లక్ష్మణ్ బాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మణ్ బాగ్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు సంతోష్ సింగ్ శాలుజా
నియోజకవర్గం కాంతబంజీ

వ్యక్తిగత వివరాలు

జననం 1976
ఖుతులముండా, కాంతాబంజీ జిల్లా, ఒడిశా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు శంకర్ బ్యాగ్
జీవిత భాగస్వామి పబితా
సంతానం హేమాంగిని, తపన్ కుమార్
వృత్తి రాజకీయ నాయకుడు

లక్ష్మణ్ బాగ్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంతబంజీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఒడిశా 17వ శాసనసభకు ఎన్నికై ముఖ్యమంత్రి & బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ను ఓడించాడు.[1][2]

వృత్తి జీవితం

[మార్చు]

లక్ష్మణ్‌ బాగ్ రోజువారీ కూలీగా పనిచేసేవాడు. అతను ట్రక్కుల నుండి సరుకులను లోడింగ్ & అన్‌లోడ్ చేసే కూలీగా పని చేశాడు. ఆ తరువాత ఆయన తన స్వంత ట్రక్కులో పెట్టుబడి పెట్టాడు, రవాణా రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత తన వ్యాపారంపై దృష్టి సారించి అభివృద్ధి చెంది భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.[3]

రాజకీయ నాయకుడు

[మార్చు]

లక్ష్మణ్‌ బాగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్‌పై కాంతబంజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 30,961 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ సింగ్ సలూజాపై 128 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ ఎన్నికలలో సంతోష్ సింగ్ సలూజాకు 64,246 ఓట్లు రాగా, లక్ష్మణ్ బాగ్‌కు 64,118 ఓట్లు వచ్చాయి.

లక్ష్మణ్‌ బాగ్ 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా కాంతబంజీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై 16344 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాయ్డు. ఈ ఎన్నికలలో లక్ష్మణ్‌ బాగ్ కు 90,876 ఓట్లను సాధించగా, నవీన్ పట్నాయక్ 74,532 ఓట్లను సాధించాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Laxman Bag: Odisha's giant killer who defeated Naveen Patnaik". 6 June 2024. Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. The Hindu (5 June 2024). "In stunning upset, Odisha CM defeated by former daily wager turned BJP candidate" (in Indian English). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  3. Free Press Journal (6 June 2024). "Who Is Laxman Bag, Who Won Against 5 Times Elected Naveen Patnaik In Odisha?" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 odisha Assembly Election Results - Kantabanji". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  5. The Indian Express (6 June 2024). "Meet the giant killer who dealt Naveen Patnaik his first political defeat: BJP's Laxman Bag" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  6. TV9 Telugu (6 June 2024). "కూలీ చేతిలో ఓడిపోయిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఇంతకీ లక్ష్మణ్ ఎవరు..?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)