్ర సామాన్యవ్యక్తి విగ్రహం) వికీలోకి ఎక్కించి, నలుగురికీ బాగా తెలియాలన్న సంకల్పంతో, వెంటనే ఈ వారపు బొమ్మ మూస తగిలించి, అప్పటికే ఉన్న బొమ్మల వరసలో చివరగా ఉంచాను. నేనేమి ఉన్న వరుస చెదర్చలేదు, ఈ బొమ్మకు ప్రాధాన్యమిచ్చి ఇతర బొమ్మలను వెనుకకు తొయ్యలేదు. ఒక నిర్వాహకుల వారు, ఈ బొమ్మ ఏమిటి? బొమ్మ ప్రాశస్త్యమేమిటి? అన్న విషయాలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఈ వారపు బొమ్మ పుటలో లేని నియమాలను ఉట్టంగిస్తూ బొమ్మ ను ఈ వారపు బొమ్మల వరుసలోనుండి తొలగించారు. ఆపైన ఆ బొమ్మ చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్యను నా చర్చా పుటలో వ్రాశారు. అటువంటి వ్యాఖ్య నా చర్చా పేజీలో ఉండటం అనవసరం అని తోచి, అదే మాట వ్రాసి తొలగించాను.
  • దీనికి ఈ నిర్వాహకులవారు మళ్ళీ నా చర్చా పుటలో "ఇది సభ్యత కాదు" అన్న హెడ్డింగు పెట్టి ఎమేమో వ్రాసి తన అక్కస్సును వెళ్ళగక్కారు. ఇంత చిన్న విషయానిమి సభ్యత వంటి మాటలు వ్రాసి ఆవతలి వారిని క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయటం భావ్యం కాదని తలచి, నేను ఆ నిర్వాహకుని పుటలో హెడ్‌మాస్టర్ లాగ ప్రవర్తించవద్దని, సభ్యులను నిరుత్సాహపరచవద్దని నా వ్యాఖ్యలు వ్రాశాను. దానికి వారుకూడ తన చర్యలను సమర్ధించుకుంటూ తాను వ్రాయగలిగినది వ్రాశారు. నేనుకూడ సామరస్యపూర్వకంగ స్పందిస్తూ విషయాన్ని ముగించాను.
  • ఈలోగా దేవాగారు, ఈ నిర్వాహకులవారి చర్చాపుటలో సహనం పాటించమని వారిని కోరుతూ రెండు వ్యాక్యాలువ్రాస్తే, దానికి వీరు దాదాపు పేజీడు వ్యాఖ్యవ్రాసి అందులో చాలా ఇండైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇది చూసిన నాకు అనిపించింది, అసలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, నియమాలు ఏమిటి తెలుసుకుందామని.
  • కాబట్టి మన వికీ రూల్స్ ప్రకారం మూడవ వ్యక్తులను (వైజా సత్య గారిని, కాసుబాబుగారిని)వివరణ కావాలని అడిగాను. ఈ నిర్వాహకుడి తొందరపాటుతనం ఇంతకుముందే తెలుసు కనుక, నేను వివరణలు అడగటానికి పురికొల్పిన సంఘటనలకు కారణమైన వారు దయచేసి కలుగచేసుకొనవద్దు అనికూడ చివరలో వ్రాశాను(వారి పేరును ఎక్కడా కూడ వ్రాయలేదు).
  • వైజా సత్యగారు ఎంతో పెద్దమనిషి తరహాలో నాకు కొంత సంయమనపరచటానికి చల్లటి మాటలతో నా చర్చా పేజీలో వ్యాఖ్య వ్రాశారు. కాసుబాబుగారు, లైట్ తీసుకోండి అన్నారు. నేను సత్యా గారు వ్రాసిన పాయింట్లకు నా పక్కనుండి కొన్ని సూచనలు (వారు వారి వ్యాఖ్యలో కోరిన ప్రకారం)వ్రాద్దామనుకున్నాను.
  • ఈలోగా, ఈ నిర్వాహకులవారు తన తోటి నిర్వాహకులైన సత్యాగారు, కాసు బాబుగారు వ్రాసిన వ్యాఖ్యలు లెక్క చెయ్యకుండా(వీరి వ్యాఖ్యలకిందే ఈ నిర్వాహకులవారు వ్రాశారు) ఎక్కడలేని తామసాన్ని ప్రదర్శిస్తూ, నన్ను ఏకవచన ప్రయోగం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు(పైన కాపీ చేసినవి). ఇప్పటికి కూడ నేను నా సభ్యతను కోల్పోకుండా వారిని గౌరవంగానే సంభోదిస్తున్నాను.

నిర్వాహకుడైనటువంటివారికి తామసం పనికిరాదు. ఓర్పు అవసరం అసహనం పనికిరాదు. విషయం విలువ పట్టించుకోకుండా ఎక్కడా వ్రాతలో కనపడని నియమాలు బోధించటానికి ప్రయత్నించటం,తాను చెప్పినదే వేదమన్నట్టుగా వ్యవహరించటం, దురుసైన భాష, పిడివాదం కాక మరేమవుతుంది. సామాన్య సభ్యులమీద కోప తాపాలు చూపటం, అనుచిత భాష వాడటం, తటాలున (at the drop of a hat, with least provocation)ఆవతలి వ్యక్తిని ఏకవచన ప్రయోగం చెయ్యటం, సభ్యత అంటూ వారి కారెక్టర్ గురించి వ్యాఖ్యలు చెయ్యటం ధాష్టీకం కాక ఏమిటి. వికీ అంటే ఈ నిర్వాహకుల వారు తమ సొంత జాగీర్దారు అనుకుంటున్నారా. మాట్టాడితే నేను గమనిస్తున్నాను, నేను గమనిస్తున్నాను అని వ్యాఖ్యలు. సామాన్య సభ్యులు కూడ గమనిస్తూనే ఉంటారు వారు చేస్తున్న పనులు, చేస్తున్న వ్యాఖ్యలు. వారు వ్రాసిన ప్రతి మాటలోను తాను నిర్వాహకుడినన్న అహంకారం తొణికిసలాడుతూ ఉంటుంది. నేను వికీలో చేరినది మొదలు కాసుబాబు, వైజాసత్య, రాజశేఖర్ గార్లు తదితర నిర్వాహకులు ఎంతో చక్కగా తోటి సభ్యులను ప్రోత్సహిస్తూ, అవసరమైన చోట సున్నితంగా చక్కటి ఆహ్లాదకరమైన భాషలో వారిని సరిచేస్తూ చెప్తూంటారు. వారెక్కడ, ఈ నిర్వాహకులవారెక్కడ

నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.

నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--S I V A 18:02, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

గరికపాడు

కాసు బాబు గారు, మీరు ప్రస్తవించిన అన్నం భట్టు గారు గుంటురు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గరికపాడు అగ్రహారానికి గరికపాడు (క్రోసూరు మండలం) చెందినవారు, గరికపాటి లక్ష్మీ నరసింహం గారిచే రచింపబడిన గరికపాటి వంశచరిత్ర పుస్తకంలో శాసనాల ఆధారంగా నిరూపించారు. మీ వద్ద దీనికి ప్రతీప ఆధారాలు ఉంటే నేను చూడ గోరతాను. ---Navamoini 04:18, 5 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బాపు వ్యాసం

బాపుగారు ఇటు చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, అటు చిత్ర దర్శకునిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గడించారు. వారి గురించి రెండు వ్యాసాలు, అంటే, బాపు (చిత్రకారుడు) మరియు బాపు (దర్శకుడు) అని విడివిడిగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయాన్ని, వ్యాస చర్చలో చాలా కాలంకింద వ్రాశానుగాని, సభ్యులు ఎవరూ స్పందించ లేదు. మీరు ఒక సారి చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.--S I V A 06:19, 22 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అలా వ్రాయడం వ్యాసం నిడివిని బట్టి, అందులో ఉన్న విషయం లోతును బట్టి నిర్ణయించాలి. మీరు సూచించిన పేర్లు నాకు అంత సరి అనిపించడంలేదు. ఆ విధానం మనం ఇద్దరు వేర్వేరు వ్యక్తుల గురించిన పేర్లకు ఇంతవరకూ వాడుతున్నాము. మరింత సరైన విధానం అని నేను భావించేది ఏమంటే - బాపు, బాపు చిత్రకళ, బాపు చలనచిత్ర దర్శకత్వం అనే మూడు వ్యాసాలు ఉండడం ఉచితం. మొదటి వ్యాసం ప్రధానంగా వ్యక్తి జీవితం గురించి, తక్కినవి రెండూ టెక్నికల్‌గాను ఉండాలి. అయితే అలా వ్యాసాలు అభివృద్ధి చేయడం కష్టమే. ఏమైనా మీకు తోచిన విధానంలో ముందుకు వెళ్ళండి. తరువాత మార్చుకోవడం కష్టం కాదు గదా. బెంగళూరులో మీరు సాఫీగా సెటిల్ అయ్యారని భావిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:09, 22 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు

కాసుబాబుగారూ! నమస్తే. మీరు సభ్యుల తరఫున ఇచ్చిన తెలుగు పతకం (మెడల్ బదులుగా పతకం అంటే బాగుంటుందనుకుంటాను)వినమ్రంగా స్వీకరిస్తున్నాను.ఇలా ఒక పతకం ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు, నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. --S I V A 01:19, 7 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు బెంగుళూరు బదిలీ అయినది. నేను మార్చి 8 2009 అక్కడకు వెళ్ళి 9న నా బాధ్యతలు స్వీకరిస్తాను. అక్కడ స్థిరపడిన వెంటనే మళ్ళీ వికీలో చురుకుగా పాల్గొనగలను. ముంబాయిలో ఆర్ కే లక్ష్మణ్ గారిని కలసి వారి దగ్గరనుండి కూడ సమాచారం, చిత్రాలు సేకరించి వికీలో వ్రాదామనుకుంన్నాను. ఇన్నాళ్ళూ ఈ ఆలోచన రాక ఆ పని చెయ్యనందుకు బాధపడుతున్నాను. కుటుంబమును తీసుకుని వెళ్ళటానికి మళ్ళి ఇక్కడకు వచ్చినప్పుడు ప్రయత్నిస్తాను. అదృష్టం బాగుంటే వారి దర్శనం జరుగుతుంది.

కృతజ్ఞతలు

ఉద్యోగ రీత్య ఎక్కువగా తిరుగుతూ వికీ లో పల్గొనలెకపోయిన వీలు దొరికినప్పుడు చూస్తూనేూంటను. మీ సపోర్టుకి కృతజ్ఞతలు--Navamoini


తప్పకుండా చూడవలసిన వెబ్‌సైటు

కాసుబాబుగారూ! మీరు తప్పకుండా చూడవలసిన చక్కటి తెలుగు సైటు (ఇప్పటికే మీరు చూసి ఉండకపోతే). రామాయణ కల్పవృక్షం మీద చక్కటి సాహితీ ప్రసంగం ఉన్నది. స్ట్రీమింగ్ ఆడియో ఫైలు. రామాయణ కల్పవృక్షం వ్యాసంలో కూడ లింక్ ఇచ్చాను. మీరు వినండి, కల్పవృక్షం గురించి , ముఖ్యంగా శైలి, పదాల వాడుక మీద అనేక మైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉన్నది. దయచేసి చూడగలరు. ఈ ప్రసంగం వ్యాసం మీరు వ్యాసం పూర్తి చెయ్యటానికి ఉపయోగ పడుతుందన్న ఆశతో ఈ లింక్ పంపుతున్నాను.

http://surasa.net/music/telugu-kavita/#kalpavrksham కాసుబాబు గారు, మీ సహాయానికి కృతజ్ఞతలు. జాస్తి.సత్యప్రసాద్.

తెలుగు కార్టూన్

కాసుబాబుగారూ నమస్తే! తెలుగు కార్టూనిస్టుల మీద వ్రాస్తున్న వ్యాస పరంపర దాదాపుగా పూర్తయ్యింది (ఇద్దరు ముగ్గురు మినహా). తెలుగు కార్టూనింగ్‌ ఎప్పుడు మొదలయ్యింది దగ్గరనుండి ఇప్పటివరకు ట్రేస్ చేస్తూ, కార్టూన్లలో రకాలు, తేడాలు, రకరకాల స్కూల్ ఆఫ్ థాట్స్ వంటి విషయాలను స్పృశిస్తూ,తెలుగు కార్టూన్ చరిత్రను వ్రాసి, ఆ వ్యాసంలో గ్యాలరీ కింద కార్టూనిస్టుల ఫొటోలను ఉంచి అక్కడనుండి వారివారి ప్రత్యేక వ్యాసాలకు లింక్ ఇద్దామనుకుంటున్నాను. ఒక మంచి పేరు (వ్యాసానికి) సూచించండి. ఆ వ్యాసం పేరు ఎలా ఉండాలంటే, ఎవరైనా మొదటిసారి వికీలోకి వచ్చి, కార్టూన్ల గురుంచి తెలుసుకోవటానికి "వెతుకు" లో ఆ మాటతో వ్యాసాన్ని పట్టుకోగలగాలి. ఒకటిరెండు పేర్లు పెట్టి దారి మార్పులు కూడ పెట్టవచ్చనుకుంటాను. దయచేసి చెప్పగలరు.

మీకు సాహిత్య రచనలమీద మంచి పట్టు ఉన్నది, అభిరుచి కూడ ఉన్నది. మీరు వ్రాస్తున్న వ్యాసాలు చూస్తుంటే, విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షం వ్యాసం మీరు చక్కగా వ్రాయగలరనిపిస్తుంది. దయచేసి మొదలు పెట్టగలరు. నేనుకూడ నాకు తెలిసినంత వ్రాస్తాను. నాకు తెలుగు పద్యాలు చదవటం అవి అర్ధం చేసుకోవటం మీద అంతగా పట్టులేదు.అందుకని ఆ వ్యాసం మొదలుపెట్టే సాహసం చెయ్యలేదు. రామాయణ విషవృక్షం వ్యాసం ఉండి, రామాయణ కల్పవృక్షం వ్యాసం లేకపోవటం బాధాకరం. దయచేసి ఈ విషయం కూడ అలోచించండి.--S I V A 00:50, 27 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • కాసుబాబుగారూ! రామాయణ కల్పవృక్షం వ్యాసం మొదలుపెట్టినందుకు అభినందనలు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ వ్యాసాన్ని పరిపుష్టం చెయ్యటానికి నావంతు కృషి మొదలుపెడతాను.
  • ఇక కార్టూన్ల గురించి, ఎవరెవరి ఫొటోలు వికీలో ఉంచానో వారందరూ కూడ వారి ఫొటోలు, కార్టూన్లతో ఏవిధమైన నిబంధన లేకుండా వికీలో ఉంచటానికి అనుమతి ఇచ్చారు. ఆ విషయంలో ఏమాత్రం వివాదం ఉండదు. మన ప్రముఖ వ్యంగ్య చిత్రకారులందరూ వారిమీద వ్రాసిన వ్యాసాలు చూసి చాలా ఆనందిస్తున్నారు. ఇక శంకు గారు, ఈనాడు శ్రీధర్ గారు వివరాలు పంపవలసి ఉన్నది. కొద్ది రోజులలో వారి దగ్గరనుండి కూడ వివరాలు సంపాయించి వ్యాసాలు పూర్తి చేస్తాను. తెలుగు కార్టూన్ చరిత్ర గురించి కూడ వివరాలు సంపాయించటం మొదలు పెట్టాను. రాబోయే రోజులలో తెలుగు కార్టూన్ చరిత్ర గురించి (పేరు ఇంకా తట్టటంలేదు, అందుకనే మీ సహాయం కోరినది)వ్రాయగలను. --S I V A 17:02, 27 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త డివిడిలు

కాసుబాబుగారూ! శలవు పెట్టి భారత్‌కు వచ్చి చాలా డివిడిలు కొన్నట్టున్నారు. సినిమా పేజీలన్నిటికి ఈ డివిడిల బొమ్మలు శోభ తెచ్చినాయి.--S I V A 17:10, 31 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త మూస కొరకు సూచన

