వాడుకరి:Drbsyamsundar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాపార ఒత్తిడులు
Business Pressures

business pressures

వ్యాపార మరియు వ్యాపారేతర సంస్థల చుట్టూఉన్నవాతావరణం చాలా క్లిష్టంగా మరియు కల్లోలం గా మారిపోతూఉండటాన్ని మనం గమనించవచ్చు. పర్యావరణ, సంస్థాగత మరియు సాంకేతిక అంశాలు అత్యంత పోటీ వ్యాపార వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇంతేగాక సమాచార, రవాణా, సాంకేతిక రంగాలలో వస్తున్న అనేక మార్పులు కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు, ఇంకా, ఈ కారణాలు కొన్నిసార్లు ఒక అనూహ్య పద్ధతిలో, అత్యంత త్వరగా మారిపోవడం కూడా మనం గమనించవచ్చు.

అందువలన, ఈ కొత్త వ్యాపార వాతావరణంలో త్వరగా మరియు తరచుగా స్పందించవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే, సంస్థలు తక్కువ వనరులు ఉపయోగించి, ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిఉంటుంది.

Boyett మరియు Boyett3 (1995) ఈ నాటకీయమైన పరిణామాల్ని వ్యాపార ఒత్తిడులు, లేదా డ్రైవర్లుగా నామకరణం చేసారు. సంప్రదాయ మరియు సంస్థాగత స్పందనలు ఈ కొత్త రకాల ఒత్తిడులపై ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. పాత పరిష్కార మార్గాలకు కొన్ని మార్పులు చేయదం ద్వారా గాని వాటికి అనుబంధంగా మరికొన్ని చర్యలు చేపట్టడం ద్వారా గాని లేదా ఆ పాత పరిష్కారాల్ని పూర్తిగా తొలగించి సరికొత్త మార్గాలు సృష్టించేందుకు, ముందస్తు చర్యలు చేపట్తాల్సిన అవసరం ఎంతో ఉంది.