వాడుకరి:TamminiNaga

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Pandithapuram

[మార్చు]

నేను తమ్మిని నాగేశ్వర్ రావు. మాది పండితాపురం అను గ్రామము. పండితాపురం డాట్ కామ్ కు స్వాగతం. ప్రియమైన మన వెబ్ సైట్ వీక్షకులకు తెలియజేయునది ఏమనగా మేము పండితాపురం అనే మన గ్రామం గురించి యావత్ ప్రపంచానికి తెలియజేసే క్రమం లో గ్రామ పెద్దలు, మేధావులు, గ్రామ పూర్వీకులచే తెలియపరచిన సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నాము అని తెలియజేయుటకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ వెబ్ సైట్ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే దయచేసి మమ్ముల్ని మన్నించి వాటిని మాకు తెలియజేయగలరని మా మనవి.

పండితాపురం గ్రామం భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం లో గల కొమ్మినేపల్లి గ్రామా పంచాయితి పరిధి లో ఉన్నది. ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారి లో ఖమ్మం నుంచి 17 కి. మీ. దూరం లో కలదు. ఇటువంటి గ్రామం మా స్వగ్రామం అని ప్రపంచానికి తెలియ పరచడం చాలా సంతోషానికి గురి చేస్తుంది.

గ్రామం వివరాలు

[మార్చు]

పండితాపురం గ్రామానికి జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణం నుంచి రోడ్డు సౌకర్యము కలదు కావున గ్రామానికి బస్సు ప్రయాణ సౌకర్యము కలదు మరియు ప్రధాన రహదారి నుంచి పలురకాల రవాణా సౌకర్యములు ఉన్నవి కావున ఇవి గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాయి. గ్రామంలో నీటి కొరత కొంత ఉన్నపటికిని గ్రామ పంచాయితీ వారి సేవలు మరియు పలువురు దాతల సహాయము ద్వారా దాన్ని నివారిస్తూ నిత్యం త్రాగునీటి సరఫరా కార్యక్రమం జరుగుతుంది. గ్రామానికి కరెంటు సౌకర్యము ఉండడం ద్వారా సాంకేతికంగానూ మరియు వ్యవసాయ సేద్యానికి గాను ఉపయోగిస్తూ మా గ్రామం అభివృద్ధి పదం లో ముందుకు సాగుతుంది.

పండితాపురం లో అనేక రకాల సంస్కృతులు భిన్న మతాల వారు నివసిస్తున్నారు. గ్రామం లో పలు రకాల దేవాలయాలు, విద్యాలయాలు మరియు గ్రంథాలయము ఉన్నవి. పండితాపురం లో ముఖ్యం గా ప్రజల జీవన ఆధారము వ్యవసాయము, వ్యవసాయ కూలి మరియు ఇతర కూలి పనుల ద్వారా ఉపాధి గడిస్తూ ఉన్నారు. పండితాపురం లోని ఉన్నత విద్యాలయం ద్వారా గ్రామం లోని విద్యార్థినీ విద్యార్థులే కాకుండా చుట్టూ పక్కల గ్రామాలూ అయిన అబ్బాసుపురం తండ మరియు మరికొన్ని గిరిజన ప్రాంత తండలలోని పిల్లల చదువుకు తోడ్పాటు జరుగుతుంది. గ్రామం వ్యాపార అభివృద్ధి లో ఇప్పుడిప్పుడే అడుగులు ముందుకు వేస్తూ ప్రజలకు పట్టణాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని వస్తువులు గ్రామ శివారుల లోనే అందుబాటులో ఉండేవిధంగా బాటలు వేస్తుంది.

పండితాపురం గ్రామంలో శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పశువుల సంత కలదు. దీని ద్వారా వారంలో ప్రతి బుధవారం పలు రకాల వ్యాపారాలు నిర్వహించబడును కావున చుట్టు పక్కల గ్రామాల ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ కొందరికి అయినా ఉపాధిని సృష్టిస్తూ గ్రామ అభివృద్దికి దోహద పడుతుంది. దీనికి గ్రామ పంచాయితీ యాజమాన్యం వహిస్తుంది. గ్రామం లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మరియు గ్రామీణ వికాస బ్యాంకు వారి శాఖలు కలవు. వీటి ద్వారా ఖాతాదారులు వారి లావాదేవీలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతులు మరియు డ్వాక్రా మహిళలు రుణాలు పొందే అవకాశాన్ని కలిగి ఉన్నారు.

