Jump to content

వంటేరు వేణుగోపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
వంటేరు వేణుగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2004
ముందు కలికి యానాది రెడ్డి
తరువాత మాగుంట పార్వతమ్మ
నియోజకవర్గం కావాలి

వ్యక్తిగత వివరాలు

జననం 1950
కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరి[1] 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం  పని చేశాడు. వంటేరు వేణుగోపాల్‌రెడ్డి 2024 మార్చి 15న పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తిలో వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,  పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యులు పదవికి రాజీనామా చేశాడు.[2][3]

వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి మార్చి 16న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (9 April 2014). "టీడీపీకి వంటేరు ఝలక్". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
  2. Eenadu (16 March 2024). "వైకాపాకు రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
  3. A. B. P. Desam (15 March 2024). "నెల్లూరులో వైసీపీ చేజారిన మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంటేరు రాజీనామా". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  4. Prajashakti (16 March 2024). "టిడిపిలోకి మాజీ ఎంఎల్‌ఎ వంటేరు". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.