లావణ్య విత్ లవ్‌బాయ్స్
స్వరూపం
లావణ్య విత్ లవ్‌బాయ్స్ | |
---|---|
దర్శకత్వం | వడ్డేపల్లి కృష్ణ |
స్క్రీన్ ప్లే | వడ్డేపల్లి కృష్ణ |
నిర్మాత | నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి |
తారాగణం | పావని, కిరణ్, పరమేశ్వర్ హివ్రాలే, సాంబ |
ఛాయాగ్రహణం | తోట.వి.రమణ |
సంగీతం | యశోకృష్ణ |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2017 అక్టోబర్ 6 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లావణ్య విత్ లవ్‌బాయ్స్ 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1] రాజ్యలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వం వహించాడు.[2] పావని, కిరణ్, పరమేశ్వర్ హివ్రాలే, సాంబ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను & ఆడియోను జులై 11న హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.[3],[4] లావణ్య విత్ లవ్‌బాయ్స్ సినిమాను అక్టోబర్ 6న విడుదల చేశారు.[5] లావణ్య విత్ లవ్‌బాయ్స్ సినిమాకుగాను దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ ప్రశంసా దర్శకుడిగా దాసరి 2018 ఫిలిం అవార్డును అందుకున్నాడు.[6]
నటీనటులు
[మార్చు]- పావని
- కిరణ్
- పరమేశ్వర్ హివ్రాలే
- సాంబ
- కాశీవిశ్వనాథ్
- పరుచూరి గోపాలకృష్ణ
- హేమసుందర్
- స్వరూప
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రాజ్యలక్ష్మి క్రియేషన్స్
- నిర్మాత: నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వడ్డేపల్లి కృష్ణ
- సంగీతం: యశోకృష్ణ
- సినిమాటోగ్రఫీ: తోట.వి.రమణ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (19 February 2017). "ప్రేమ గొప్పతనం". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Sakshi (4 October 2017). "స్వచ్ఛమైన ప్రేమ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Andhra Bhoomi (11 July 2017). "లావణ్య విత్ లవ్‌బాయ్స్ గీతావిష్కరణ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Sakshi (11 July 2017). "కొత్తవాళ్లను ప్రోత్సహించాలి". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Zee Cinemalu (3 October 2017). "లావణ్య విత్ లవ్‌బాయ్స్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Andhra Jyothy (6 May 2018). "ఘనంగా ఫాస్ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల ప్రధానోత్సవం". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.