వాడుకరి:వయస్వి/రెయిన్ డ్రాప్ కేక్ (Raindrop cake)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/02/Mizu_Shingen_Mochi%2C_black_syrup_%2827871976812%29.jpg/220px-Mizu_Shingen_Mochi%2C_black_syrup_%2827871976812%29.jpg)
రెయిన్‌డ్రాప్ కేక్ నీటిని, అగర్‌ను వాడి తయారు చేసే ఒక డెజర్ట్, ఇది వర్షపు బిందువును పోలి ఉంటుంది. జపాన్ లో మొదటి సారి 2014లో జనాదరణ పొంది, తర్వాత అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించింది.
చరిత్ర
[మార్చు]వాస్తవానికి సాంప్రదాయ జపనీస్ డెజర్ట్ షింగెన్ మోచి (信玄餅)
పరిణామమే ఈ మిజు షింగెన్ మోచి (水信玄餅) అని పిలుచుకునే జపనీస్ డెజర్ట్.
షింగెన్ మోచి
[మార్చు]మొదటి సారి సెంగోకు యుగంలో డైమ్యో, టకేడా షింగెన్ అనే ఇద్దరు ఈ షింగెన్ మోచి ని అత్యవసర ఆహారంగా సృష్టించారు. ఇది బియ్యపు పిండిని, చక్కెరను వాడి తయారు చేసిన వంటకం. [1] [2]
మిజు షింగెన్ మోచి
[మార్చు]ఇక ఆధునిక జపాన్‌లో, హోకుటో-చోలోని స్థానికులు తాజా మినరల్ వాటర్‌ను ఈ డెజర్ట్‌లో చేర్చడం ప్రారంభించారు. యమనాషి ప్రిఫెక్చర్‌లోని కిన్సీకెన్ సీకా కంపెనీ మొదటి సారి వారాంతాల్లో తమ స్టోర్లలో దీన్ని విక్రయించటం మొదలు పెట్టింది. [3]
మిజు అంటే నీరు,షింగెన్ మోచి అనేది కిన్సీకెన్ కంపెనీ తయారుచేసిన ఒక రకమైన స్వీట్ రైస్ కేక్ ( మోచి). [4] 2013కి ముందు సంవత్సరమే ఈ వంటకపు సృష్టికర్త తినడానికి వీలైన నీటిని తయారు చేయాలనే ఆలోచనతో అన్వేషణ ప్రారంభించాడు. [4] ఈ డెజర్ట్ ఒక సంచలనం(వైరల్) గా మారింది. ఇక జనాలు ఈ వంటకాన్ని ఆస్వాదించటానికి ప్రత్యేక పర్యటనలు చేసేవారు. [5]
ఇక ఏప్రిల్ 2016 లో న్యూయార్క్ నగరంలో జరిగిన స్మోర్గాస్బర్గ్ ఫుడ్ ఫెయిర్‌లో డారెన్ వాంగ్ ఈ వంటకాన్ని యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేశాడు. [5] [6] [7] దీనికి కొంతకాలం తర్వాత, లండన్ రెస్టారెంట్ యమగోయా నాలుగు నెలలు శ్రమించి మరో వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. [5]
వివరణ
[మార్చు]ఈ డిష్ మినరల్ వాటర్ ను, అగర్ ను వాడి తయారు చేస్తారు. అందుకే ,దీంట్లో వాస్తవంగా ఎలాంటి కేలరీలు ఉండవు. [5] [6] [7] ఒరిజినల్ డిష్ లో వాడిన నీరు దక్షిణ జపనీస్ ఆల్ప్స్ యొక్క కైకోమా పర్వతం నుండి సేకరించారు. ఈ నీరు తేలికపాటి తియ్యదనం కలిగి ఉన్నట్లు వర్ణించేవారు. [4] అగర్ అనే శాఖాహారం (వేగన్) జెలాటిన్ కి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన సీవీడ్(సముద్రపు మొక్క) . [6] [8] దీన్ని వేడిచేసిన తరువాత, అచ్చుపోసి చల్ల బరుస్తారు. [6] కురోమిట్సు(kuromitsu) అనే ఒక మొలాసిస్ లాంటి సిరప్ ను, కినాకో(kinako) అనిపిలుచకునే సోయాబీన్ పిండిని టాపింగ్స్ గా ఉపయోగిస్తారు. [5] [6] [7] ఈ వంటకం పారదర్శకమైన వర్షపు బిందువులా కనిపించినప్పటికీ దీన్ని రొమ్ము ఇంప్లాంట్ల తోను, జెల్లీ ఫిష్‌లతో పోలుస్తారు. పెద్ద రుచిలేని ఈ డెజర్ట్ నోటిలోకి ప్రవేశించగానే కరిగిపోతుంది. అందుకే దీన్ని తక్షణమే తినాలి లేకపోతే ఇది ఇరవై నిమిషాలు అయ్యే సరికి కరిగి ఆవిరైపోతుంది. [5] [7]
డెజర్ట్‌ను ఇంట్లో తయారు చేసుకోవడానికి కిట్ల రూపంలో కూడా విక్రయిస్తారు. [8] ఈ వంటకాన్ని అమెరికన్ ప్రధాన మీడియా లైన ది టుడే షో, బజ్‌ఫీడ్, ABC న్యూస్ లు కూడా ప్రదర్శించాయి. [8]
ఇది కూడ చూడు
[మార్చు]ప్రస్తావనలు
[మార్చు]
బాహ్య లింకులు
[మార్చు]Media related to Raindrop cake at Wikimedia Commons
- ↑ "信玄餅 | 金精軒". 金精軒 | 山梨県北杜市で和菓子屋を営んでおります。 (in జపనీస్). 2011-01-31. Retrieved 2021-07-18.
- ↑ "Raindrop Cake, A Low Calorie Japanese Dessert You Need To Try!". Honest Food Talks (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-06-01. Retrieved 2021-07-18.
- ↑ "2019年 水信玄餅をお求めの方へ | 金精軒". 金精軒 | 山梨県北杜市で和菓子屋を営んでおります。 (in జపనీస్). 2019-05-01. Retrieved 2021-07-18.
- ↑ 4.0 4.1 4.2 "Mizu Shingen Mochi: Water You Can Eat?". Japan Info. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Japan Info" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Maitland, Hayley (2018-08-14). "Everything You Need To Know About Raindrop Cakes". British Vogue. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Maitland 2018" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 6.0 6.1 6.2 6.3 6.4 "What is a Raindrop Cake – How to Make a Raindrop Cake". Delish. 2018-03-13. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Delish 2018" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 7.0 7.1 7.2 7.3 Strutner, Suzy; Aiken, Kristen (2016-03-31). "Get Ready, This Magical Raindrop Cake Is Coming To America". HuffPost. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Strutner Aiken 2016" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 8.0 8.1 8.2 "Raindrop Cake Making Kit". Raindrop Cake. 2017-08-08. Retrieved 2018-08-16. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Raindrop Cake 2017" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు