వంగ‌ల‌పూడి అనిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంగ‌ల‌పూడి అనిత
వంగ‌ల‌పూడి అనిత


2024 జూన్ నుండి హోం మంత్రి బాధ్యతలు
నియోజకవర్గం పాయకరావుపేట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు
పదవీ కాలం
2024 జూన్ 12 నుండి – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1984-01-01) 1984 జనవరి 1 (వయసు 40)
లింగరాజుపాలెం గ్రామం, ఎస్.రాయవరం మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం విశాఖపట్నం
పూర్వ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ

వంగ‌ల‌పూడి అనిత, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభకు జరిగిన ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2024 ఎన్నికలలో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వంగ‌ల‌పూడి అనిత 1984 జనవరి 1 న ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు వంగలపూడి అప్పారావు. ఆమె 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం.ఏ. ఎం.ఇడి పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో రాజకీయాల్లో అడుగుపెట్టింది.

రాజకీయ జీవితం

[మార్చు]

వంగలపూడి అనిత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్సార్‌సిపి అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. ఆమె 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది.[1] అనిత 2019 ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేటి వ‌నిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.[2][3] ఆమె 2021 జనవరి 30 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.[4]

హోం మంత్రిగా బాధ్యతలు

[మార్చు]

ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పాయకరావుపేట నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, జూన్ 12 2024 న నారా చంద్రబాబునాయుడు నాలుగో మంత్రివర్గంలో హోం మంత్రిగా భాధ్యతలు చేపట్టింది.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  2. TV9 Telugu, TV9 (18 October 2019). "అనితా ఓ అనితా..! నీ సెగ్మెంట్ ఎక్కడ? Defeated TDP MLA Anitha in search of assembly constituency". TV9 Telugu. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (5 April 2019). "'రౌడీయిజం..గూండాయిజంపై షర్మిల మాట్లాడడం హాస్యాస్పదం'". www.andhrajyothy.com. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.
  4. News18 Telugu (6 March 2020). "పంతం నెగ్గించుకున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు..." News18 Telugu. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (12 June 2024). "చంద్రబాబు టీమ్‌ ఇదే.. కొత్త మంత్రుల వివరాలు ఇలా." Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  6. BBC News తెలుగు (12 June 2024). "ఏపీ క్యాబినెట్‌లో మహిళా మంత్రులు.. ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఎలా మంత్రులయ్యారు". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  7. Andhrajyothy (13 June 2024). "అనిత అనే నేను..." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.