Jump to content

వంగాల ఈశ్వరయ్య

వికీపీడియా నుండి
వంగాల ఈశ్వరయ్య
వంగాల ఈశ్వరయ్య గౌడ్
వి. ఈశ్వరయ్య
జననం10 మార్చి 1951
జాతీయత భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్

జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వంగాల ఈశ్వరయ్య 1951 మార్చి 10న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, నెమిలికాలవ గ్రామం లో వంగాల అంజయ్య గౌడ్, లక్ష్మి నరసమాంబ దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వలిగొండ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో, రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ సిటీ సైన్స్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుండి లా పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

వంగాల ఈశ్వరయ్య 1978లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి హైదరాబాద్ లోని హై కోర్ట్, సివిల్ కోర్ట్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్ & రాజ్యాంగం పరమైన కేసులను వాదించేవాడు. అయన 1990 జనవరి నుండి 1994 డిసెంబరు వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. వంగాల ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా 1999 మే 17 నుండి 2000 ఏప్రిల్ 20 వరకు పనిచేసి, ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి 2012 జూన్ 04 నుండి 2012 జూన్ 24వరకు తిరిగి 2013 మార్చి 08నుండి వరకు ఆయన రిటైర్డ్ అయ్యే 2013 మార్చి 09 వరకు పనిచేసి రిటైర్డ్ అయ్యాడు.[2]

జస్టిస్‌ ఈశ్వరయ్య పదవీ విరమణ అనంతరం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్‌గా 2013 సెప్టెంబరు 23న నియమితుడయ్యాడు.[3] ఆయన ఈ పదవిలో మూడేళ్ళ పాటు పనిచేశాడు.ఆయన 2013లో ‘ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌’ సంస్థను స్థాపించాడు. జస్టిస్‌ ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ v చైర్మన్‌గా 2019 సెప్టెంబరు 19న నియమితుడై, సెప్టెంబరు 25న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Appointment of NCSC, NCBC Chairpersons by year end: Thaawar Chand Gehlot". 3 November 2016.
  2. Tshc (2021). "THE HON'BLE SRI JUSTICE V. ESWARAIAH". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
  3. "Eswaraiah new chief of backward classes panel". Business Standard. 23 September 2013. Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  4. Sakshi (13 September 2019). "ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ ఈశ్వరయ్య". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
  5. Andrajyothy (26 September 2019). "విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు: జస్టిస్‌ వి.ఈశ్వరయ్య". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
  6. Sakshi (18 October 2019). "పూలే వెలుగులో..అంబేద్కర్‌ అడుగుజాడల్లో." Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.