వండివాష్ యుద్ధం
వండివాష్ యుద్ధం | |||||||
---|---|---|---|---|---|---|---|
ఏడు సంవత్య్సరాల యుద్ధంలో భాగము | |||||||
వండివాష్ కోట | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
ఈస్టిండియా కంపెనీ | ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ మరాఠా సామ్రాజ్యం | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
సర్ ఐర్ కూట్ | కామ్టే డి లాలీ | ||||||
బలం | |||||||
1,900 ఐరోపా ఇన్‌ఫాంట్రీ 2,100 భారత సిపాయీలు 80 ఐరోపా ఆశ్వికదళం 250 భారతీయ ఇన్‌ఫాంట్రీ 26 ఫిరంగులు | 2,250 ఐరోపా ఇన్‌ఫాంట్రీ 1,300 భారత సిపాయీలు 300 ఐరోపా ఆశ్వికదళం 3,000 మరాఠీ ఇన్‌ఫాంట్రీ 16 ఫిరంగులు | ||||||
వాండివాష్ యుద్ధం 1760 లో భారతదేశంలో ఫ్రెంచి, బ్రిటిషు వారి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధం ఫ్రెంచి బ్రిటిషు వలస సామ్రాజ్యాల మధ్య జరిగిన మూడవ కర్నాటిక్ యుద్ధంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సెవెన్ ఇయర్స్ వార్‌లో భాగం. ఇది తమిళనాడులోని వందవాసి (వండివాష్ అనేది ఆంగ్లీకరించిన ఉచ్చారణ [1] ) వద్ద జరిగింది. బెంగాల్, హైదరాబాదులలో గణనీయమైన విజయాల వల్ల, బ్రిటిషు వారు పెద్ద మొత్తంలో సంపదను సేకరించడంతో, వాండివాష్‌లో ఫ్రెంచివారిని ఎదుర్కోవడానికి వారు పూర్తిగా సన్నద్ధమయ్యారు.
యుద్ధ క్రమం
[మార్చు]రచయిత ఎడ్వర్డ్ కస్ట్ రచించిన 19వ శతాబ్దపు అన్నల్స్ ఆఫ్ ది వార్స్ ఆఫ్ ది ఎయిటీన్త్ సెంచరీ ప్రకారం, ఫ్రెంచ్ సైన్యంలో 300 మంది యూరోపియన్ అశ్వికదళం, 2,250 మంది యూరోపియన్ పదాతిదళం, 1,300 మంది సిపాయిలు (భారత సైనికులు), 3,000 మంది మరాఠాలు ,16 ఫిరంగిదళాలు ఉన్నాయి. బ్రిటిషు వారి పక్షంలో సుమారు 80 యూరోపియన్ గుర్రాలు, 250 స్థానిక గుర్రాలు, 1,900 యూరోపియన్ పదాతిదళం, 2,100 సిపాయిలు, 26 ఫిరంగులూ ఉన్నాయి.[2]
యుద్ధం
[మార్చు]కామ్టే డి లాలీ నేతృత్వంలోని ఫ్రెంచ్ వారు నౌకాదళ మద్దతు లేకపోవడం, నిధుల కొరత కారణంగా ఇబ్బంది పడ్డారు.[3] అందువల్ల ఇప్పుడు తమిళనాడులో ఉన్న వందవాసి కోటను తిరిగి సాధించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారికి సర్ ఐర్ కూట్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాల దాడి ఎదురైంది. అప్పుడు జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్ వారు నిర్ణయాత్మకంగా ఓడిపోయారు.
అనంతర పరిణామాలు
[మార్చు]వాండివాష్ యుద్ధం ఫలితంగా చెట్పట్టు (చెట్‌పేట్), తిరునోమలై (తిరువణ్ణామలై), తిండివనం, పెరుముక్కల్‌లను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. [4] ఈ యుద్ధం పర్యవసానంగా, జనరల్ మార్క్విస్ డి బుస్సీ-కాస్టెల్‌నౌ నేతృత్వంలోని ఫ్రెంచివారి పాలన దక్షిణ భారతదేశంలో పాండిచ్చేరి వరకే పరిమితమయ్యారు, అక్కడ వారు ఎనిమిది నెలల పాటు పాండిచ్చేరిని రక్షించుకున్న తర్వాత 1761 జనవరి 22 న లొంగిపోయారు. భారతదేశంలో ఫ్రెంచి స్థానం పతనంతో పారిస్ ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. భారతదేశంలో ఫ్రెంచివారి స్థానం దాదాపు మామూలు వ్యాపారుల స్థాయికి పడిపోయింది. ఇక్కడ ఫ్రెంచి వలస రాజ్యాన్ని స్థాపించుకునే ఆశలు తుడీచిపెట్టుకు పోయాయి. మరోవైపు, ఈ యుద్ధం తర్వాత బ్రిటన్ భారతదేశంలో ఇతర ఐరోపా శక్తులపై తన ఆధిపత్యాన్ని స్థాపించుకుంది.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఏడు సంవత్సరాల యుద్ధంలో గ్రేట్ బ్రిటన్
- ఏడేళ్ల యుద్ధంలో ఫ్రాన్స్
మూలాలు
[మార్చు]- ↑ Heritage History – List of Battles Archived 11 జూలై 2011 at the Wayback Machine, retrieved 30 September 2008
- ↑ Eduard Cust (1862). Annals of the wars of the eighteenth century, compiled from the most authentic histories of the period, Volume 3.
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mullen, Jr., Thomas J. (2006-08-21). "Seven Years' War: Battle of Wandiwash". HistoryNet (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-26.
- ↑ John Henry Garstin, Lawrence Asylum Press (1878) (1878). Manual of the South Arcot district. Madras.
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Ramakrishnan, T. (2022-12-22). "The famous Battle of Wandiwash 'which gave India' to the British". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-12-26.