ల్యాండ్ రోవర్
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ల్యాండ్ రోవర్ అనేది ప్రధానంగా నాలుగు చక్రాల డ్రైవుతో, ఆఫ్-రోడ్ సామర్థ్యం గల బ్రిటిషు వాహనాల బ్రాండు. ఇది బహుళజాతి కార్ల తయారీ సంస్థ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థ 2008 లో భారతదేశానికి చెందిన టాటా మోటార్స్‌కు అనుబంధ సంస్థగా మారింది. జెఎల్ఆర్ ప్రస్తుతం బ్రెజిల్, చైనా, ఇండియా, స్లోవేకియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ల్యాండ్ రోవర్ కార్లను తయారు చేస్తోంది. ల్యాండ్ రోవర్ పేరును 1948 లో రోవర్ కంపెనీ ఒక యుటిలిటేరియన్ 4WD ఆఫ్-రోడర్ వాహనం కోసం సృష్టించింది. నేటికీ ల్యాండ్ రోవర్ వాహనాల్లో ఖరీదైన, లగ్జరీ స్పోర్ట్ యుటిలిటీ కార్లే ఉంటాయి.
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |