Jump to content

లక్ష్మీనారాయణ్ మిశ్రా

వికీపీడియా నుండి
లక్ష్మీనారాయణ్ మిశ్రా
ఝార్సుగూడలోని లక్ష్మీనారాయణ కళాశాలలో లక్ష్మీనారాయణ్ మిశ్రా విగ్రహం
జననం(1904-04-11)1904 ఏప్రిల్ 11
మరణం1971 మే 30(1971-05-30) (వయసు 67)
ఝార్సుగూడ (హత్య)
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వివిధ జాతీయ ఉద్యమాలు

లక్ష్మీనారాయణ్ మిశ్రా ( 1904 ఏప్రిల్ 11 - 1971 మే 30) ఒడిశా రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. రచయిత. పశ్చిమ ఒడిశాలో అత్యంత చురుకైన జాతీయవాదులలో ఇతడు ఒకడు.[1][2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

లక్ష్మీనారాయణ్ మిశ్రా 1904, ఏప్రిల్ 11న ఒడిశా రాష్ట్రంలోని ఉమ్మడి సంబల్పూర్ జిల్లాలోని (ప్రస్తుత సంబల్పూర్ జిల్లా) మధ్యతరగతి బ్రాజ్మిన్ కుటుంబానికి చెందిన కృపాసింధు మిశ్రా - రేవతి దేవి దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. సంబల్‌పూర్‌లోని గురుపాద ప్రాథమిక పాఠశాల, సిబిఎస్ జిల్లా పాఠశాలలలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడ అతను మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.

ఉద్యమం

[మార్చు]

విద్యార్థిగా ఉన్న సమయంలోనే బ్రిటిష్ అణచివేత పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించాడు. చివరికి తన పాఠశాలచదువును వదిలేసి భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. రచయితగా, వక్త పేరు సంపాదించాడు.[3] సంస్కృతం, ఉర్దూ, బెంగాలీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.

ఇతర ఉద్యమాలు

[మార్చు]

పశ్చిమ ఒడిశాలో చురుకైన జాతీయవాదిగా మిశ్రా కీలకపాత్ర పోషించాడు.[4][4][5] స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు పదిహేడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు.[6] జైలులో ఉన్నప్పుడు మతం, సంస్కృతి, రాజకీయాలను అభ్యసించాడు.[7][8]

సహాయ నిరాకరణోద్యమం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా డ్రైవ్, నాగపూర్ ఫ్లాగ్ మార్చి, జమీందార్లు-రాష్ట్ర పాలకులపై పోరాటం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలలో పాల్గొన్నాడు.

మరణం

[మార్చు]

1970, మే 31న ఝార్సుగూడలో రైలు ప్రయాణంలో హత్యకు గురయ్యాడు.[9]

గౌరవాలు

[మార్చు]

నారాయణ్ గౌరవార్థం ఝార్సుగూడలోని లక్ష్మీనారాయణ కళాశాలతోపాటు వివిధ సంస్థలకు అతని పేరును పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. New Aspects of History of Orissa. Sambalpur University. 1985.
  2. Freedom Fighters Remember. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. 1997. pp. 186–. ISBN 978-81-230-0575-1.
  3. Yamin, Mohammed. Impact of Islam on Orissan Culture (in ఇంగ్లీష్). Readworthy. ISBN 978-93-5018-102-7.
  4. 4.0 4.1 "Reminiscing Odisha's legacy in Quit India Movement - OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-12. Retrieved 2021-10-03.
  5. "The Orissa Historical Research Journal". The Orissa Historical Research Journal(2019). LVIII No. 1&2. Dr. Jayanti Rath: 47.
  6. Das, Manas Kumar. NATIONALIST MOVEMENT IN ODISHA (in ఇంగ్లీష్). Lulu.com. ISBN 978-0-359-78858-3.
  7. "Odisha review April 2010". Freedom Movement in Jharsuguda District by Dr. Byomakesh Tripathy.
  8. Acharya, Pritish (2008-03-11). National Movement and Politics in Orissa, 1920-1929 (in ఇంగ్లీష్). SAGE Publications India. ISBN 978-81-321-0001-0.
  9. "Freedom Movement in Jharsuguda District" (PDF). 2018-12-20. Archived from the original (PDF) on 2018-12-20. Retrieved 2021-10-03.