Jump to content

వాడుకరి:Sudhakarbira/sandbox

వికీపీడియా నుండి

పంటల ను ఆశించే ఆకులను కాండాన్ని తొలిచి పంటను నష్ట పరచే పురుగు కత్తెర పురుగు. కత్తెర తెగులు నే ఫాల్ ఆర్మీ వార్మ్ అని కూడా అంటారు.

వ్యాధి చరిత్ర

[మార్చు]

పంటల ను ఆశించే ఆకులను కాండాన్ని తొలిచి పంటను నష్ట పరచే పురుగు కత్తెర పురుగు. ఇది ష్పొడప్పార ఫుజిఫెడరా జాతికి చెందిన పురుగు.ఇది ఎనబై పంటలకు పైగా సోకే పురుగు వ్యాధి.ఐతే ఆంధ్ర ,తెలంగాణాలలో ప్రస్తుతానికి మొక్కజొన్నకి మాత్రమే సోకడం గమనించారు. అదీ కూడా 2016 లో కర్ణాటక లోని హసన్ బెలూరు, షిమోగా ప్రాంతాలలో కనుగొన్నారు.కాలక్రమేణా తమిళనాడు, , తెలంగాణా, ఆంధ్రా లకు వ్యాపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లోని 784 హెక్టార్లలో తెగులు ఉన్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు .

వ్యాప్తి

[మార్చు]

పంట తొలి దశ నుంచి కండె తయారయ్యే దశ వరకు కత్తెర పురుగు ఉధ తి ఉంటుంది. మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహరితాన్ని హరిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆవల చివర్లను తింటూ ఆకు సుడులను, మొక్క కాండాన్ని తొలిచి రంధ్రాలు చేసి, పంటకు నష్టం చేకూరుస్తుంది.[1]

నివారణా చర్యలు:

[మార్చు]

కత్తెరపురుగు బారిన పడిన మొక్కజొన్నకు కొరాజిన్‌తో వేపమందు కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి కొరాజిన్‌ 60ఎంఎల్‌, స్పైనట్రో 100 ఎంఎల్‌ను పిచికారీ చేయాలి. లేదా నాన్‌ ఎకనామికల్‌ పద్ధతిలో 9 పాళ్ల ఇసుక, ఒక పాలు సున్నం కలిపిన మిశ్రమాన్ని చేనులో వెదజల్లాలి. లేదా 10 కిలోల తవుడు, రెండు కిలోల బెల్లంను రెండు లీటర్ల నీటిలో కలిపి ద్రావణంగా చేసి ఒకరోజు నిలువ ఉంచితే ఏర్పడ్డ పులిసిన ద్రావణాన్ని, థయోడికార్బ్‌ 100 గ్రాముల చొప్పున కలిపి ఉండలుగా చేసుకొని మొగిలో వేయాలి. అలాగే ఎకరానికి 8 కిలోల విత్తనాలను శుద్ధి చేసుకొని ఇమిడాక్లోప్రిడ్‌-600 ఎఫ్‌ఎ్‌సను 4 మిల్లీలీటర్లను కిలో విత్తనానికి లేదా సైనాట్రోన్‌నిలిప్రోల్‌ 19.8 శాతాన్ని ఽథయోమిటాక్జామ్‌ను కలిపిన 4 మి.లీ., లిక్విడ్‌ను పట్టించి విత్తుకుంటే కత్తెర పురుగును నివారించవచ్చు. విత్తిన తర్వాత 2, 3 ఆకుల దశలో వేపమందు 1500 పీపీఎంను పిచికారీ చేసుకుంటే గుడ్ల దశలో ఉండే కత్తెర పురుగును నివారించవచ్చు.

పొలంలో 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసుకుంటే కత్తెర పురుగును గుర్తించే వీలు కలుగుతుంది. దీంతో కత్తెర పురుగు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుంది.[2]


బాహ్య లింకులు

[మార్చు]
  • అధికారిక వెబ్‌ http://www.fao.org/fall-armyworm/en/
  • వీడియోలు: [1] కత్తెర పురుగు నివారణ గురించి విశ్లేషణ | చేను చెలక | TNews Telugu

Jul 24, 2019  

  1. http://www.prajasakti.com/Article/Chitoor/2185791 మొక్కజొన్నకు 'కత్తెర' కాటు Posted On: Monday,November 11,2019
  2. https://www.andhrajyothy.com/artical?SID=893325 కత్తెర పురుగు అంతుచూద్దాం 30-08-2019 23:54:27