వర్మ కలిదిండి
స్వరూపం
వర్మ కలిదిండి | |
---|---|
జననం | కలిదిండి నాగ వెంకట మల్లిఖార్జున వర్మ 1975 సెప్టెంబరు 11 పొలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, |
వృత్తి | అధ్యాపకుడు రచయిత, చరిత్ర పరిశోధకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | హారిక |
పిల్లలు | యశస్విని |
తండ్రి | వెంకట కృష్ణం రాజు |
తల్లి | సుబ్రమణ్యేశ్వరి |
వర్మ కలిదిండి అసలు పేరు కలిదిండి నాగ వెంకట మల్లిఖార్జున వర్మ. యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.
జననం
[మార్చు]ఈయన సుబ్రమణ్యేశ్వరి, వెంకట కృష్ణం రాజు దంపతులకు 1975 సెప్టెంబర్ 11న పొలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
[మార్చు]ప్రస్తుత నివాసం భీమవరం. పాలిటెక్నిక్ చదువుని మధ్యలోనే ఆపేశారు.
ప్రస్తుతం మినరల్స్ ట్రేడింగ్, విదేశీ వ్యాపారాల ఏజంటు గానూ వ్యవహరిస్తూ సొంత సంస్థని నిర్వహిస్తున్నారు.
భార్య - పిల్లలు
[మార్చు]భార్య: హారిక కూతురు: యశస్విని.
ప్రచురితమయిన మొదటి కవిత
[మార్చు]మొదటి కవిత "కాలం" మే 1993 ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమైంది.
ప్రచురితమయిన పుస్తకాల జాబితా
[మార్చు]- నేను మాత్రం ఇద్దరిని (తొలి సంకలనం) ప్రచురణ డిసెంబరు -2014.
" గోదారి పలకరింపు " (రెండవ కవితా సంకలనం) ప్రచురణ ఫిబ్రవరి-2018
బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు
[మార్చు]- కవి సంగమం కవిగా గుర్తింపు.
- 2013 ప్రముఖ కవి "యశస్వీ సతీష్" గారి "ఒక చిన్న మాట" (150 మంది తెలుగు కవుల పరిచయం) పుస్తకంలో చోటు.
- 2014 ప్రముఖ కవి విమర్సకుడు "నారాయణ శర్మ" గారి "ఈ నాటి కవిత" 75 కవితలపై విమర్స విశ్లేషణలో "గుప్పెడు మన్ను-ఆకుపచ్చని కల"కి చోటు.
- 12.07.2015 శ్రీ పద్మినీపుర కళా పీఠం-గణపవరం వారిచే నిర్వహించబడిన పుష్కర కవి సమ్మేళనంలో కవితా గానం సత్కారం.
- 19.07.2015 తెలుగు సాహితీ సమాఖ్య-తాడేపల్లిగుడెం వారిచే నిర్వహించబడిన పుష్కర కవి సమ్మేళనంలో కవితా గానం సత్కారం.
- 23.07.2015 గోదావరి మహా పుష్కర కవితోత్సవం -రాజమండ్రి "శ్రీ తనికెళ్ళ భరణి" గారి చేతులమీదుగా సన్మానం
- 09.08.2015 "నక్షత్రాలు దూసిన ఆకాశం" కవిత "సాక్షి" ప్రచురణ, సాహితి స్రవంతి ద్వితీయ వార్షికోత్సవ సభ-కాకినాడలో కవితా పఠనం
- 06.04.2016 నన్నయ తెలుగు యూనవర్సిటీ-రాజముండ్రి వారిచే "ఉగాది గౌరవ అతిధి పురస్కారం".
- కందుకూరి వీరేశలింగం పంతులు అస్థిక కళాశాల-రాజమండ్రి నందు శ్రీశ్రీ కళా వేదిక వారిచే "ఉత్తమ కవి" "ఉత్తమ కవితా సంపుటి నేను మాత్రం ఇద్దరిని" పురస్కార ప్రధానం.
- 30.06.2017 రాజముండ్రి రోటరీ క్లబ్బు నందు " ఆంధ్ర సారస్వత పరిషత్తు" "ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమీషన్" అధ్యక్షులు "తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు" శ్రీ.పొట్లూరి హరికృష్ణ గారిచే యాబై సార్లు రక్తదానం చేసినందుకు గాను "జాతీయ యువ సేవా పురస్కారం-2017" ప్రదానం.
- "గోదారి పలకరింపు" కవితా సంకలనం ఖమ్మం నందు నవరత్నాల పురస్కారం దక్కింది
ఇతర వివరాలు
[మార్చు]- 2003 నుంచి విదేశీ వ్యాపారాల బాధ్యతల నిర్వహణ.
- విదేశీ వ్యాపారాలకు భయర్ అండ్ సెల్లర్ ఏజంటుగా ఉంటూ పూర్తి బాధ్యతా నిర్వహణ.
- పేరుపొందిన సుమిటమో మిట్సూయ్, మాయ ఐరన్ ఓర్స్ వంటి సంస్థలకు కన్సల్టెంట్ పనిచేసారు.
- ధనంజయ ఇంపెక్స్ లో ఆరు సంవత్సరాలు ఫారెన్ ట్రేడింగ్ డాక్యుమెంట్స్ ఎజ్సిక్యూటివ్ గానూ, మార్కెటింగ్ మానేజరుగా పనిచేసారు.
అభిరుచులు
[మార్చు]సాహిత్యపఠనం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జీవితం పై అవగాహన పెంపొందించుకునే ప్రయత్నంలో అనుభూతులను అప్పుడప్పుడు కవిత్వీకరించడం.
చిత్రమాలిక
[మార్చు]ఇతర లంకెలు
[మార్చు]- చెరుకువాడ బ్లాగ్
- యూట్యూబ్ లో వర్మ కలిదిండి కవిత్వ పఠన వీడియో
- వర్మ కలిదిండి ఫేస్ బుక్ అకౌంట్
- కవితా కెరటం కలిదిండి వర్మ 10టివి అక్షరం కార్యక్రమం
మూలాలు
[మార్చు]- నేను మాత్రం ఇద్దరిని పుస్తకంపై శ్రీరామోజు హరగోపాల్ గారి విశ్లేషణ