పండితాపురం నందు పోస్ట్ ఆఫీసు మరియు BSNL వినియోగదారుల సేవా కేంద్రాలు కలవు కావున గ్రామానికి ఉత్తర ప్రత్యుత్తుర సౌకర్యాలు మరియు టెలిఫోన్ సేవలు కలవు. మీ సేవ కేంద్రం కూడా ఉంది తద్వారా సాంకేతికముగా అవసరమయ్యే సేవా సదుపాయం కలదు. దీని వలన రెవిన్యూ సేవలు మరియు ఇతర సాంకేతిక అవసరాలు తేలికగా తీర్చుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా తమ అవసరాలను తీర్చుకునే దిశగా గ్రామం ముందడుగు వేస్తుంది.

విద్యాలయాలు

[మార్చు]

పండితాపురం గ్రామం లో ప్రాధమిక విద్య మరియు ఉన్నత విద్యా సౌకర్యాలు కలవు. సర్వశిక్షా అభియాన్, అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల కొమ్మినేపల్లి మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొమ్మినేపల్లి ద్వారా పలువురు విద్యార్థినీ విద్యార్థులకు విద్యాభ్యాసం చేసే అవకాశం కలదు. ఇందుకోసం చుట్టూ పక్కల గ్రామాల మరియు గిరిజన తండాల నుంచి పిల్లలు తరలి వస్తుంటారు. అలాగే సమీప పట్టణం అయిన ఖమ్మం లో కళాశాల చదువులతో పాటు పలు రకాల సాంకేతిక ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. పండితాపురం విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తూ ఉత్తమ ఉత్తీర్ణతా శాతాన్ని నమోదు చేస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు.

ప్రతి విద్యా సంవత్సరం లోను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి లో మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామ ఖ్యాతిని గొప్పగా చాటారు. అదే విధంగా ఈ గ్రామంలో ఉన్న యువతీ యువకులు పలు గొప్ప గొప్ప అంతర్జాతీయ కార్యాలయాలో ఉన్నత కొలువులు నిర్వహిస్తూ ఉన్నరు. అందుకు వారి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల భోదన మరియు గ్రామ పరిసరాలు ఎంతో దోహద పడుతున్నాయి. పండితాపురం నుంచి వెళ్లి పలు ప్రదేశాలలో స్థిరపడిన ప్రముఖులు సైతం వారికి ఆ గ్రామం తో ఉన్న అనుబంధాన్ని పలుమార్లు గుర్తుచేసుకోవడం ద్వార ఈ గ్రామం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవో గమనించవచ్చు.

పలువురు రాజకీయ ప్రముఖులు, పత్రికా ప్రముఖులు మరియు విద్యావేత్తలు పండితాపురం గ్రామ పూర్వ విద్యార్థులుగా తమను తాము పరిచయం చేసుకున్న సందర్భంలో ఈ గ్రామంలోని పాఠశాలల యొక్క గొప్పదనం మరియు గురువుల యొక్క భోదన పటిమ ఎంత గొప్పదో ఈ సంఘానికి అర్ధం అవుతుంది. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల స్థాయి లోనే గురుకుల విద్యాలయాలు మరియు జవహర్ నవోదయ పాఠశాలలలోకి ప్రవేశాల కొరకు మార్గనిర్దేశం చేస్తూ పిల్లల ఉన్నత విద్య కొరకు అత్యున్నత బాటలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నత పాఠశాల స్థాయి లోనే కంప్యూటర్ విద్యను భోదిస్తూ పిల్లల సాంకేతిక అభివృద్దికి బాటలు వేయడం జరుగుతుంది. ఇక పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పిజీ వంటి ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసించడంలో ఇక్కడి గ్రామీణ పాఠశాలలలోని విద్యావిధానం ఎంతో తోడ్పడుతుంది.

పండితాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొమ్మినేపల్లి లో తెలుగు మాద్యమంతో పాటు ఆంగ్ల మాద్యమంలో కూడా భోదిస్తారు. అందువల్ల ఈ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పలు భాషల ఫై అవగాహన ఏర్పడుతుంది మరియు వారిని మానసికంగా దృడంగా చేస్తుంది. ఈ గ్రామం లోని అన్ని పాఠశాలలో కూడా పిల్లలకు ఆటల పట్ల అవగాహన కలిగిస్తారు అందువల్ల వారు శారీరకంగా మరియు మానసికంగా దృడంగా తయారవుతారు. పలుచోట్ల జరిగే ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ గ్రామ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వారి ఉన్నత ప్రతిభను కనబరుస్తూ మంచి విజయాలు సాదిస్తున్నారు.

