Jump to content

లేటెక్స్

వికీపీడియా నుండి
రబ్బరు ఉత్పత్తి కోసం చెట్ల నుంచి లేటెక్స్ ను సేకరించడం

లేటెక్స్ (Latex) అనేది నీటిలో పాలిమర్ సూక్ష్మకణాలు కలిసిన తరళపదార్థం (Emulsion).[1] ఇవి ప్రకృతిలో సహజంగానూ లభిస్తాయి, కృత్రిమంగా కూడా తయారవుతాయి.

ఇది ప్రకృతిలో సుమారు 10 శాతం పుష్పించే మొక్కల్లో పాలలాంటి ద్రవంలా లభ్యమవుతుంది.[2] ఇది గాలి తగిలి గడ్డకడుతుంది. ఇందులో మాంసకృతులు, పిండిపదార్థాలు, చక్కెరలు, నూనెలు, టానిన్లు, రెసిన్లు, జిగుర్లు మొదలైనవన్నీ ఉంటాయి. చాలావరకు లేటెక్స్ తెలుపు రంగులో ఉంటుంది, కానీ కొన్ని మాత్రం పసుపు పచ్చ, నారింజ రంగులో కూడా ఉంటాయి. లేటెక్స్ అనే పదాన్ని దాన్నుంచి తయారయ్యే సహజ రబ్బరును సూచించడానికి కూడా వాడుతారు. ఈ రబ్బరుతో చేతి తొడుగులు, కండోమ్స్, వస్త్రాలు, బుడగలు తయారు చేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. Wang, Hui; Yang, Lijuan; Rempel, Garry L. (2013). "Homogeneous Hydrogenation Art of Nitrile Butadiene Rubber: A Review". Polymer Reviews. 53 (2): 192–239. doi:10.1080/15583724.2013.776586. S2CID 96720306.
  2. Anurag A. Agrawal; d Kotaro Konno (2009). "Latex: a model for understanding mechanisms, ecology, and evolution of plant defense Against herbivory". Annual Review of Ecology, Evolution, and Systematics. 40: 311–331. doi:10.1146/annurev.ecolsys.110308.120307.
"https://te.wikipedia.org/w/index.php?title=లేటెక్స్&oldid=4394888" నుండి వెలికితీశారు