వాడుకరి:Angajala

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేటి సమాజానికి తెలియని గాంధేయవాది

స్వర్గీయ అంగజాల వెంకటేశం గారు

----------------------------------------------------

బొబ్బిలి తాలూకా బలిజిపేట గ్రామంలో 1894 సంవత్సరంలో జన్మించి, జీవితమంతా గాంధేయ మార్గాన్నే అనుసరించి, ఆచరించి, 1975 వ సంవత్సరంలో  జయపురం (ఒరిస్సా)లో స్వర్గస్తులైయ్యారు  అంగజాల వెంకటేశంగారు.

ఎల్లప్పుడు గాంధీ టోపి, ఖద్దరు దుస్తులతో కనబడేవారు. కనుక గాంధీ వెంకటేశంగా వారి సన్నిహితులు, ఆత్మీయులు గౌరవించేవారు.

ఎక్కడో ఓ మారుమూల ఆనాటి మద్రాసు రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో బలిజిపేట అనే గ్రామంలో స్వర్గీయ అంగజాల జగ్గయ్య, నరసమ్మ దంపతుల పదిమంది సంతానంలో వెంకటేశం గారు  9 వ సంతానం. అన్నదమ్ములలో 6 వ వారు. 7 గురు అన్నదమ్ములు   ముగ్గురు అక్క చెల్లెలు కలిగినటువంటి ఉమ్మడి కుటుంబంలో, వారి తండ్రి గారైన జగ్గయ్య గారు వ్యాపార వ్యవహారాలలోనూ, సామాజిక సేవా రంగంలోనూ ప్రత్యేకత కలిగిన వారు.

వెంకటేశం గారికి వ్యాపార దృక్పథం అలపడలేదు. సామాజిక సేవాభావం తండ్రి నుండి వారసత్వంగా వారిని నడిపించింది. తల్లిదండ్రులు మరణించే నాటికి వెంకటేశం గారిది చదువుకునే వయసు.

వెంకటేశం గారి అన్నదమ్ములలో పెద్దవారు స్వర్గీయ అంగజాల అప్పారావు గారు వ్యాపార రీత్యా బలిజిపేటను వదిలి నేటి  జయపురం (ఒరిస్సా) కు రావడం జరిగింది. వారు తనతో తమ్ముళ్లను చెల్లెళ్లను కూడా జయపురం తీసుకువచ్చారు. జయపురం లో  అప్పారావు గారు ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరబడ్డారు. అది 20 వ శాతాబ్ధపు ప్రారంబం.

వెంకటేశం గారు తరచూ వారి అమ్మమ్మ గారి కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి బలిజిపేట వెళ్లి రావడంతో, వారు పుట్టిన బలిజిపేట గ్రామంతో మరింత అభిమానం పెంచుకున్నారు.

విద్యాభ్యాసం కొన్నాళ్లు బరంపురంలో జరగడం వలన అక్కడ వారి సహ విద్యార్ధి,

శ్రీ వరాహగిరి వెంకటగిరి (మాజీ రాష్ట్రపతి) గారితో స్నేహం పెరిగింది. వారి స్నేహంతో వెంకటేశం గారు గాంధేయమార్గంవైపు ఆకర్షించ బడ్డారు.

గాంధీ, నెహ్రూ వంటి జాతీయ నాయకులతో వారికి పరిచయాలు కలిగాయి. రాను రాను గాంధీగారి నాయకత్వంలో నడిచిన స్వాతంత్ర్య ఉద్యమాలలో చురుకుగా పాల్గోనేవారు.

వెంకటేశం గారి గురించి  చెప్పుకుంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి నిజమైన సేవకుడు. సేవాదృక్పదంతోనే ఆయన చివరివరకు జీవించారు

వెంకటేశం గారు తన భార్యను అత్తవారింట్లో(బలిజిపేటలోనే) ఉంచి, వారి ఆశయం లక్ష్యానికై దేశమంతా తిరుగుతూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేవారు. మధ్య మధ్యలో భార్యను చూడడానికి బలిజిపేట వచ్చేవారు. అదే సమయంలో తన రాక గమనించిన పోలీసులు గాలించేవారు. వెంకటేశం గారి బంధువులు వారిని దాన్యం నిల్వ ఉంచే గదుల్లో దాచి ఉంచి పోలీసులు వెళ్లిపోయిన తర్వాత జాగ్రత్తగా పంపించేవారు.

