వందనా వైద్య
స్వరూపం
వందనా వైద్య పాఠక్ | |
---|---|
![]() వందనా వైద్య (2022) | |
జననం | వందనా వైద్య |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నీరజ్ పాఠక్ |
పిల్లలు | 2 |
వందనా వైద్య పాఠక్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. ఖిచ్డీ ఫ్రాంచైజీలో జయశ్రీ పరేఖ్ పాత్రకు ప్రసిద్ధి చెందింది. సాథ్ నిభానా సాథియా అనే సీరియల్ లో గౌరా అనే పాత్రను పోషించింది.[1]
జననం
[మార్చు]వందనా వైద్య గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జన్మించింది.[2] వందన తండ్రి అరవింద్ వైద్య గుజరాతీ నటుడు.
నటనారంగం
[మార్చు]1995లో టెలివిజన్‌లోకి అడుగుపెట్టి, హమ్ పాంచ్ సీరియల్ లో మీనాక్షి మాథుర్ పాత్రలో నటించి స్టార్‌డమ్ సంపాదించింది. గుజరాతీ నాటకాల్లో కూడా నటించింది.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అప్నే, గుమ్నామ్ (2008), రైట్ యా రాంగ్ (2010) వంటి చిత్రాలను రూపొందించిన రచయిత-దర్శకుడు నీరజ్ పాఠక్‌తో వందన వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (యష్), ఒక కుమార్తె (రాధిక) ఉన్నారు.[4]
టెలివిజన్
[మార్చు]- హమ్ పాంచ్ (1995–1996, 2005–2006)
- ఏక్ మహల్ హో సప్నో కా (1999–2002)
- ఖిచ్డీ (2002-2004)
- యే మేరీ లైఫ్ హై (2004–2005)
- ఇన్‌స్టంట్ ఖిచ్డీ (2005)
- మెయిన్ కబ్ సాస్ బనూంగి (2008–2009)[5]
- మిస్సెస్ & మిస్టర్ శర్మ అలహాబాద్‌వాలే (2010–2011)
- ఆర్కే లక్ష్మణ్ కి దునియా (2011–2013)గా
- మహిసాగర్ (2014–2015)
- బడి దూర్ సే ఆయే హై (2014–2015)
- సాథ్ నిభానా సాథియా (2015–2016; 2016–2017)
- సావిత్రి దేవి కాలేజ్ & హాస్పిటల్ (2017–2018)
- ఖిచ్డీ కిచిడి (2018)
- యే తేరీ గలియన్ (2018)
- మన్మోహిని (2018–2019)
సినిమాలు
[మార్చు]- గోల్కేరి (2020, గుజరాతీ)
- కెహ్వత్‌లాల్ పరివార్ (2022, గుజరాతీ)
మూలాలు
[మార్చు]- ↑ Maheshwri, Neha (12 November 2011). "Vandana Pathak on new TV show". The Times of India. Archived from the original on 11 April 2013. Retrieved 2023-01-22.
- ↑ "Makarsankranti celebration in RK Laxman..." The Times of India. 14 January 2012. Archived from the original on 11 April 2013. Retrieved 2023-01-22.
- ↑ "Vandana Pathak Biography". Archived from the original on 2016-03-04. Retrieved 2023-01-22.
- ↑ "Will the real Jayshree please stand up?". MiD DAY. 1 October 2010. Retrieved 2023-01-22.
- ↑ "Talking point with Vandana Pathak". The Indian Express. 8 September 2008. Retrieved 2023-01-22.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వందనా వైద్య పేజీ