లోకం నాగ మాధవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోకం నాగ మాధవి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు బడ్డుకొండ అప్పల నాయుడు
నియోజకవర్గం నెల్లిమర్ల

వ్యక్తిగత వివరాలు

జననం 15 ఫిబ్రవరి 1969
ముంజేరు గ్రామం, భోగాపురం మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
జీవిత భాగస్వామి వెంకట నాగేంద్ర వరప్రసాద్
నివాసం బ్లాక్-4, ఫ్లాట్ నెం 108, మిరాకిల్ సిటీ, ముంజేరు గ్రామం, భోగాపురం మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకురాలు

లోకం నాగ మాధవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, పారిశ్రామిక వేత్త , రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో నెల్లిమర్ల నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

లోకం నాగ మాధవి 1969 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో జన్మించింది. ఆమె 1983 నుండి 85 వరకు విజయనగరంలో ఇంటర్మీడియట్, 1985-89 వరకు ఆంధ్రయూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి అనంతరం 1989లో అమెరికా వెళ్ళి 1989-92 వరకు కంప్యూటర్‌లో ఎం.ఎస్ పూర్తి చేసి ఉద్యోగ రీత్య అక్కడే స్థిరపడి 2002లో స్వదేశానికి తిరిగి వచ్చి విజయనగరం జిల్లా, భోగాపురం ప్రాంతంలో మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాల, మిరాకిల్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించి వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాలు కల్పించింది.

వివాహం

[మార్చు]

మాధవి ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన కాలంలో తన సహా విద్యార్థి వెంకట నాగేంద్రను ప్రేమించి వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

లోకం నాగ మాధవి 2019లో జనసేన పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో నెల్లిమర్ల నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి పోటీ చేసి 7,633 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆమె ఆ తరువాత నియోజకవర్గం సమస్యలపై అవగాహన తెచ్చుకొని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో నెల్లిమర్ల నియోజకవర్గం నుండి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీ చేసి నుండి తన సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుపై 39,720 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[4][5] ఈ ఎన్నికలలో మాధవికి 109915 ఓట్లు రాగా, ప్రత్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుకు 70086 ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్లలలో ఈమెకు 1419 ఓట్లు రాగా, బడ్డుకొండకు 602, సర్వీసు ఓట్లలలో నాగమాధవికి 177 ఓట్లు రాగా, బడ్డుకొండకు 75 ఓట్లు లభించాయి. దింతో ఆమెకు 38,801 ఓట్లు మెజారిటీతో పాటు పోస్టల్ బ్యాలెట్లో 817 ఓట్లు మెజారిటీ, సర్వీసు ఓట్లలలో 102 మెజారిటీ లభించింది.  

మూలాలు

[మార్చు]
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Prajasakti (4 June 2024). "నెల్లిమర్లలో మాధవికే పట్టం". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  4. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Nellimarla". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  5. BBC News తెలుగు (8 May 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకతలేంటి?". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.