వెంకటేశం గారు స్వాతంత్ర పోరాటం చేసే రోజుల్లో గాంధీ గారితో నెహ్రూ గారి తో కలిసి  ఒకే జైలు జీవితం గడిపారు. అదే సమయంలో ఇందిరాగాంధీ గారు తన తండ్రి గారైన నెహ్రూ గారి ని చూచుటకు తరుచూ జైలుకు వచ్చేవారు. ఆ విధంగా ఇందిరా గాంధీ గారితో వారికి పరిచయం బాగా పెరిగింది.

వెంకటేశం గారితో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎందరో స్తానిక స్వాతంత్ర్య సమరయోధులతో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు. గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్ళనాధం, దామోదరం సంజీవయ్య,వంటి ఆంధ్రరాష్ట్ర నాయకులతో స్నేహం వుంది. నాటి ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన సదాశివ త్రిపాఠి వంటి వారు ప్రత్యేకంగా జయపురం వచ్చి వెంకటేశం గారిని కలిసేవారు.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్ళకు కు ఢిల్లీలో అప్పటి ప్రధాని  ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా వీరికి సన్మానం చేసారు. తామ్రపత్రం అందుకున్నారు.

అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గారు వీరికి ప్రియ స్నేహితులు కావడంతో వారితో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. తరచుగా ఉత్తరాలతో ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకునేవారు.

స్వాతంత్ర్య సమరయోధులకిచ్చే సదుపాయాలన్ని వెంకటేశంగారికీ లభించాయి.

స్వాతంత్రం వచ్చిన తరువాతే వెంకటేశం గారు  జయపురం లో (ఒరిస్సా) స్థిరపడ్డారు.

వెంకటేశం గారి ధర్మపత్ని క్యాన్సర్ వ్యాధితో 1960 లో మరణించినారు.

గాంధీ వెంకటశం గారికి పిల్లలు లేకపోవడం వలన దగ్గరి బంధువులను చేరదీసి చూసుకునేవారు. ఎందరో పేదలకు వారి చేతుల మీదుగా వివాహాలు జరిపించారు.

ఆనాటి తరం వారికి తెలిసిన గాంధీ వెంకటేశం గారికి రావలసినంత గుర్తింపు మాత్రం రాలేదు. తనకున్న రాజకీయ పరిచయాలను అతను వాడుకోలేదు. తన వంశంలో, అన్నదమ్ముల కొడుకుల కోసమైనా, మనుమల కోసమైనా ఎవరిని రికమండ్ చేయలేదు. నిస్వార్ధమైన రాజకీయ సేవకుడే గాంధీ వెంకటేశంగారు.

వారి గొప్పతనాన్ని గుర్తించిన  కొంతమంది తెలుగు నాయకులే  బొబ్బిలిలో ఒక పార్క్ వారి పేరుతో ఎర్పాటు చేసి, శిలాఫలకం పెట్టించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది.

ఆ మధ్యన వెంకటేశం గారి చిత్రపటాన్ని బలిజిపేట గ్రామంలో పంచాయితీ కార్యాలయంలో పెట్టించారు. అటువంటి మహానుభావుడు చివరి రోజుల్లో జయపురమే నివాసంగా  నిర్ణయించుకుని, స్వాతంత్ర్య సమరయోధులకిచ్చే సదుపాయాలన్ని జయపురానికే రప్పించుకున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో, జయపురంలో ప్రసాదరావు పేట రేషన్ డిపో వారి పేరుతోనే వచ్చింది.  కొన్ని సంవత్సరాలు వారే  సేవాదృక్పదంతోనే  దానిని నిర్వర్తించారు.

1975 వ సంవత్సరంలో జయపురం ప్రసాదరావు పేటలో వారి స్వగృహంలోనే వెంకటేశం గారు స్వర్గస్తులైయ్యారు. వారి మరణాంతరం వారి అన్నగారి కుమారుడైనా స్వర్గీయ అంగజాల సూర్యనారాయణగారికి  రేషన్ డిపో నిర్వర్తించే భాద్యత వచ్చినా వారు కూడా నిస్వార్ధంగానే దానిని మరోకరికీ బదిలిచేయించారు.

ఈ స్వాతంత్ర్య సమరయోధుని కార్మకాండ కార్యక్రమాన్ని వారి అన్నయ్యగారి మనుమడైనా శ్రీ అంగజాల నాగేశ్వరరావుగారి చేతుల మీదుగా జరిగాయి. వారి ఆశీర్వదాల బలమో,  ఎమో గాని శ్రీ అంగజాల నాగేశ్వరరావు గారు కూడా 1986 వ సంవత్సరంలో జయపురం మునిసిపాలిటి కౌసలర్గా ఎన్నికై

నిస్వార్ధ సేవలనే అందించారు

---------------------------------------------------

అంగజాల రామకృష్ణ

జయపురం (ఒడిశా)