వరుణ్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ్ చౌదరి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రతన్ లాల్ కటారియా
నియోజకవర్గం అంబాలా

హర్యానా శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
నవంబర్ 2019 – 15 జూన్ 2024[1]
ముందు సంతోష్ చౌహాన్ సర్వాన్
తరువాత ఖాళీ
నియోజకవర్గం మూలానా

వ్యక్తిగత వివరాలు

జననం 1979/1980 (age 43–44)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఫూల్ చంద్ ముల్లానా
నివాసం అంబాలా, హర్యానా , భారతదేశం
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం

వరుణ్ చౌదరి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో, వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వరుణ్ చౌదరి హర్యానా లోని అంబాలాలో జన్మించాడు. అతను 2006లో ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ లాస్ పూర్తి చేసి, ఆ తర్వాత అంబాలా కోర్టులో న్యాయవాదిగా కొంతకాలం ప్రాక్టీస్ చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వరుణ్ చౌదరి తన తండ్రి ఫూల్ చంద్ ముల్లానా అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో , ములానా నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజ్‌బీర్ సింగ్‌పై 1,688 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2021 మార్చిలో 'ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు'ను అందుకున్నాడు.[3] అతను 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో, వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పై 49,036 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Amar Ujala (15 June 2024). "Haryana: अंबाला के नवनिर्वाचित सांसद वरुण चौधरी ने विधायक पद से दिया इस्तीफा, नहीं होगा उपचुनाव". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results -Ambala". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  3. The Telegraph (19 March 2021). "2 MLAs get Best Legislator Award". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  4. TV9 Bharatvarsh (5 June 2024). "अंबाला लोकसभा सीट से जीतने वाले कांग्रेस के वरुण चौधरी कौन है, जानिए अपने सांसद को". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)