లోహిత్ ఫాంటు
లోహిత్ ఫాంటు రెడ్ హ్యాట్ లినక్సులో వాడుతున్న భారతీయ భాషల ఫాంటుల సమూహము. 2004లో రెడ్ హ్యాట్ సంస్థ ఐదు లిపులకు చెందిన ఖతులను స్వేచ్ఛా సాఫ్టువేరు లైసెన్సుకు అనుగుణంగా జీపీఎల్ ద్వారా విడుదల చేసింది. 2011కి ఈ ఖతులను సిల్ ఓఎఫ్ఎల్ లైసెన్స్ ద్వారా విడుదల చేసింది. [1][2] లోహిత్ అనే పదానికి ఎఱుపు అని సంస్కృతంలో అర్ధం ఉంది. ప్రస్తుతం 21 భారతీయ భాషలను ఈ ఖతి సమూహం ద్వారా రాయవచ్చు. ఈ ఖతులను ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్టు వారు నిర్వహిస్తున్నరు. ఏమయినా లోపాలు లేదా దిద్దుబాట్లకు వీరే తోడ్పాటు అందిస్తున్నారు. లోహిత్ ఖతులు యూనికోడ్ 6 కు అనుగుణంగా ఉన్నాయి.
లోహిత్ ఖతి అందుబాటులో ఉన్న భాషలు:
- అస్సామీ
- బెంగాలీ
- గుజరాతీ
- హిందీ
- కన్నడ
- కాశ్మీరీ
- కొంకణి
- మలయాళం
- మరాఠీ
- నేపాలీ
- ఒరియా
- పంజాబీ
- సింధీ
- తమిళం
- తెలుగు
సాంకేతిక సమాచారం
[మార్చు]లోహిత్ తెలుగు ఖతిలో 556 గ్లిఫ్లు ఉన్నాయి. ఇది సాధారణ ఖతిగా అందుబాటులో ఉంది. బొద్దు వాలు అక్షరాలు విడిగా రూపొందించలేదు. ఇది ఫాంట్ఫోర్జ్ 1.0 సహాయంతో రూపొందించబడింది. ఇది ఒక ట్రూటైప్ ఖతి.
మూలాలు
[మార్చు]- ↑ "లోహిత్ ఖతి". Archived from the original on 2012-02-13. Retrieved 2010-07-26.
- ↑ "Re: [Lohit-devel-list] Relicensing Lohit fonts". 2011-09-15. Archived from the original on 2019-08-29.