Jump to content

లేవియ కాండము

వికీపీడియా నుండి



లేవీయ కాండం రచయిత మోషే. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో పవిత్రుడైన దేవుడు పాపాల్ని క్షమించే విధానం, పవిత్ర అర్పణలు, యాజకుని పవిత్ర చర్య, పవిత్ర ప్రవర్తన కోసం చట్టాలు, పవిత్రమైన పండుగలు, మహోత్సవాలు, పవిత్ర ప్రవర్తనకు, అపవిత్ర ప్రవర్తనకు ప్రతిఫలాలు, మొదలగు విషయాలు చెప్పబడినవి.

ఈ గ్రంథములో అయిదు రకములైన బలులు ఉన్నవి

  1. దహన బలి
  2. నైవేద్య బలి
  3. సమాధానబలి
  4. పాపపరిహారార్థబలి
  5. అపరార్ధ పాప బలి

ఈ 5 బలుల యందు క్రీస్తు ఒకే బలిలోని ఆయన విలువలను సూచించుచున్నది. లేవి కాండములో ఇస్రాయేలీయులకు నిర్దేశించబడిన 7 పండుగల గూర్చి వ్రాయబడి ఉంది. లేవీకాండములోని 27అధ్యాయములలో 56 సార్లు ధర్మశాస్త్ర విధులను దేవుడు మోషేకు  ఇచ్చినట్లు వ్రాయబడింది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. అని ఈ గ్రంథములో ఐదు సార్లు వ్రాయబడినది. [1]

మూలాలు

[మార్చు]
  1. "లేవీ కాండము- గ్రంధ వివరణ - Servant Of Jesus Life Society" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-07-21. Archived from the original on 2024-06-17. Retrieved 2024-06-17.

బాహ్య లంకెలు

[మార్చు]