Jump to content

వర్గం:వ్యవసాయ పనిముట్లు

వికీపీడియా నుండి

వ్యవసాయంలో వాడే పనిముట్లన్నీ ఈ వర్గం క్రిందకు వస్తాయి.

పొలంలో వున్న ఎద్దులబండి, దామలచెరువులో తీసిన చిత్రం.

ఎద్దుల బండి... ఇది కూడ రైతులకు, అతి ముఖ్యమైన పరికరమే. వ్వవసాయ ఉత్పత్తులను పొలాల నుండి ఇంటికి తీసుక రావడానికి ఇంటి వద్దనుండి, పశువుల ఎరువలను, ఎరువులను పొలాలకు తీసు కెళ్ళడానికి ఇదెంతో అవసరం. ఎద్దులతో నడిచే ప్రయాణ సాధానాన్ని అవసరాన్ని బట్టి మనుషుల రవాణాకు కూడ ఉపయోగించె వారు రైతులు. దీని విడి భాగాలు: 1. రెండు చక్రాలు, 2. పట్ట: చక్రాల చుట్టు వేసె ఇనుప పట్టా, 3. నొగ : మద్యలో వుండే పొడవాటి కర్ర: దాని పేరు నొగ, 4. పారు పట్టిలు. నొగకు ఇరువైపులా వున్న కర్ర పట్టీలను 'పారు పట్టీలు' అంటారు, 4.ముక్కెన: నొగకు చివరన భూమికి ఆనించే కర్రను ముక్కెన అని అంటారు. 5.దిమ్మ: నొగ, పారు పట్టిలకు మద్యలో అడ్డంగా వున్న పెద్ద కర్ర దుంగను దిమ్మ అని అంటారు. 6. ఇరుసు: ఆ దుంగలో నుండి చక్రాలకు అనుసందానం చేయబడినది ఇరుసు. 7. కడిసెల చక్రాలలో నుండి ఇరువైపుల కొంత బయటికి వచ్చిన ఇరుసుకున్న చిన్న రంద్రాలలో .... బండి నడుస్తున్నప్పుడు చక్రం బయటకు రాకుండా అడ్డుకునేది కడిసెల. 8. కూసులు: పారి పట్టి లుకు ఒక్కోదానికి ఆరు చొప్పున చిన్న రంద్రాలు చేసి అందులో దూర్చిన సన్నని రెండడుగుల పొడవున్న కర్రలు కూసులు. బండిలో వేసిన సరకుకులు పక్కకి జారి పోకుండా అడ్డుకోడానికి ఇవి ఉపయోగ పడతాయి. మనుషులు కూర్చున్నప్పుడు బండి కుదుపులకు వారు పడి పోకుండా వీటిని పట్టుకొని కూర్చుంటారు. 9. కుండ: చక్రానికి మద్యలో ఇరుసు పెట్టడానికి గుండ్రటి కర్రదుంగను 'కుండ' అంటారు. 10. వంపులు: ఎనిమిది అంగుళాల ఎత్తు కలిగి రెండంగుళాల మందాన వున్న కర్ర పలకలను వంపులు అంటారు. ఇవి ఒక్కో చక్రానికి ఆరు వుంటాయి. ఈ ఆరు కలిపితే చక్రాకారం వస్తుంది. 11. పట్టి: ఈ వంపులకు వెలుపలివైపున కర్ర చక్రం అరిగి పోకుండా వుండేది పట్టి. ఇది ఇనుము చేసినది. 12. కాడి మాను: సుమారు ఆరు అడుగుల పొడవుండి, మద్యలో ఒక అడుగు కైవారం కలిగి చివరలన కొంత సన్నగా వుండి దానికి ఇరువైపులా రెండు చిన్న రంద్రాలుంటాయి. దీనిని ఎద్దుల మెడపై పెట్టి ఆరంద్రాలలో పలుపులు వేసి ఎద్దుల మెడకు తగిలిస్తారు. అది కాడి మాను. 13. మక్కెన: విడి వస్తువులు అనగా పశువుల ఎరువు, మట్టి మొదలైన్ వాటి రవాణ కొరకు బండిలో వేసె వెదురు బద్దలతో చేసిన పెద్ద బుట్ట వంటిదె మక్కెన: 14. కందెన: ఇరుసు అరిగి పోకుండా దానికి కందెన వేయాలి. దానిని ఆముదపు గింజలను కాల్చి మెత్తగా నూరి తయారు చేస్తారు. ఇది వేస్తే బండి సులబంగా కదులుతుంది. దీనినుండే పుట్టినది సామెత: ఇరుసున కందెన పెట్టక పరమేసుని బండియైన పారదు సుమతీ.... బండి పై వెదురు బద్దలతో చేసిన చాప ను గూడు లాగ ఏర్పాటు చేసి వుంచు తారు దీన్ని గూడు బండి అంటారు. ఇది సంతలకు సరకుల రవాణాకు, మనుషుల రవాణాకు వాడుతారు. ఇది ఎద్దుల బండి సమగ్ర రూపం, ఉపయోగం. ప్రస్తుతం ఈ ఎద్దుల బండ్లు చాల అరుదుగా కనబడుతున్నాయి. దానికి కారణం, వ్వవసాయం లో యంత్ర పరికరాల వుపయోగం పెరిగి పోవడవం వంటివి కారణాలు కావచ్చు. పైగా ట్రాక్టర్లు వచ్చాక అవి ఎద్దులు, నాగలి, బండి ఇవన్నీ చేసె పనిని వాటికన్న తొందరగా, సులబంగా చేసేస్తున్నాయి. ఆ కారణంగా ఎద్దుల బండ్లు కనుమరుగై పోతున్నాయి.

పొలం దున్నుతున్న ట్రాక్టరు, దామల చెరువు పొలంలో తీసిన చిత్రం

ఏతము కపిలి/మోట గూడ నాగలి కొడవలి గొడ్డలి పార గునపము/గడ్డపార పిక్కాసు [[ములుగర్ర] కత్తి తొలిక చెర్నాకోల/జాటీ వడిసెల గుంటక

వర్గం "వ్యవసాయ పనిముట్లు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 13 పేజీలలో కింది 13 పేజీలున్నాయి.