కాసుబాబుగారూ! నమస్తే. మీ చర్చా పుటలోకి వస్తే మీరు శలవలో ఉన్నారని తెలుస్తున్నది. మీకు తీరిక దొరికినప్పుడు చూడండి. నేను జయదేవ్ వ్యాసం వ్రాసినాక, ఆయనను ఇ మైల్ ద్వారా సంప్రతించటం జరిగింది. ఫలితం!! ఊమెన్ వ్యాసం. వారు తెలుగులోని ఇతర వ్యంగ్య చిత్రకారుల (బాబు, రాగతి పండరి, బాలి, సత్యమూర్తి, తులసీరామ్, కే-వీరు ఆయన సోదరులట)గురించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆయనతో కలసి వ్యాస రచన నాకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తున్నది. నా కోరిక ఏమంటే, ఇలా వ్యంగ్య చిత్రకారుల గురించి వ్రాసే వ్యాసాలకు ఒక ప్రత్యేక మూస ఉంటే బాగుంటుంది. తెలుగు వ్యంగ్య చిత్రకారులు(కార్టూనిస్టులు) అని ఒక మూస చెయ్యగలరా. దయచేసి పరిశీలించండి.

నాకు ప్రస్తుతం వీలు కావడంలేదు. రవి చంద్రను అడుగగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:27, 12 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞుడిని

కాసుబాబుగారూ నమస్తే, నా నిర్వాహక హోదా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 16:39, 21 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

కాసుబాబుగారూ నమస్తే, కుశలమా! సెలవులు కులాసాగా గడిశాయనుకుంటాను. మీరూ, వైజాసత్యగారూ, చంద్రకాంతరావుగారూ, తెవికీలో కనబడకపోతే అదెందుకో "శూన్యం"లాగ అనిపిస్తుందండీ. సెలవు పూర్తిగావించి వచ్చారు, స్వాగతం. అహ్మద్ నిసార్ 19:54, 21 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:19, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

కాసుబాబు గారు, స్వాత్ లోయ వ్యాసములో ఆంగ్ల వికీలోని రెండు మూడు బొమ్మలు పెట్టగలరా?Kumarrao 15:58, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే చేస్తాను. మీరు వ్యాసం కొనసాగించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:49, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

తెలుగు పతకం సమర్పించిన కాసుబాబు గారికి కృతజ్ఞతలు. 1) కేలండర్, వర్తమాన ఘటనలకు సంబంధించి తెవికీకి అధిక హిట్లు అవుతున్నాయి. సందర్శకులకు అనుకూలంగా మనం పోవలసి ఉంటుంది. అప్పుడే మన కృషి సార్థకమౌతుంది. 2) వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనది. కొత్తవారికి తెలుగులో టైప్ చేయడం కూడా ఇబ్బంది కాబట్టి అలాంటి వాళ్ళకు వర్గీకరణ వాలా అనుకూలం. 2) చాలా వర్గాలకు అంతర్వికీ లింకులు లేవు. కనీసం ఒక్క అంతర్వికీ లింకు కూడా లేనప్పుడు బాటు కూడా పనిచేయదు. అలాంటి వాటికి అంతర్వికీలు చేరుస్తున్నాను. 4) ఇక నియోజకవర్గాల వ్యాసాల విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో (ఇతర దేశాలలోకూడా - మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి సహజంగానే ఇతర దేశస్థులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు) ఎటు చూసిననూ ఎన్నికల అంశమే. వార్తాపత్రికలలో, టీవీలలో వాటి విశ్లేషణలే. కాబట్టి మనం కూడా శాశ్వత ప్రాతిపాదికపై నియోజకవర్గాలలో అవసరమైన అంశాలు చేరిస్తే బాగుంటుందని ఆ పని చేస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:46, 13 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈమాట వ్యాసం

కాసుబాబుగారూ నమస్తే, ఈమాట పత్రిక వ్యాసం (అంతర్జాల పత్రిక) వ్రాయడము ఓ మంచి ప్రయత్నం, అభినందనలు. అలాగే మూస:తెలుగు పత్రికలు లో ఈమాట వ్యాసాన్ని చేర్చాను, అలా చేర్చడం ఆమోదయోగ్యమేనా తెలుపగలరు. అహ్మద్ నిసార్ 19:26, 31 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చేర్చవచ్చును. ఇంకా ఎక్కువ వ్యాసాలు తయారైతే గనుక వర్గం:తెలుగు అంతర్జాల పత్రికలు అని క్రొత్త వర్గాన్ని సృష్టించవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:33, 31 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

మీరు చెప్ప్పినట్టు చేస్తాను. వీలయినపుడు పోష్టర్ల బొమ్మలు సేకరిస్తాను..విశ్వనాధ్. 05:49, 8 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారూ, బిర్జూ మహరాజ్ వ్యాసం పై మీరు చేసిన మార్పులకు నా ధన్యవాదములు. ----59.93.90.80 02:45, 19 ఏప్రిల్ 2009 (UTC)----Nagaraju raveender 02:47, 19 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


నేను ఆఫీసు గురించి స్కానింగ్ యంతాన్ని తీసుకున్నాను. వికీలో అవసరమైన బొమ్మలకు కొన్ని పత్రికలు, పుస్తకాలు మొదలైన వాటినుండి స్కానింగ్ చేసి బొమ్మలు చేర్చవచ్చునా. ఉదాహరణకు తను రచించిన తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో శంకరనారాయణ ఫోటో ఉన్నది. దానిని స్కాన్ చేసి వికీలో చేర్చవచ్చునా. అలాగే వివిధ లైబ్రరీ పుస్తకాల ముఖచిత్రాలు లేదా CD కవరుమీద ఉండే సినిమా బొమ్మలు కూడా ఉపయోగించవచ్చునా. కాపీరైటు ఉల్లంఘన క్రిందకి వస్తుందా తెలియడంలేదు. కొంచెం మీసలహా అవసరం. ఎలాంటి బొమ్మలు వికీలో చేర్చవచ్చును. మీ సమాధానం తర్వాతనే ప్రారంభిస్తాను.Rajasekhar1961 09:23, 24 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ అప్ లోడ్ చేశాను. కానీ అడ్డంగా వచ్చింది. కాపీరైటు సరైనదేనా. బొమ్మను సరిచేయండి వీలైతే.Rajasekhar1961 10:52, 24 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
రంగు మరకలు వచ్చాయి. ఎందువలననో. బొమ్మ సంతృప్తికరంగా లేదు.Rajasekhar1961 12:22, 24 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
పాత బొమ్మ గనుక నేను కొంచెం కంట్రాస్టు అడ్జస్టు చేయడానికి ప్రత్నించాను. కాని అది బాగా రాలేదు. ఇప్పుడు మీరు అప్‌లోడ్ చేసిన లేటెస్టు బొమ్మ మెరుగ్గా ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:36, 24 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


కాసుబాబు గారు, మీ సహాయానికి కృతజ్ఞతలు. జాస్తి.సత్యప్రసాద్ (పాత చర్చ ఇక్కడికి కాపీ చేశాను)

సినిమా వ్యాసాలు

ఆంధ్రప్రభ 1999 లో ప్రచురించిన విశేష ప్రచురణ 'మోహిని' ఎక్కడో సంపాదించాను. దానిలోనుండే సమాచారం కొద్దికొద్దిగా కలిపి మనవద్ద ఉన్న సమాచారంలో చేరుస్తున్నాను. మీరు చేప్పినట్లు ఇంకెక్కడైనా ఈ పాత సినిమాల లింకులు చేర్చినా కూడా వాటి మీద శ్రద్ధ ఉన్నవారు తర్వాత సమాచారం చేరుస్తారు అని నా అభిప్రాయం.Rajasekhar1961 03:15, 27 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పాపికొండలు

కాసుబాబు గారూ! ఈ మధ్యనే నేను బోటు మీద రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళాను (పాపికొండలు మద్యలోనుంచి). చాలా ఫోటోలు తీశాను. వాటిలో కొన్ని మంచి బొమ్మలు చూసి వికీలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. తెవికీ వరకే ఎక్కించనా? లేక కామన్స్ లోకి ఎక్కించనా? -- రవిచంద్ర(చర్చ) 05:44, 27 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవీ! అది నీ యిష్టం. ఇంతవరకూ నేను తెలుగు వికీలోనే అప్‌లోడ్ చేస్తున్నాను. కామన్స్‌లో బొమ్మలు ఎక్కించడం ఇంకా నాకు అలవాటు కాలేదు. కాని బాగా ఉన్న పూర్తి ఉచిత లైసెన్సు బొమ్మలు కామన్స్‌లో అప్‌లోడ్ చేయడమే అభిలషణీయం. అలా చేస్తే గనుక (1) స్పష్టమైన వివరణ (2) కాపీ హక్కుల గురించిన ట్యాగ్ (3) సముచితమైన వర్గీకరణ మరచిపోవద్దు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:57, 27 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
లేపాక్షి నంది బొమ్మ గురించి

కాసుబాబు గారూ అది నేను తీసిన పొటో కాదు,స్నేహితులు ఇచ్చారు తీసినదని అప్పుడు అప్లోడు చేసా వేరేది చూద్దాం మరొకటి.విశ్వనాధ్. 13:33, 27 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆలాగైతే దానిని తొలగించి కామన్స్‌లోంచి ఉన్న అలాంటి బొమ్మలు మాత్రం ఉంచుతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:57, 27 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్సుకు తరలింపు

వైజా సత్యా! వ్యాసాలను వికీసోర్సుకు ఎలా తరలిస్తారో నాకు తెలియదు. క్రింది వాటిని వికీసోర్సుకు తరలించగలవా? --కాసుబాబు 17:56, 19 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లోకి వెళ్ళి ప్రత్యేక పేజీలలో పేజీ దిగుమతి నుండి ఈ పనిని చేయవచ్చు. దానికి సోర్సులో నిర్వాహకహోదా ఉండాలి. నేను అక్కడికి తరలించాను. --వైజాసత్య 00:33, 20 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అదీ ఇదీ

కాసుబాబుగారూ నమస్తే, అవునండి మీరు చెప్పేది చాలా సమంజసంగానే వున్నది. ప్రదీప్ గారి బాటు ఇటువంటి విషయం చేస్తూవుంటే చాలా సంతోషం. సత్యమేమిటంటే కొంచెం బోరుకొట్టినప్పుడల్లా, కొత్త సభ్యులకు స్వాగతం పలికి తిరిగి రెఫ్రెష్ అయి దిద్దుబాట్లు మొదలెట్టే అలవాటు పడింది. కొత్తసభ్యుల లాగ్ వెతికి చూస్తే చాలా సభ్యులకు స్వాగతం పలకాల్సివుందని గ్రహించాను. అందుకే అపుడపుడు అలా చేస్తూ వచ్చాను. మీరు చెప్పింది దృష్టిలో వుంచుకుంటాను. అలాగే, నేను దిద్దుబాట్లు చేస్తున్న వ్యాసాలను అపుడపుడూ వీక్షిస్తూ తగు సూచనలిస్తూవుండండి.అహ్మద్ నిసార్ 20:50, 24 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస విభజన

