వాడుకరి:Ammanews/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జైన‌థ్ శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ స్వామి ఆల‌యం

తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన దేవాలయం .జైనుల కాలం నాటి నిర్మాణ శైలి పోలి ఉన్న ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాకే తలమానికం. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కొలువై ఉన్న జైన ఆలయం పై ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్ జిల్లా అనగానే ఠ‌క్కున స్ఫురించేది . జైన‌థ్ ఆలయం ఇక్కడ సహజ సిద్ధంగా లభించే నల్ల రాతితో నిర్మితమైన ఈ దేవాలయానికి దాదాపు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పల్లవుల కాలంలో హర్షవర్ధనుడు దీన్ని నిర్మించినట్లుగా చెబుతారు. ఆలయ ప్రాకారాల పై ఉన్న శిలాశాసనాలు ...ఆలయంలోని గోడలపై చెక్కిన 20 శ్లోకాల‌ను బట్టి ఇది క్రీస్తుశకం 4 నుంచి 9 వ శతాబ్దంలో కట్టబ‌డినట్లుగా తెలుస్తోంది. సుమారు ఐదు శతాబ్దాల పాటు దక్షిణ భారతాన్ని ఏలిన ప‌ల్ల‌వ చక్రవర్తుల కాలంలో దీని నిర్మాణం జరిగినట్లుగా స్థ‌ల‌పురాణం చెబుతోంది. ప‌ల్ల‌వ చక్రవర్తులు శౌర్యం పరాక్రమం లోనే కాకుండా శిల్పకళానైపుణ్యం ,హ‌స్త‌క‌ళానైపుణ్యంలో కూడా సిద్ధహస్తులు. వారి కాలంలో నిర్మించిన అనేక కట్టడాలువారి శిల్పకళా వైభవాన్ని చాటి చెబుతాయి. ఈ ఆలయం కూడా అదే కోవలోకి చెందిన దిగాభావిస్తారు.

పల్లవుల కాలంలో చక్రవర్తులు హిందూధర్మ వ్యాప్తికి తోడ్పడ్డారు. వారి కాలంలోనే జైనులు దేవాలయాల నిర్మాణం, ధార్మిక ప్రాంతాల కట్టడాల‌కు పూనుకున్నారు. జైనుల నిర్మాణశైళి ఈ ఆలయంలో కనిపిస్తుంది. జైన మత ప్రచారంలో భాగంగా జైనులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ తమ ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకుని కొంత కాలం పాటు ఇక్కడ నివ‌సించిన‌ట్టు స్థ‌ల‌పురాణం బ‌ట్టి తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఈ దేవాలయం జైన‌ నిర్మాణ శైలిలో ఉండ‌టంతో ఈ ప్రాంతం జైన‌థ్ గా పిలువ‌బ‌డుతున్న‌ట్టు చెబుతారు .అనంతరం ఈ ఆలయంలో శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ స్వామివారి విగ్రహాన్ని ప్ర‌తిష్టించిన‌ట్టు తెలుస్తోంది. పల్లవులకు సూర్యభగవానుడు ఆరాధ్య దైవం కావడంతో ఆనాడు నిర్మించిన దేవాల‌య‌ల‌న్నీ తూర్పు ముఖంగానే ఉండటం విశేషం .అలాగే ఈక్షేత్రం కూడా తూర్పు ముఖంగా ఉండి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా ఉద‌య‌ భానుడి లేలేత కిరణాలు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి పాదాలను తాకుతాయి. ఆ సమయంలో గర్భగుడిలోని మూలవిరాట్టు స్వర్ణ కాంతులతో మెరిసిపోతాడు . ఈ దివ్యమంగ‌ళ‌మైన‌, అపురూపమైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ఏటా ఫిబ్రవరి ఏప్రిల్ ఆగస్టు నెలలో ..దసరా తర్వాత వచ్చే ఆశ్వీయుజ పౌర్ణమి నాడు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను ముందుగా స్ప్రుశించి మెల్లిగా పైకి ప్ర‌స‌రిస్తూ శిర‌స్సు వ‌రకూ చేరుకుంటాయి. ఈప్ర‌క్రియ దాదాపు ప‌దిహేను నిమిషాల‌పాటు సాగుతుంది. ఈ స‌మ‌యంలో స్వామి వారి నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌యం పుల‌కించి పోతుంది.

ఇక్కడ దివ్య‌మంగ‌ళ‌స్వ‌రూపుడైన స్వామివారు శంఖ చక్ర గదాధారుడుగా దర్శనమిస్తాడు. గర్భగుడిలోని సుందర మనోహర రూపం నేత్రానందాన్ని కలిగిస్తుంది .ఇక్కడికి వచ్చే భక్తులు స్వామి వారిని లక్ష్మీనారాయణుడు , నారాయణ స్వామి అని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అని పిలుస్తుంటారు. స్వామివారిని దర్శించి ...భక్తి శ్రద్ధలతో ప్రార్థించి పూజాదికాలు నిర్వహిస్తే తమ కష్టాలు తొలగిపోతాయ‌ని కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీ నారాయ‌ణుడు కొలిచిన వారికి కొంగు బంగారమ‌ని భక్తుల విశ్వాసం.

ఇక స్వామి వారి భక్తులు నియమ నిష్టలతో 41 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు.స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజున కు సరిగ్గా నలభై ఒక్క రోజుల ముందు దీక్ష మాల ధరిస్తారు .నీలి రంగు వస్త్రాలు ధరించి దీక్ష నియమాలు పాటిస్తూ రెండు పూటలా స్వామివారి పూజను కొనసాగిస్తారు. ఆ సమయంలో స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగి పోతాయి స్పాట్ : అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి దీక్ష వ్రతాన్ని చేపడతారు గత 20 ఏళ్లుగా ఈ మూల ధారణ ఆనవాయితీగా కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు.

ప్రతి ఏటా కార్తీక శుద్ధ అష్టమి మొద‌లు బహుళ సప్తమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి .పదిహేను రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో అశేష భక్త జనం తరలి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని తరిస్తుంటారు .బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. .ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోతాయి. ఇసుకేస్తే రాల‌నంత భ‌క్త‌జ‌నం స్వామి వారి సేవ‌లో పాల్గొని బ్ర‌హ్మోత్స‌వ  వేడుక‌ను తిల‌కిస్తారు. Ammanews (చర్చ) 06:34, 12 అక్టోబరు 2022 (UTC)