వడ్డేపల్లి చెరువు
స్వరూపం
వడ్డేపల్లి చెరువు | |
---|---|
ప్రదేశం | వడ్డేపల్లి, హనుమకొండ మండలం, హన్మకొండ జిల్లా, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°59′37″N 79°31′15″E / 17.993662°N 79.520878°E |
రకం | జలాశయం |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఘనీభవనం | No |
వడ్డేపల్లి చెరువు, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా హనుమకొండ మండలం, వడ్డేపల్లి గ్రామంలో ఉన్న చెరువు. ఇది హన్మకొండ, కాజీపేట ప్రాంతాల ప్రజలకు తాగునీటిని అందిస్తుంది.[1]
చరిత్ర
[మార్చు]కాకతీయ రాజులకాంలో సాగు, తాగునీటి అవసరాలకోసం వడ్డేపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందించడమేకాకుండా, ప్రజలకు తాగునీటిని అందిస్తుంది. అందుకోసం ఇది 1993లో సమ్మర్ స్టోరేజ్‌గా అభివృద్ధి చేయబడింది.[2]
పర్యాటకప్రాంతంగా
[మార్చు]వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. చెరువు మధ్యలోకి వెళ్ళేందుకు వీలుగా దారిని, చెరువును చూసేందుకు రెండు వ్యూ పాయింట్లను ఏర్పాటుచేశారు. ఈ చెరువు పక్కన శివాలయం కూడా ఉంది. ఇది చేపలు పట్టడానికి అనువైన ప్రాంతం. దీనిని తెలంగాణ ప్రభుత్వం జలాశయంగా గుర్తించింది.[3]
ఇతర వివరాలు
[మార్చు]- ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ సందర్భంగా చెరువు దగ్గర మహిళలు బతుకమ్మ ఆట అడుతారు.[4]
- ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), మున్సిపల్ కార్పోరేషన్ సంయుక్తంగా వడ్డేపల్లి కట్టపై మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుచేసి కట్టపై వివిధ రకాల మొక్కలు నాటించారు.
- ఇక్కడ సినిమాలు, సీరియల్స్, లఘు చిత్రాలకు సంబంధించిన షూటింగులు జరుగుతాయి.
- ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకర్లతో బండ్ కట్ట రద్దీగా ఉంటుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Telangana (13 May 2016). "Devadula water to quench thirst of Warangal, Kazipet, Hanamkonda". Archived from the original on 13 డిసెంబరు 2019. Retrieved 15 December 2019.
- ↑ 2.0 2.1 నవతెలంగాణ, వరంగల్ (7 April 2019). "కాజీపేట షాన్.. వడ్డేపల్లి బండ్". NavaTelangana. Archived from the original on 15 డిసెంబరు 2019. Retrieved 15 December 2019.
- ↑ Deccan Chronicle, Telangana (12 June 2015). "Waddepally tank beautification left midway". Archived from the original on 15 జూన్ 2015. Retrieved 15 December 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, వరంగల్ (10 October 2018). "బతుకమ్మ సంబురాలు". www.andhrabhoomi.net. Archived from the original on 15 డిసెంబరు 2019. Retrieved 15 December 2019.