గ్రామాల వ్యాసాల గురించి

గ్రామాల వ్యాసాల గురించి మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. నాకు కూడా వ్యక్తిగతంగా కొంతమంది ఉపాధ్యాయులు తెలుసు. కానీ మండలాధికారులు మాత్రం పెద్దగా తెలియదు. కానీ ఈసారి ఊరెళ్ళినపుడు మాత్రం వాళ్ళను కలవడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్న శాఖా గ్రంథాలయంలో గ్రామాల గురించిన సమాచారం ఉందేమో కనుక్కుంటాను. అయితే మొదట ముఖ్యమైన సమాచారమైన జన సంఖ్య, ఓటర్ల సంఖ్య, ఆయకట్టు వివరాలు మొదలైన సేకరించడం సులభం అనుకుంటా.

ఇంకా మనం ఒక గ్రామం వ్యాసంలో ఏ సమాచారం ఉండాలి అనే విషయంపై కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా నాకు స్పురణకు వచ్చిన విషయాలను గ్రామల ప్రాజెక్టు పేజీలో చేరుస్తూ ఉంటాను. ప్రస్తుతానికి వాళ్ళను సమాచారాన్ని పోస్టల్ ద్వారా అబ్యర్థించినా నెమ్మదిగా వాళ్ళను కూడా ఈమెయిల్ వైపు మళ్ళించడం మంచిదనుకుంటూన్నాను. నాకు తెలిసి ప్రతి పాఠశాలలో/మండల్ ఆఫీసులో కంప్యూటర్ గురించి తెలిసిన ఒకరైనా ఉంటారనుకుంటున్నాను. ఇంక వాళ్ళు ఏ ఫార్మాట్ లో పంపించాలనే విషయంపై మనం చర్చిద్దాం. -- రవిచంద్ర(చర్చ) 12:51, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమేం వ్రాయవచ్చునో ఇదివరకు వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1 అనే పేజీలో వ్రాశాను. ఇప్పుడు ఇలాంటిదే మరొక ప్రచార వ్యాసం తయారు చేస్తాను. తరువాత చర్చించుదాము --కాసుబాబు 19:43, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గీకరణ

కాసుబాబుగారూ నమస్తే, ప్రత్యేకపేజీలు→వర్గీకరించని పేజీలు లోకి వెళ్ళి, అక్కడున్న పేజీలను వర్గీకరణ ప్రారంభించాను. ఆపని సవ్యంగా జరుగుతున్నదో లేదో, మీరు ఒక సారి "ర్యాండం చెక్ అప్" చేసి చెప్పండి. అహ్మద్ నిసార్ 18:22, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల వ్యాసాలు

కాసుబాబు గారూ, కొన్ని గ్రామాల వ్యాసాలు జిల్లా, మండలము తెలుప కుండా అనేకం వున్నాయి. వాటిని గుర్తించాలంటే చాలా కష్టంగా వున్నది. వీటన్నిటినీ ఒక చోట చేర్చాలంటే వీటి కొరకు ఒక మూస అవసరం అని అనిపిస్తున్నది. "చాలా కొద్ది సమాచారం" మూసలాగా ఒకటి తయారు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ 11:16, 19 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈవాబొ మరియు ఈ వారం వ్యాసాలు

కాసుబాబు గారూ నమస్తే, ఓ మోస్తరు అవగాహన కలిగించుకోవడానికి ఓ వారం రోజులు సమయమివ్వండి. రేపటినుండి నేనూ ఓ నాలుగు రోజులు బిజీ. ఆతరువాత మీ సూచనలు తీసుకుంటాను. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 19:34, 20 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ నమస్తే, ఈ వారం వ్యాసాల కొరకు 27 మరియు 28 వారాలకొరకు వాడుకరి:అహ్మద్ నిసార్/ప్రయోగశాల లలో వ్రాసివుంచాను. మీ అభిప్రాయం తెలిపేది. వాటిని మొదటిపేజీకి ఎలా లింకు ఇవ్వాలో కొంచెం తెలుపగలరు. అహ్మద్ నిసార్ 11:00, 28 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని విషయాలు - గ్రామాలు, సినిమాలు

వైజా సత్యా!

  • నేను నీకు ఈ-మెయిల్‌లో పంపిన డేటాబేస్ గురించిన విషయం మరికొంత - శ్రీ భాస్కర్ గుజ్జి గారు ఖమ్మం, నల్గొండ జిల్లాలకు పంపిన డేటాబేస్ ఆధారంగా నేను ఒక గ్రామం పేజీ గుమ్మదవల్లి ప్రయోగాత్మకంగా చేశాను. గణాంకాలతో పాటు పనిలో పనిగా విస్తరణకు అనుకూలమైన శీర్షికలు కూడా ఉంచాను. క్రొత్తగా ప్రయత్నించే సభ్యులకు ఇది మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తున్నాను.
  • ఆయన ఇచ్చిన డేటాబేస్‌ను నేను "మైక్రోసాఫ్ట్ పదం" (MS Word) లోకి మార్చాను. మిగిలిన గ్రామాలకు ఇది బాట్ ద్వారా చేయడం వీలవుతుందా పరిశీలించు.అలాగైతే నేను నీకు వర్డ్ ఫార్మాట్ ఫైలు పంపుతాను. అలా వీలు కాదంటే ఇలాగే మాన్యువల్‌గా చేస్తాను. ఇంకా ఏమైనా మార్పులు కూడా ఆలోచించు.
  • గడచిన రెండు నెలల్లోను చాలా సినిమా పేజీలు విస్తరించాను. ఇప్పుడు 2 కెబిలు దాటిన సినిమాలెన్నో మళ్ళీ చూడగలవా? ఎందుకంటే విస్తరణ అవకాశాలను బేరీజు వేయడానికి ఇది పనికొస్తుంది.