ఆలయాలు

[మార్చు]

పండితాపురం గ్రామం లో పలు హిందూ దేవాలయాలతో పాటు చర్చ్ మరియు మసీద్ లు ఉన్నవి. దీని వల్ల గ్రామం లో భక్తి సామరస్యం కలిగి ఉంది అనే విషయం తేటతెల్లం అవుతుంది. ఈ గ్రామంలోని ఒక్కో ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత మరియు విశిష్ట చరిత్ర కలిగి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు అన్ని పండుగలు, పర్వదినాలను చాల భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

పండితాపురం గ్రామం అనగానే ముందు గుర్తుకు వచ్చేది అక్కడి శివాలయం. ఇది కొండాయిగుడెం శివారులో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. దీన్ని పూర్వం కాకతీయుల పాలనా కాలంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు మరియు పూర్వీకుల అనుభవాలు కలవు. ఇక్కడ అర్చకుల సమక్షంలో నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం లో ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అందుకు గాను స్వామివారి కళ్యాణమండపం కూడా కలదు. అలాగే జాతర మరియు పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పండితాపురం గ్రామ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం కూడా ప్రముఖమైనది. దీన్ని 1997 లో కీ॥శే॥ శ్రీ ఆత్మకూరి చంద్రశేఖర్ రావు గారు మరియు వారి కూతురు శైలజ ల జ్ఞాపకార్ధం వారి కుటుంబీకులు నిర్మించారు. ఇక్కడి ఆలయంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి, వినాయకుడు మరియు సాయిబాబా ల మంటపములు కలవు. ఇక్కడ నిత్యం వేదపండితుల సమక్షంలో పూజలు, భజనలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రధాన రహదారి సమీపం లో ఉండటం ద్వారా చుట్టూ పక్కల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తారు.

పండితాపురం గ్రామం లో బొడ్రాయి, రామాలయం మరియు గ్రామా దేవతలు అయిన ముత్యాలమ్మ తల్లి ఆలయం ఉన్నాయి. ఇక్కడ నిత్యం పలు రకాల పూజలు జరుపుతారు. అలాగే ప్రతీ సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మరియు కార్తీక మాసంలలో గ్రామదేవతలకు ప్రభలు కట్టి ఉత్సవాలు జరుపుతారు. వినాయక చవితి పర్వదినం సందర్భం లో పలు ప్రదేశాలలో వినాయక మంటపాలు నిర్మించి విశిష్ట పూజలు మరియు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఉట్ల పండగ నిర్వహించి గ్రామంలోని యువత ఎంతో ఉత్సాహంతో ఉట్లు కొడతారు. దసరా పండగ సమయంలో దేవీనవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలోని మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు.

పండితాపురం లో ఉన్న చర్చి లో ప్రతి ఆదివారం మరియు ముఖ్యమైన పండగల సందర్భంలలో ప్రార్ధనలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుతారు మరియు గుడ్ ఫ్రైడే ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా గ్రామంలోని మసీద్ యందు నిత్యం పలుమార్లు నమాజ్ లు జరుపుతారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ప్రార్ధనలు జరుపుతారు అలాగే బక్రిద్ మరియు మొహరం (పీర్ల పండగ) ఘనంగా నిర్వహిస్తారు. ఈ విధంగా గ్రామంలో సర్వమత సమ్మేళనంగా అన్ని రకాల పండగలు జరుపుకుంటారు.

చెరువులు

[మార్చు]

పండితాపురం లో ఉన్న చెరువులు కుంటల ద్వారా వ్యవసాయం మరియు త్రాగునీటి సరఫరా జరుగుతుంది . గ్రామంలో కొండాయిగుడెం శివారులో ఉన్న పెద్ద చెరువు ద్వారా సుమారు వెయ్యి ఫై చిలుకు ఎకరాలలో వరి పంట పండుతుంది. అదేవిధంగా కొన్ని కుంటలకు నీటి సరఫరా అవుతుంది. అందులో ముఖ్యంగా సీతబందం గురించి చెప్పుకోవచ్చు.

పండితాపురం లో ఉన్న కొండారెడ్డి చెరువు కూడా నీటి పారుదలలో ప్రముఖమైనది. దీని ద్వారా కూడా వరి పంట సాగు జరుగుతుంది. అదేవిధంగా ఈ చెరువు గ్రామ త్రాగునీటి సరఫరాకు ఎంతో దోహదపడుతుంది. అలాగే గ్రామ సమీపంలో ఉన్న మరో చెరువు చింతల చెరువు. దీని ద్వారా కూడా వరి పంట సాగు చేస్తారు. అలాగే మరికొన్ని కుంటలు కూడా కలవు. వాటిలో ముఖ్యంగా కృష్ణరాయ కుంట, లక్ష్మయ్య కుంట మరియు పేతురు కుంటలు గా చెప్పవచ్చు. వీటి ద్వారా కూడా కొన్ని ఎకరాల వరి పంట సాగు జరుగుతుంది.