వాడుకరి:కోగిల చంద్రమౌళి
Jump to navigation
Jump to search
ప్లవనామ.. విప్లవమై రావాలి..!
కోగిల చంద్రమౌళి
[[1]]
తరతరాల నా..
క్షుతి తీరకుండానే
వసంతాగమనం జరుగుతుంది..!
రుతు మార్పిడి తప్ప
ఎండిన డొక్కలగోల
ఎప్పటి తీరే..!
ఋతువులతో యుద్ధంచేసి
పుడమిని సింగారించడంలో
మోడువారిన బతుకుల్లో
ఇంకా ఏఆశలు
చిగురించనేలేదు..!
జాతకంలో సైతం అదే
కొనసాగింపు..!
రాజపూజ్యం/అవమానం
ఆదాయ/ వ్యయాలు
మరోమారు..హీన పక్షమే..!
పచ్చడిలో మాత్రమే షడ్రుచులు
బతకెప్పుడు.. ఇకారమే..!
ఇంగ్లీష్ /తెలుగు
వత్సరాలు ఏవైనా/
తేదీలకే మైలురాళ్లు..!
శ్రామిక జనజీవనం మాత్రం
కంకర తేలిన సడుగే..!
నాలో ఆశల్లాగే ఈ పుడమి మళ్ళీ చిగురిస్తుంది..!
చిగుళ్లతో "నే" సంసిద్ధమవుతాను..!
"తరతరాల శ్రమదోపిడికి"
ఈ ప్లవనామైనా..
విప్లవమై వస్తుందనే
కొంగొత్త ఆశలతో...!
శ్రీ ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం..!!