-కాసుబాబు 07:34, 19 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నాలుగు రోజులు ఊళ్ళో లేకపోవటం వళ్ళ మెయిలు చూసినా డేటాబేసు తెరిచి చూడలేదు. నా తొలి అంచనాగా ఇవి బాటుతో చెయ్యటం వీలవుతుంది అనుకుంటున్నాను. అయితే ముందస్తుగా దానికి కొంత మనం హోంవర్క్ చెయ్యాలి. ఈ డేటాబేసులోని గ్రామాల పేర్లు ఇంగ్లీషులో ఉంటాయి. అయితే దాని ఇంగ్లీషు పేరు పక్కనే ఒక కొత్త కాలమ్ పెట్టి అందులో తెవికీలో ఆ గ్రామం పేజీ ఏ పేరుతో ఉందో అలాగే ఉన్నదున్నట్టుగా తెలుగు పేరును అక్కడ చేర్చితే బాటు మిగిలిన పనంతా చేసుకొని పోగలదు. క్షుణ్ణంగా పరిశీలించి మరేదైనా మార్పులుచేర్పులు చెయ్యగలమేమో మళ్ళీ వ్రాస్తాను. సినిమా గణాంకాలు ఇప్పుడే తాజాకరించాను --వైజాసత్య 05:15, 22 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

మీ అభినందనలకు నా కృతజ్ఞతాభివందనాలు. అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలటానికి కృషిచేస్తున్న వేల దీపాల్లో నేనొక చిరుదివ్వెను. ఈ శుభసందర్భంలో నాకు ఇంతకంటే మాటలు రావడం లేదు. — రవిచంద్ర(చర్చ) 04:41, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల వ్యాసాల గురించి

దీనికి ఆలస్యంగా సమాధానం ఇస్తున్నానని ఏమీ అనుకోకండి. హైదరాబాదులో నేనుండే ఇంటి పోస్టల్ అడ్రస్ ఇవ్వడానికినాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే అది అద్దె ఇల్లు కాబట్టి ఎప్పుడైనా మారిపోయే అవకాశం ఉంది. ఎవరైనా హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళను అన్వేషిద్దామా?

అలాగే వ్యక్తిగత ఫోను నంబరే ఇచ్చి కొన్ని నిర్ణీత సమయాల్లో నే (అంటే శని ఆది వారాలు, నేను ఖాళీ గా ఉంటాను కాబట్టి). ఫోన్ చేయమని చెబుతాం. — రవిచంద్ర(చర్చ) 04:41, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గీకరణ

కాసుబాబుగారూ నమస్తే, LocalSettings.php మరియు మొదటి పేజీ లకు ఏఏ వర్గాలలో వుంచాలో తెలియడం లేదు, మీరు కొంచెం గైడ్ చేయండి. అహ్మద్ నిసార్ 19:16, 26 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నాకూ తెలియదు. వెతకాలి లేదా ఆలోచించాలి. ప్రయత్నిస్తాను. అసలు LocalSettings.php అంటే ఏమిటో కూడా నాకు తెలియదు --కాసుబాబు 19:22, 26 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్

Hi, can you take a look at this article? Looks like it's about బ్యాంబి and not The Fox and the Hound. Make it about The Fox and the Hound please, and expand it to the Bambi article's standrads. Thanks. 70.146.241.208 04:04, 8 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఓసారి పరికించండి

కాసుబాబుగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 16:59, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఒరాకిల్

రవీ! ఈ వ్యాసాన్ని మొలక స్థాయి దాటించగలవా? --కాసుబాబు 18:53, 8 ఆగష్టు 2009 (UTC)

తప్పకుండా! నా దృష్టికి రాలేదు గానీ లేకపోతే ఎప్పుడో దాటించి ఉండేవాడిని. తెలియజేసినందుకు ధన్యవాదాలు. —రవిచంద్ర (చర్చ) 13:05, 9 ఆగష్టు 2009 (UTC)

గోవర్ధన గిరి

Govardhan.jpg ని కామన్స్ లోకి చేర్చి గోవర్ధన గిరి పేజీలో చేర్చమని మనవి. మిగిలిన సమాచారాన్ని నేను చేరుస్తాను. ధన్యవాదాలు.Rajasekhar1961 11:00, 13 ఆగష్టు 2009 (UTC)

బొమ్మ సహాయం

Khairatabad Ganesh.jpg బొమ్మను ఆంగ్ల వికీ కామన్స్ లోకి అదే పేరుతో లోడ్ చేయగలరని విన్నపం. Khairatabad page లో దానిని ఉంచాలని ఆలోచన. ధన్యవాదాలు.Rajasekhar1961 06:40, 24 ఆగష్టు 2009 (UTC)

అలాగే చేశాను. File:Khairatabad Ganesh.jpg చూడండి - --కాసుబాబు 11:46, 24 ఆగష్టు 2009 (UTC)
  • ధన్యవాదాలు.122.169.163.139 12:28, 24 ఆగష్టు 2009 (UTC)
  • వేమూరి గగ్గయ్య సావిత్రి సినిమాలోని బొమ్మను కామన్స్ లోకి అప్ లోడ్ చేయమని వినతి. వీరి గురించి ఆంగ్ల వికీ పేజీ తయారుచేస్తున్నాను. en:Vemuri Gaggaiah ఆ పేజీలో ఉంచుదామని ఆలోచన. సహకరిస్తారని భావిస్తాను.Rajasekhar1961 15:08, 11 సెప్టెంబర్ 2009 (UTC)
  • ధన్యవాదాలు.Rajasekhar1961 11:41, 12 సెప్టెంబర్ 2009 (UTC)
దస్త్రం:Sri Sharada.jpg
Sri Sringeri Sharada Devi

శృంగేరి శారదాంబ బొమ్మను కామన్స్ లోకి లోడ్ చేయమని విజ్ఞప్తి. వ్యాసాన్ని విస్తరిస్తున్నాను.Rajasekhar1961 11:01, 30 అక్టోబర్ 2009 (UTC)

బొమ్మలు

ఆంగ్ల వికీ నుండి తీసుకొని ఉమేశ్ చంద్ర బొమ్మ పెట్టినందుకు ధన్యవాదాలు. అలాగే కాపానీడు, లీల నాయుడు, రాజశ్రీ పతి బొమ్మలు పెట్టగలరా? Kumarrao 12:15, 10 సెప్టెంబర్ 2009 (UTC)

కుమారరావుగారూ! మీతో చర్చించి చాలా కాలమయ్యింది. మరియు ఈ మధ్య ఆఫీసు పనులలో బిజీగా ఉన్నాను.

  • కాపానీడు బొమ్మ గురించి ఇదివరకు మీరు అడిగారు గాని నేను మరచిపోయాను. అప్పుడు కూడా వెనుకాడడానికి కారణం ఆ బొమ్మ గురించి కొన్ని సందేహాలున్నాయి. ఉదాహరణకు - అది కాపానీడు బొమ్మేనా? లేక నిర్మల్ శైలిలో చిత్రించిన ఒక వీరుని బొమ్మా? మీరు మరొకసారి కన్ఫర్మ్ చేసుకొంటే అప్పుడు కామన్స్‌లోకి అప్‌లోడ్ చేస్తాను.
  • లీలానాయుడు బొమ్మ ఆంగ్ల వికీలో కూడా లేదు.
  • రాజశ్రీపతి గురించిన ఆంగ్ల వికీ వ్యాసం దొరకలేదు. స్పెల్లింగ్ చెప్పగలరా?

--కాసుబాబు 22:25, 10 సెప్టెంబర్ 2009 (UTC)

లీల ఎంత అందమైనదో en:Leela Naidu లోని బొమ్మ చెపుతుంది. అలాగే en:Rajshree Pathy కూడా చూడండి. కాపానీడు బొమ్మ నిర్మల్ చిత్రమే. ఇబ్బంది ఏమీ లేదుగదా?Kumarrao 08:57, 12 సెప్టెంబర్ 2009 (UTC)
(1) లీలానాయుడు బొమ్మ నిన్ననే ఎవరో ఆంగ్లవికీలో అప్‌లోడ్ చేశారు. రాజశ్రీపతి వ్యాసం కూడా దొరికింది. అయితే అవి రెండూ ఉచిత బొమ్మలు కానందున వాటిని కామన్స్‌లో పెట్టడానికి కుదరదు. కనుక తెలుగు వికీలోకి "Non-free fair use" క్రింద అప్‌లోడ్ చేస్తాను. (2) నిర్మల్ చిత్రమైనందువలన ఏమీ ఇబ్బంది లేదు. అయితే నేను అడిగినదల్లా అది కాపానీడు బొమ్మేనా అని. మీకు కన్ఫర్మ్ అనిపిస్తే ఓకే. --కాసుబాబు 09:45, 12 సెప్టెంబర్ 2009 (UTC)
కాపానీడు బొమ్మ విషయములో సందేహములేదు. బొమ్మలు చేర్చినందుకు ధన్యవాదాలు.Kumarrao 12:30, 12 సెప్టెంబర్ 2009 (UTC)
రవి అరిమిల్లి బొమ్మ పెట్టగలరా? ఇంటర్నెట్లో కొల్లలు గా ఉన్నాయి. కాపీరైట్ సమస్య లేని బొమ్మ దొరకవచ్చునేమో.Kumarrao 15:20, 20 సెప్టెంబర్ 2009 (UTC)
అలాగే.Kumarrao 16:06, 22 సెప్టెంబర్ 2009 (UTC)
అది వెంకటప్పయ్య గారిదే అనుకుంటాను. "గ్రంథాలయ సేవా నిరతులు" శీర్షిక క్రింద.Kumarrao 12:06, 24 సెప్టెంబర్ 2009 (UTC)

బొమ్మ లైసెన్సు

ఫైలు:Mahabubnagar Toorpu Kaman.JPG, ఫైలు:Ram Mandir, Mahabubnagar.JPG బొమ్మలకు లైసెన్సు వివరం వ్రాయడం మర్చిపోయినట్లున్నారు. ఒకమారు చూడగలరు --కాసుబాబు 18:20, 18 సెప్టెంబర్ 2009 (UTC)

లైసెన్సు వివరాలు చేర్చినాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:38, 18 సెప్టెంబర్ 2009 (UTC)